Monday, August 24, 2026
HomeLATESTEshwar Sai:మాధురిపై ఫోక్ డాన్సర్ ఈశ్వర్ సాయి షాకింగ్ కామెంట్స్!

Eshwar Sai:మాధురిపై ఫోక్ డాన్సర్ ఈశ్వర్ సాయి షాకింగ్ కామెంట్స్!

Eshwar Sai: మాధురి రాథోడ్ తో రిలేషన్ పై తొలిసారి ఈశ్వర్ సాయి స్పందించి అందరిని ఆశ్చర్యపరిచారు. ముఖ్యంగా ఆమె మంచిది అని , తప్పంతా తనదేనంటూ చెప్పుకొచ్చారు.

on
- Advertisement -banner Ad

Eshwar Sai:గడిచిన రెండు మూడు రోజుల క్రితం ఫోక్ డాన్సర్ గా పేరు సంపాదించిన ఈశ్వర్ సాయి, తన తోటి ఫోక్ ఆర్టిస్టు మాధురి రాథోడ్ తో కలిసి ఓకే గదిలో ఉన్న సమయంలో ఈశ్వర్ సాయి భార్య శరణ్య వారిని ప్రత్యేకంగా పట్టుకోవడంతో ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ విషయం పైన చాలా రకాల రూల్స్ కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ విషయం పైన ఫోక్ ఆర్టిస్ట్ మాధురి రాథోడ్ కూడా స్టేషన్ కి వెళ్లి మరి , ఈశ్వర్ సాయి, ఆయన భార్య పైన కూడా కంప్లైంట్ ఇచ్చింది.

తొలిసారి స్పందించిన ఈశ్వర్ సాయి..

తాజాగా ఇటీవలే ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన ఈశ్వర్ సాయి(Eshwar Sai) అసలు విషయం పైన మాట్లాడారు. తన వ్యక్తిగత జీవితంలో చాలా తీవ్రమైన ఒత్తిళ్లు ఎదుర్కొన్నానని.. ఇంట్లో కొంచెం డిస్టర్బెన్స్ అయ్యిందని, కొంచెం ప్రెజర్ అయ్యింది. అటు ఫ్యామిలీ ప్రెజర్స్, బిజినెస్ ప్రెజర్స్ కావచ్చు.. చాలా ఒత్తిడి ఉండేది అంటూ ఆయన తెలిపారు. అలాంటి పరిస్థితులలో ఒక మగాడికి మనశ్శాంతి అవసరమని, తాను కూడా అదే కోరుకున్నాను అంటూ ఈశ్వర్ సాయి తెలిపారు.

- Advertisement -
Advertisement

ALSO READ:Vishwanath and sons:విశ్వనాథ్ అండ్ సన్స్ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్..!

ఒత్తిడిలో మాధురి పంచిన ప్రేమకు ముగ్ధుడయ్యాను..

నాకు కష్టమైన సమయంలో తనకి కనెక్ట్ అయిన వ్యక్తి మాధురి అంటూ వివరించారు. మాధురి చాలా మంచి పర్సన్ చాలా హార్డ్ వర్క్ చేస్తుంది. ఆమెను తప్పు పట్టాల్సిన అవసరం లేదంటూ ఈశ్వర్ సాయి తెలిపారు. తనకు ఉన్న ఒత్తిడిలో మాధురి చూపించిన కేరింగ్ కి తను చాలా ఆకర్షితుడయ్యానని, అది తన వ్యక్తిగత భావన అంటూ తెలియజేశారు. మాధురి తనకు అందించిన ఆత్మీయత, శ్రద్ధ తనకు చాలా నచ్చిందని ఈశ్వర్ సాయి తెలిపారు. ఆమెకు చేతులెత్తి క్షమాపణ చెబుతున్నానని కూడా తెలిపారు.

- Advertisement -
Advertisement

ALSO READ:Agnipariksha 2:అగ్ని పరీక్ష 2 పై కౌశల్ సెన్సేషనల్ కామెంట్స్..నవదీప్‌కు బిగ్ కౌంటర్..!

మాధురి రాథోడ్ తో పరిచయం..

మాధురి రాథోడ్ తన పరిచయం సుమారుగా నాలుగు నుంచి ఐదు సంవత్సరాల క్రితమే మొదలైందని ఈశ్వర్ సాయి తెలిపారు. ఈ ఐదేళ్ల కాలంలో స్నేహానికి లేదా సహోద్యోగుల మధ్య ఉండే వృత్తిపరమైన సంబంధానికి మించి ఎప్పుడు ఇలాంటిది లేదని తెలిపారు. నేను గాని మాధురి గాని మేము డైరెక్ట్ గా క్లోజ్ గా మాట్లాడుకొని, నువ్వు అని మాట్లాడుకున్న రోజు కూడా ఎప్పుడు లేదు. మీరు.. ఈశ్వర్ గారు.. మాధురి గారు అనే పదాలే నడుస్తాయి మా ఇద్దరి మధ్య అంటూ తెలిపారు. తన భార్యకు లేని ఆవేశం.. వీడియో తీసిన ఆ మహిళకు ఎందుకు ఉందో నాకు అర్థం కాలేదంటూ చెప్పుకొచ్చారు. ఈశ్వర్ సాయి మాధురి కాంబినేషన్లో వచ్చిన ప్రతిపాట కూడా మంచి విజయాలను అందుకున్నాయి. మొత్తానికి ఈశ్వర్ సాయి చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

- Advertisement -
Advertisement

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you