Tollywood: చాలామంది సినీ సెలబ్రిటీలకు, రాజకీయ నాయకులకు మంచి అనుబంధం ఉంటుంది. ముఖ్యంగా కొంతమంది సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు కలిసి చదువుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఈ విషయాలను ఏదో ఒక ఇంటర్వ్యూలలో తెలియజేసినప్పుడు అందరూ ఆశ్చర్యపోతుంటారు. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అలాగే అక్కినేని హీరో సుమంత్ ఓకే క్లాస్మేట్స్. అలాగే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, బాలకృష్ణ ఇలా ఎంతోమంది సినీ ప్రముఖులు, రాజకీయనేతలు కలిసి చదువుకున్న వారు ఉన్నారు. ఇప్పుడు తాజాగా జబర్దస్త్ కమెడియన్, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తన క్లాస్మేట్ అంటూ చెప్పి అందరిని ఆశ్చర్యపరిచారు.
తెలంగాణ సీఎం నా స్నేహితుడు..
సీఎం రేవంత్ రెడ్డి కి చిన్నప్పటి నుంచే రాజకీయాల పైన ఎక్కువగా ఆసక్తి ఉండేదని , అందుకు తగ్గట్టుగానే ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి పదవిని అధిరోహించారంటూ చెప్పుకొచ్చారు ఆ జబర్దస్త్ కమెడియన్. ఆ కమెడియన్ ఎవరో కాదు తెలుగులో(Tollywood) నటుడుగా 150కు పైగా చిత్రాలలో నటించి తన కామెడీ టైమింగ్ తో బాగా అలరించిన కారుమంచి రఘు గురించి చెప్పాల్సిన పనిలేదు.. ఎన్టీఆర్ నటించిన ఎన్నో చిత్రాలలో తన కామెడీతో ఆకట్టుకున్న రఘు జూనియర్ ఎన్టీఆర్కి వీర అభిమాని గా పేరు సంపాదించారు. ఆయన కోసం తాను ఏ పని చేయడానికి అయినా సిద్ధంగానే ఉంటాను అని ఎన్నో సందర్భాలలో తెలియజేశారు రఘు.
also read:Hemachandra:విడాకులపై హేమచంద్ర సెన్సేషనల్ కామెంట్స్..ఇక కళ్లు చల్లబడ్డాయా..?
ఆ పొలిటికల్ లీడర్స్ ఇద్దరు నా క్లాస్మేట్స్..
జబర్దస్త్ లో రోలర్ రఘుగా ఆడియన్స్ ని ఆకట్టుకున్న రఘు ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. రఘు అక్కడ తన పర్సనల్ లైఫ్ విషయాలను పంచుకున్నారు.ఈ క్రమంలోని రాజకీయాల గురించి స్పందిస్తూ తాను సీఎం రేవంత్ రెడ్డి, జెట్టి కుసుమ కుమార్ ముగ్గురం కూడా ఒకే క్లాస్మేట్స్ అంటూ ఒకే బెంచ్ మీద కూడా కూర్చునేవాళ్ళమంటూ తెలిపారు. 1989-90 ఆ సమయంలో దోమలగూడ AV కాలేజీలో కలిసి చదువుకున్నామంటూ తెలియజేశారు. అంతేకాకుండా కుసుమ కుమార్ తనకి బావ అవుతారని అప్పటికే వారిద్దరూ కలిసి కూడా పొలిటికల్ గా తిరిగే వాళ్ళని తెలిపారు.
also read:Irumudi :ఇరుముడి మూవీ రివ్యూ: రవితేజ కెరీర్‌లో డిఫరెంట్ ఎమోషనల్ జర్నీ.. ఎలా ఉందంటే?
రఘు పొలిటికల్ ఎంట్రీ..
తనకు మాత్రం పెద్దగా రాజకీయాలలో ఇంట్రెస్ట్ లేకపోవడంతో వాళ్లతో తిరగలేదని ఇక నాకు మొదటినుంచి టిడిపి పార్టీ అంటే మంచి అభిమానం ఉన్నది.. అవసరం వచ్చినప్పుడు కచ్చితంగా పార్టీ కోసమే ప్రచారం చేయడానికి తన సిద్ధంగానే ఉన్నాను అంటూ రఘు తెలియజేశారు. ప్రస్తుతం కమెడియన్ రఘు చేసిన ఈ కామెంట్స్ సైతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. అయితే ఈ మధ్యకాలంలో రఘు ఎక్కడ కూడా సినిమాలలో పెద్దగా కనిపించడం లేదు. ప్రస్తుతం తన బిజినెస్లను సొంతంగా చూసుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి రాబోయే రోజుల్లో తిరిగి మళ్లీ అలా కనిపిస్తారో లేదో చూడాలి మరి రఘు.




