OTT MOVIES:సినీ ప్రియులకు ఈ వారం థియేటర్లు, ఓటీటీల్లో మంచి వినోదం అందనుంది. యష్ ‘టాక్సిక్’, నయనతార ‘హాయ్’, ‘కికు చిరంజీవి’ చిత్రాలు థియేటర్లలో సందడి చేయనున్నాయి. ‘టాక్సిక్’ ఆగస్టు 26న పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. హాట్‌స్టార్, నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్‌లలో ‘ఐ నోబడీ’, ‘అడల్ట్స్ 2’, ‘బ్యూటీ ఇన్ బ్లాక్ 3’, ‘ఆల్ఫా’, ‘బెట్టీ లా ఫియా 3’ వంటి సినిమాలు, సిరీస్‌లు స్ట్రీమింగ్ కానున్నాయి
హాట్‌స్టార్‌లో ఆసక్తికరమైన సినిమాలు, సిరీసులు:
ఓటీటీ(OTT MOVIES) విషయానికి వస్తే హాట్‌స్టార్‌లో ఈ వారం పలు కొత్త కంటెంట్ స్ట్రీమింగ్ కానుంది. పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన ‘ఐ నోబడీ’ తెలుగు డబ్బింగ్ వెర్షన్ ఆగస్టు 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే ‘అడల్ట్స్’ సీజన్ 2 ఆగస్టు 27న, తెలుగు సిరీస్ ‘పార్ట్ టైమర్స్’ ఆగస్టు 28న స్ట్రీమింగ్ కానున్నాయి. హిందీ డబ్బింగ్ మూవీ ‘మైఖేల్’ ఆగస్టు 29న విడుదల కానుంది.
నెట్‌ఫ్లిక్స్‌లో వరుసగా కొత్త రిలీజ్లు:
నెట్‌ఫ్లిక్స్‌లో కూడా ఆగస్టు 26 నుంచి కొత్త కంటెంట్ అందుబాటులోకి రానుంది. ‘ది లాస్ట్ సెల్యూట్: ఏ లవ్ లెటర్ టు MiG-21’ అనే హిందీ డాక్యుమెంటరీ ఆగస్టు 26న స్ట్రీమింగ్ కానుంది. ఆగస్టు 27న ‘లిన్’, ‘బ్యూటీ ఇన్ బ్లాక్’ సీజన్ 3 విడుదల కానున్నాయి.
ALSO READ:Mahakali Movie:మహాకాళి సినిమా నుంచి గ్లింప్స్ వైరల్!
విభిన్న జానర్లలో చిత్రాలు :
ఆగస్టు 28న ఓటీటీల్లో పలు సినిమాలు, సిరీసులు స్ట్రీమింగ్కు సిద్ధమవుతున్నాయి. ‘బక్’, ‘గ్రేవ్‌యార్డ్’ సీజన్ 3, ‘ది విస్పర్ మ్యాన్’తో పాటు ‘ఆల్ఫా’ కూడా ప్రేక్షకుల ముందుకు రానుంది. వీటిలో ‘ఆల్ఫా’ హిందీ చిత్రం కావడం విశేషం. విభిన్న జానర్లలో తెరకెక్కిన ఈ చిత్రాలు, సిరీసులు ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందించనున్నాయి.
ALSO READ:Nainisha Rai:బ్రహ్మముడి అప్పు రియల్ లైఫ్ స్టోరీ..నైనిషా రాయ్ షాకింగ్ జర్నీ!
అమెజాన్ ప్రైమ్‌లోనూ కొత్త కంటెంట్:
అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ వారం పలు ఆసక్తికరమైన సినిమాలు, వెబ్ సిరీస్‌లు స్ట్రీమింగ్కు సిద్ధమవుతున్నాయి. ఆగస్టు 26న ‘ది లాస్ట్ సన్‌రైజ్’ అనే ఇంగ్లీష్ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఆగస్టు 28న తెలుగు డబ్బింగ్ చిత్రం ‘బబితా సింగ్ రిపోర్టింగ్’ స్ట్రీమింగ్ కానుంది. అదే రోజున ప్రముఖ ఇంగ్లీష్ సిరీస్ ‘బెట్టీ లా ఫియా’ మూడో సీజన్ కూడా అందుబాటులోకి రానుంది.
దీంతో ఈ వారం ఓటీటీ ప్రేక్షకులకు అమెజాన్ ప్రైమ్‌లో విభిన్నమైన కంటెంట్ అందుబాటులో ఉండనుంది. మొత్తంగా చూస్తే వచ్చే వారం థియేటర్లలో పాన్ ఇండియా సినిమాల సందడి ఉండగా, ఓటీటీల్లో మాత్రం తెలుగు, హిందీ, ఇంగ్లీష్, టర్కిష్ భాషలకు చెందిన సినిమాలు, సిరీసులతో ప్రేక్షకులకు వినోదం పుష్కలంగా లభించనుంది.




