Monday, August 24, 2026
HomeLATESTVishwanath and sons:విశ్వనాథ్ అండ్ సన్స్ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్..!

Vishwanath and sons:విశ్వనాథ్ అండ్ సన్స్ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్..!

Vishwanath and sons: సూర్య, మమిత బైజు ప్రధాన పాత్రల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విశ్వనాథ్ అండ్ సన్స్ సినిమా ఇప్పుడు ఓటీటీ స్ట్రీమింగ్ కి రాబోతోంది.

on
- Advertisement -banner Ad

Vishwanath and sons:కోలీవుడ్ హీరో సూర్య, మమిత బైజు నటించిన తాజా చిత్రం విశ్వనాథ్ అండ్ సన్స్(Vishwanath and sons). ఈ చిత్రాన్ని ప్రముఖ డైరెక్టర్ వెంకి అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కించారు. ఇందులో సీనియర్ హీరోయిన్స్ రాధిక, రవీనా టాండన్ తదితరులు కీలకమైన పాత్రలో నటించారు. ఆగస్టు 14న విడుదలైన ఈ చిత్రం సూర్యా కెరియర్ లోనే భారీ కలెక్షన్స్ రాబట్టిన చిత్రంగా నిలిచింది. ఇప్పటికే ఈ సినిమా 200 కోట్ల క్లబ్ లోకి చేరినట్లు తెలుస్తోంది. జీవి ప్రకాష్ అందించిన పాటలు , మ్యూజిక్ ఈ సినిమాకి హైలైట్ గా నిలిచాయి.

ఓటీటీ స్ట్రీమింగ్ కి రాబోతున్న విశ్వనాథ్ అండ్ సన్స్..

ముఖ్యంగా ఈ చిత్రంలోని ఫ్యామిలీ ఎలిమెంట్స్ చాలా పుష్కలంగా కనిపిస్తూ ఉండడంతో సినిమా విడుదలై ఇప్పటికి రెండు వారాలు అవుతూ ఉన్న సినిమా కలెక్షన్స్ మాత్రం తగ్గడం లేదు. థియేటర్లలో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న విశ్వనాథ్ అండ్ సన్స్ సినిమా ఓటిటిలో ఎప్పుడు వస్తుందని అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలోని ఓటీటి రిలీజ్ కు సంబంధించి ఒక న్యూస్ ఇప్పుడు వైరల్ గా మారింది. ఈ సినిమా డిజిటల్ స్ట్రిమింగ్ హక్కులను ప్రముఖ ఓటిటి సంస్థలలో ఒకటైన నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది.

- Advertisement -
Advertisement

ALSO READ:Agnipariksha 2:అగ్ని పరీక్ష 2 పై కౌశల్ సెన్సేషనల్ కామెంట్స్..నవదీప్‌కు బిగ్ కౌంటర్..!

స్ట్రీమింగ్ అప్పుడే..

అయితే సినిమా స్ట్రీమింగ్ మాత్రం థియేట్రికల్ రిలీజ్ అయిన నాలుగు వారాలకే ఓటీటీలోకి తీసుకువచ్చేలా ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. ఈ లెక్కన చూసుకుంటే సెప్టెంబర్ 14వ తేదీన ఈ సినిమా స్ట్రీమింగ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పవచ్చు. తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళం వంటి భాషలలో ఒకేసారి ఈ సినిమాని స్ట్రీమింగ్ కి తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఇందుకు సంబంధించి అధికారికంగా ప్రకటన కూడా రాబోతోంది. సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పైన నిర్మాత నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మించారు.

- Advertisement -
Advertisement

ALSO READ:Varanasi:రాజమౌళి మరో సంచలనం.. 50 భాషల్లో ఒకేసారి ‘వారణాసి’ రిలీజ్..!

థియేటర్లలో దూసుకుపోతున్న విశ్వనాథ్ అండ్ సన్స్..

చాలాకాలం తర్వాత సూర్య ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమాతో రావడంతో పాటుగా ఇందులో మమితా తన కామెడీ టైమింగ్ తో అందరిని బాగా ఆకట్టుకుంది. ముఖ్యంగా మదర్ ఎమోషన్ సెంటిమెంటుతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నారు. ఇప్పటివరకు 200 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ రాబట్టినట్లుగా చిత్ర బృందం ఒక పోస్టర్ని విడుదల చేయడంతో సూర్య అభిమానులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరి రాబోయే రోజుల్లో సినిమా కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. సూర్య తన తదుపరి సినిమాల విషయంలో కూడా ఆచితూచి అడుగులు వేస్తున్నట్లు సమాచారం. ఏది ఏమైనప్పటికీ ఈ ఏడాది వీరభద్రుడు సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న సూర్య ఇప్పుడు విశ్వనాథ్ అండ్ సన్స్ సినిమాతో మరో బ్లాక్ బస్టర్ ని అందుకున్నారు.

- Advertisement -
Advertisement

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you