Hero Siddharth :వెండితెరపై విభిన్నమైన పాత్రలను ఎంచుకుంటూ దక్షిణాది సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న సిద్ధార్థ్.. ఒకప్పుడు లవర్ బాయ్ గా పేరు సంపాదించారు. తన కెరియర్ లో బాయ్స్ సినిమాతో మంచి పాపులారిటీ సంపాదించి, ఆ తరువాత నువ్వొస్తానంటే నేనొద్దంటానా, ఆట, ఓయ్, అనగనగా ఒక ధీరుడు, ఓ మై ఫ్రెండ్, బొమ్మరిల్లు, చిన్న తదితర చిత్రాలతో మంచి పేరు సంపాదించారు. అయితే ఈ మధ్యకాలంలో వచ్చిన సినిమాలేవి కూడా పెద్దగా ఆకట్టుకోలేదు. అయినా కూడా పలు రకాల సినిమాలలో వెబ్ సిరీస్లలో నటిస్తున్న సిద్ధార్థ్ ఇటీవలే ఆపరేషన్ సఫేద్ సాగర్ అనే వెబ్ సిరీస్లో నటించారు. ఇందులో తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నారు.
స్పెషల్ సాంగ్ లపై సిద్ధార్థ్ కామెంట్..
కేవలం నటన మాత్రమే కాకుండా సమాజం పట్ల కూడా బాధ్యతతో అప్పుడప్పుడు పలు రకాల విషయాల పైన స్పందిస్తుంటారు. తాజాగా సిద్ధార్థ్ చేసిన కామెంట్స్ సినీ వర్గాలలో తీవ్ర చర్చనీయాంశంగా మారుతున్నాయి. ముఖ్యంగా సినీ పరిశ్రమలో మహిళలను చిత్రీకరించే ధోరణి పైన స్పెషల్ సాంగులు పైన చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. సినిమా పాత్రల సెలక్షన్ విషయంపై నటుడుగా తనకి కొన్ని స్పష్టమైన హద్దులు , నైతిక సూత్రాలు ఉన్నాయంటూ తెలిపారు. నేను కేవలం హీరో పాత్రలకే పరిమితం కావాలనుకోను. ఒకవేళ సినిమాలో కథ డిమాండ్ చేస్తే విలన్ పాత్రలు కూడా చేయడానికి తాను ఎలాంటి మొహమాటపడను అంటూ తెలిపారు.
also read:spirit movie :స్పిరిట్ మూవీ నుంచి అందుకే ప్రకాష్ రాజ్ తప్పుకున్నారా..?
అలాంటి పాత్రలు నేను చేయను..
కానీ తెరపైన ఒక చెడ్డ వ్యక్తిగా నటిస్తూ అతడిని హీరోగా, ఆదర్శప్రాయుడిగా చూపించే పనిని మాత్రం తాను ఎప్పటికీ చేయనని తెలిపారు. సమాజానికి తప్పుడు సందేశం వెళ్లేలా ఉండే పాత్రలను, కంటెంట్ ను తాను ఎప్పటికీ దూరంగానే ఉంటానంటూ తెలిపారు. ఈ క్రమంలోనే స్పెషల్ సాంగ్స్ పైన తీవ్రమైన స్థాయిలో అసంతృప్తిని తెలియజేశారు సిద్ధార్థ్(Hero Siddharth). ఒక స్త్రీ చుట్టూ 40 మంది మగవారు చేరి ఆమెతో ఎలాగైనా ప్రవర్తించవచ్చనే భావన కలిగినా.. ఐటెం సాంగ్స్ ను తన కెరియర్ లో ఎప్పుడు భాగం కాలేదని, ఇక ముందు కూడా భాగం కాదంటూ తెలిపారు.
also read:YouTuber :రూ.23 లక్షలు నష్టపోయిన నటుడు అంజిమామ..!
అప్పుడే అలాంటి పాత్రలు చేస్తాను..
ఒకవేళ నేను అలాంటి సీన్స్ లలో కనిపించాల్సి వస్తే అది పూర్తిస్థాయి క్రూరమైన విలన్ పాత్ర అయినప్పుడే సాధ్యమవుతుందని.. ఎందుకంటే విలన్ చివరిలో ఘోరంగా హతమవుతాడు కాబట్టి అందుకు అంగీకరిస్తాను. అంతేకానీ చివరిలో చెడు పాత్రలు గెలిచి సినిమా చూసి ఇంటికి వెళ్లి యువత అలాంటి తప్పుడు పాత్రలను ఆదర్శంగా తీసుకునే వాటిని తాను ఏమాత్రం ఇష్టపడనని తెలిపారు.




