Thursday, August 20, 2026
HomeLATESTBigg Boss:బిగ్‌బాస్‌ను మించిపోయిన అగ్నిపరీక్ష.. కంటెస్టెంట్లకు చుక్కలు!

Bigg Boss:బిగ్‌బాస్‌ను మించిపోయిన అగ్నిపరీక్ష.. కంటెస్టెంట్లకు చుక్కలు!

Bigg Boss:బిగ్‌బాస్‌ హౌస్‌లోకి వెళ్లేందుకు నిర్వహిస్తున్న అగ్నిపరీక్ష కార్యక్రమం రోజురోజుకూ ఆసక్తిని పెంచుతోంది.

on
- Advertisement -banner Ad

Bigg Boss:బిగ్‌బాస్ హౌస్‌లోకి పంపించేందుకు నిర్వహిస్తున్న అగ్నిపరీక్ష కార్యక్రమం సోషల్ మీడియాలో ఎంత హాట్ టాపిక్‌గా ట్రెండ్ అవుతుందో అందరికీ తెలిసిందే. బిగ్‌బాస్ అనుకుంటే.. బిగ్‌బాస్‌ను మించి పోయే రేంజ్‌లోనే తయారైపోయింది ఈ అగ్నిపరీక్ష అంటూ జనాలు కామెంట్స్ చేస్తున్నారు. బిగ్‌బాస్‌లోకి వెళ్లడమేమో కానీ, అంతకంటే ముందే అగ్నిపరీక్ష షోలోనే కంటెస్టెంట్లకు చుక్కలు చూపిస్తున్నారు.. అసలైన టార్చర్ చూపిస్తున్నారు అంటూ ఘాటుగా రియాక్ట్ అవుతున్నారు.

బిగ్‌బాస్ కంటే కఠినమైన టాస్కులు:

సెలబ్రిటీలు నేరుగా బిగ్‌బాస్‌లోకి(Bigg Boss) వచ్చి తమను తాము నిరూపించుకోవడానికి టాస్కులు ఆడుతూ ఉంటారు. అయితే ఇక్కడ సామాన్యులు మాత్రం అంతకంటే కఠినమైన టాస్కులను, అగ్నిపరీక్షలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అగ్నిపరీక్ష సీజన్ 2 సెకండ్ రౌండ్ ప్రారంభమైంది. 18 మంది కంటెస్టెంట్లను కంటెస్టెంట్లుగా మార్చడానికి ఇంత టార్చర్ చూపిస్తూ ఉంటే.. ఇక హౌస్‌లోపల ట్రోఫీ కోసం వీరు ఇంకా ఎంత పెద్ద యుద్ధం చేయాలో ఏమో అంటూ జనాలు ఘాటుగా రియాక్ట్ అవుతున్నారు.

- Advertisement -
Advertisement

చెత్త టాస్క్‌తో రెండో రౌండ్ ప్రారంభం:

మొత్తానికి అగ్నిపరీక్ష 2లో రెండో రౌండ్ ఒక చెత్త టాస్క్‌తో మొదలైంది అంటూ జనాలు కామెంట్స్ చేస్తున్నారు. వారం రోజులుగా కుళ్లబడిన చెత్త కంపును భరిస్తూ అక్కడే లాక్ ఓపెన్ చేసేందుకు కావాల్సిన తాళం కోసం వెతకాల్సి ఉంటుంది. లాక్ తెరిచిన తర్వాత అందులో ఉన్న జ్యూస్‌ను పూర్తిగా తాగితేనే ఆ టాస్క్ ఫుల్‌గా కంప్లీట్ అయినట్లు లెక్కలోకి వస్తుంది.

బ్రేకప్ లవ్ స్టోరీలతో ఎమోషనల్ టాస్క్ :

ఇక రెండో రౌండ్‌లో రెండో టాస్క్‌లో ‘బ్రేకప్ లవ్ స్టోరీలు’ అంటూ కొత్తగా ట్రై చేశారు. ముందుగా లవ్ స్టోరీస్ గురించి శ్రీముఖి అడగ్గా ఎవరూ స్పందించలేదు. దీంతో ఒక్కసారిగా అంతా నిశ్శబ్ద వాతావరణం కనిపించింది. అయితే బ్రేకప్ లవ్ స్టోరీ గురించి అడిగినప్పుడు మాత్రం ఒక్కొక్కరుగా తమ మనసులోని బాధను బయటపెడుతూ వచ్చారు.

- Advertisement -
Advertisement

తూ నా బ్రతుకు’ టాటూతో ధైర్యం:

టాటూ టాస్క్ ఎక్కడ చూసినా కామన్‌గా మారిపోయింది అని చెప్పడంలో సందేహం లేదు. ప్రతి సీజన్‌లోనూ ఒక వ్యక్తి టాటూ వేయించుకోవాల్సిందే. అలానే ఈ అగ్నిపరీక్షలో కూడా దాదాపు అందరూ టాటూ వేయించుకోవడానికి రెడీ అయ్యారు. కానీ అవకాశం ఒక్కరికే వచ్చింది. అతను ‘తూ నా బ్రతుకు’ అనే టాటూను చేతిపై వేయించుకొని ధైర్యం ప్రదర్శించి కంటెస్టెంట్‌గా మారిపోయాడు.

also read:OTT:ఘట్టమనేని జయకృష్ణ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది.. ఎక్కడంటే?

- Advertisement -
Advertisement

జుట్టు కత్తిరించుకుని కంటెస్టెంట్‌గా:

ఫైనల్‌గా జుట్టు కత్తిరించుకోవడంలో నెల్లూరు అమ్మాయి బాగీకి అవకాశం దక్కించుకుంది. ఆమె ధైర్యంగా తన హెయిర్ కత్తిరించుకొని కంటెస్టెంట్‌గా మారింది. ఇలా ఒకటి కాదు, రెండు కాదు.. వెరైటీ వెరైటీ టాస్కులు ఇచ్చి సామాన్య జనాల సహనాన్ని పరీక్షిస్తున్నారు అగ్నిపరీక్ష టీం అంటూ ఘాటుగా సోషల్ మీడియాలో ట్రోలింగ్ ప్రారంభమైంది.

also read:Ticket price:తెలంగాణలో టికెట్ల ధరలు పెంపు..!

అగ్నిపరీక్షపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ :

ఫైనల్‌గా నలుగురు కంటెస్టెంట్లుగా మారి చివరికి పోటీకి సిద్ధమయ్యారు. అగ్నిపరీక్ష సీజన్ 2లో రెండో రౌండ్ ఇంకా కొనసాగిపోతుంది. రానున్న రోజుల్లో సామాన్యులు ఇంకా ఎంత కఠినమైన టాస్కులు ఎదురుకోబోతున్నారో అంటూ జనాలు ఘాటుగా రియాక్ట్ అవుతున్నారు. అసలు ఈ అగ్నిపరీక్ష బిగ్‌బాస్ హౌస్‌లోకి వెళ్లడానికా? లేకపోతే జనాలను విసుగు తెప్పించడానికా? అనే సందేహం కూడా వ్యక్తమవుతోంది.

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you