Tuesday, August 11, 2026
HomeLATESTMega heros:విజయాలతో దూసుకుపోతున్న మెగా ఫ్యామిలీ హీరోస్!

Mega heros:విజయాలతో దూసుకుపోతున్న మెగా ఫ్యామిలీ హీరోస్!

Mega heros: మెగా ఫ్యామిలీ హీరోలకు ఈ మధ్యకాలంలో బాగా కలిసి వచ్చింది. ముఖ్యంగా ఇద్దరి హీరోలు ఇప్పుడు తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధమయ్యారు.

on
- Advertisement -banner Ad

Mega heros:తెలుగు సినీ పరిశ్రమలో మెగా ఫ్యామిలీకి ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా అభిమానుల కోసం ఎలాంటి పని చేయడానికి అయినా సిద్ధంగానే ఉంటారు. చాలా గ్యాప్ తర్వాత మెగా కుటుంబంలో ఇప్పుడు మళ్లీ వరుసగా హీరోలు సైతం సక్సెస్ లు కొడుతూ ఫుల్ ఫామ్ లోకి వచ్చారు. చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, వరుణ్ తేజ్, సాయి ధరంతేజ్, వైష్ణవ్ తేజ్ ఇలా మెగా హీరోలంతా కూడా పడుతూ లేస్తూ ఉన్నారు. ఒక హిట్టు కొడితే చాలు రెండు ఫ్లాపులు అన్నట్లుగా ఉండేది.

మెగా హీరోలకు కలిసొచ్చిన 2026..

కానీ గత సంవత్సర కాలంగా మెగా ఫ్యామిలీలో ఒకరి తర్వాత మరొక హీరో హిట్ కొడుతూ దూసుకుపోతున్నారు. గత ఏడాది సెప్టెంబర్లో పవన్ కళ్యాణ్ నటించిన ఓజి సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నారు. పవన్ కళ్యాణ్ కెరియర్ లోనే 300 కోట్ల రూపాయలతో భారీ కలెక్షన్స్ రాబట్టి సరికొత్త రికార్డులను సృష్టించింది. ముఖ్యంగా ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ స్టైల్ కి సైతం అభిమానులు ఫిదా అయ్యారు. మెగాస్టార్ చిరంజీవి కూడా ఈ ఏడాది సంక్రాంతికి మన శంకర వరప్రసాద్ గారు సినిమాతో భారీ విజయాన్ని అందుకొని చిరంజీవి కెరీర్ లోనే అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన చిత్రంగా నిలిచింది.

- Advertisement -
Advertisement

ALSO READ:Bandla Ganesh:మరో వారసుడు టాలీవుడ్ ఎంట్రీ..!

అటు రాంచరణ్.. ఇటు నిహారిక..

రామ్ చరణ్ కూడా ఈ ఏడాది జూన్లో విడుదలైన పెద్ది సినిమాతో భారీ విజయాన్ని అందుకోవడమే కాకుండా ఏకంగా 400 కోట్లకు పైగా కలెక్షన్స్ తో నిలిచారు. ఈ సినిమాలో రామ్ చరణ్ నటన అభిమానులను బాగా ఆకట్టుకుంది. ఇక మెగా డాటర్ నిహారిక నిర్మాతగా కూడా మంచి సక్సెస్ అందుకోవడమే కాకుండా కమిటీ కుర్రాళ్ళు సినిమాకి నేషనల్ అవార్డు కూడా సంపాదించింది. అలాగే ఏడాది రాకాస అనే చిత్రంతో మంచి విజయాన్ని అందుకుంది. గత కొన్నేళ్ళగా వరుసగా ప్లాపులను చూస్తున్న వరుణ్ తేజ్.. ఆగస్టు 7వ తేదీన విడుదలైన కొరియన్ కనకరాజు సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నారు.

- Advertisement -
Advertisement

ALSO READ:Hero Vishal:తెలుగు హీరోపై విశాల్ మైండ్ బ్లోయింగ్ కామెంట్స్!

సాయి ధరంతేజ్, వైష్ణవ్ సంగతేంటి?

ఇలా మెగా ఫ్యామిలీ సక్సెస్ ట్రాక్ ని కంటిన్యూ చేశారు వరుణ్ తేజ్. దీంతో నెక్స్ట్ మెగా ఫ్యామిలీ నుంచి వచ్చే హీరో సినిమా పైన మరింత అంచనాలు పెరిగిపోయాయి. సాయి ధరంతేజ్ విరుపాక్ష సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నారు. ఆ తర్వాత బ్రో సినిమా పెద్దగా ఆకట్టుకోలేదు ఇప్పుడు తాజాగా సంబరాలు ఏటిగట్టు సినిమాతో రాబోతున్నారు. ఈ సినిమాతో సాయి ధరంతేజ్ హిట్ కొడితే మాత్రం మెగా సక్సెస్ ట్రాక్ ని ముందుకు తీసుకువెళ్తారని అభిమానులు కూడా భావిస్తున్నారు.అయితే ఈ సినిమాకి ఇంకా రిలీజ్ డేట్ ప్రకటించలేదు. సాయి ధరంతేజ్ తమ్ముడు వైష్ణవ్ కూడా ఈ మధ్యకాలంలో పెద్దగా సక్సెస్ అందుకోలేదు. అందుకే తదుపరి సినిమా విషయంపై కూడా ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. ఏది ఏమైనా మొత్తానికి మెగా ఫ్యామిలీ హీరోలు (Mega heros) సైతం వరుసగా హిట్ కొడుతూ ఫ్యాన్స్ ను ఖుషీ చేస్తున్నారు.

- Advertisement -
Advertisement

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you