Madhuri Rathod:ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కువగా ట్రెండ్ అవుతున్న టాపిక్ ఈశ్వర్ సాయి, అదేవిధంగా మాధురి రాథోడ్ వివాదం. వీళ్లిద్దరూ ప్రేమించుకున్నారా? పెళ్లి చేసుకోవాలనుకున్నారా? లేకపోతే వీళ్లిద్దరినీ కావాలని విడదీశారా? ఇలా రకరకాలుగా సోషల్ మీడియాలో జనాలు మాట్లాడుకుంటున్నారు. ఈ మధ్యకాలంలో వీళ్లిద్దరి పేర్లు టాప్ మోస్ట్ సెలబ్రిటీల కంటే ఎక్కువగా ట్రెండింగ్ లిస్ట్‌లోకి చేరిపోయాయి.
లైవ్ డిబేట్‌లో శరణ్య.. సంచలన రికార్డింగ్ :
తాజాగా ఈశ్వర్ సాయి భార్య శరణ్య ఓ మీడియా ఛానల్‌లో లైవ్ డిబేట్‌కు వచ్చింది. అక్కడ మాధురి రాథోడ్‌కు సంబంధించిన మరిన్ని విషయాలను బయటపెట్టింది. అంతేకాదు, ఈ డిబేట్‌లో ఒక సెన్సేషనల్ రికార్డింగ్ కూడా బయటకు వచ్చింది. అసలు ఈశ్వర్ సాయిని ఇలా ప్లాన్ చేసి, పక్కాగా స్కెచ్ వేసి అందరినీ బకరాలు చేసేది మాధురి రాథోడ్ అని క్లియర్ కట్‌గా బయటపెట్టేలా ఒక ఆడియో రికార్డింగ్‌ను ప్రముఖ మీడియా ఛానల్‌లో ప్లే చేశారు. దీంతో ఒక్కసారిగా జనాలు షాక్ అయిపోయారు.
ALSO READ:Rashmika:”పెళ్లయ్యాక 3 నెలలు విడిగానే ఉన్నాం”..పరసనల్ మ్యాటర్ బయట పెట్టిన రష్మిక!
ఆడియో రికార్డింగ్‌లో ఏముంది? :
నిన్న మొన్నటి వరకు మాధురి రాథోడ్(Madhuri Rathod) అమాయకురాలు, ఈశ్వర్ సాయి మోసం చేశారని అనుకున్న వాళ్లంతా.. అసలు దీని వెనక ప్రధాన సూత్రధారి మాధురి రాథోడ్ అంటూ బయటపడిందని మాట్లాడుకుంటున్నారు. మాధురి రాథోడ్, ఈశ్వర్ సాయి ప్రేమించుకుంటున్నారు, లివింగ్ రిలేషన్‌షిప్‌లో ఉన్నారు అన్న విషయం ఆ ఆడియో రికార్డింగ్‌తో బయటపడిందని చెబుతున్నారు.
ఆ ఆడియోలో ఆమె మాట్లాడుతూ.. “మనం ఇలా దొరికిపోవడం అసలు ఊహించలేదు. ఎవరైనా నిన్ను అడిగితే వెంటనే ఇలానే చెప్పు. నేను వాష్‌రూమ్ కోసం వచ్చాను. నాకు అర్జెంట్‌గా వాష్‌రూమ్ వచ్చింది. అందుకే నేను అక్కడ వాష్‌రూమ్ యూజ్ చేసుకున్నాను. ఒకవేళ మేము ఏదైనా తప్పు చేయాలి అనుకుంటే డోర్ ఎందుకు ఓపెన్‌లో పెడతాము? నిజంగా మేము తప్పు చేయాలి అనుకుంటే మాకు ఎన్నెన్నో ప్లేసులు ఉన్నాయి. ఓయో, వేరే హోటల్ రూమ్స్‌కి వెళ్లొచ్చు. ఇది షూటింగ్ స్పాట్. ఇక్కడ అలా చేస్తే మేము పట్టుబడతామని మాకు తెలియదా?
మా మనసులో నిజంగా అలాంటి ఉద్దేశం ఉంటే ఎందుకు ఇలా చేస్తాము? మేము ప్రేమించుకున్న మాట వాస్తవమే. కానీ ఇప్పుడు మేము ఇక్కడ అలా చేయలేదు” అంటూ నువ్వు గట్టిగా వాదించు అనే విధంగా మాధురి రాథోడ్ చెప్పినట్లు ఆ రికార్డింగ్ ఉంది.
ALSO READ:I’m Game Movie Review: యాక్షన్, క్రైమ్‌తో దుల్కర్ చేసిన గేమ్ ఎలా ఉంది?
కేసులో మరో ట్విస్ట్.. శరణ్య సంచలన ఆరోపణలు :
దీంతో ఒక్కసారిగా సోషల్ మీడియాలో ఇప్పుడు మరో చర్చ మొదలైంది. అంతేకాదు, ఈశ్వర్ సాయి పరారీలో ఉన్నారు. ఆ విషయం అందరికీ తెలిసిందే. ఈశ్వర్ సాయి భార్య శరణ్య దగ్గర మరికొన్ని రికార్డింగ్స్ ఉన్నాయి అంటూ కూడా ఆమె చెబుతుంది.
ఇదంతా ఈశ్వర్ సాయిని పెళ్లి చేసుకోవడానికి మాధురి రాథోడ్ వేసిన ప్లాన్ అంటూ శరణ్య వాదిస్తుంది. అంతేకాదు, తిరిగి ఈశ్వర్ సాయిపై మాధురి రాథోడ్ కేసు పెట్టడం కూడా హై డ్రామా అని, పెళ్లి చేసుకోకపోతే ఇలా కూడా చేస్తాను అంటూ బెదిరించడానికి ఈ విధంగా చేసిందని ఈశ్వర్ సాయి భార్య శరణ్య వాదిస్తున్నారు.
రోజుకో ట్విస్ట్.. సోషల్ మీడియాలో తీవ్ర చర్చ :
రోజులు గడిచేకొద్దీ ఒక్కొక్క ట్విస్ట్ ఈ కేసును మలుపు తిప్పుతుంది. రానున్న రోజుల్లో ఈ కేసులో ఇంకెన్ని మలుపులు వస్తాయో అంటూ నెటిజన్లు ఘాటుగా విమర్శిస్తున్నారు. ఈశ్వర్ సాయిపై దారుణంగా ట్రోలింగ్ చేస్తున్నారు. “బంగారం లాంటి భారీ, అంతకుమించిన ఫేమ్ ఉన్న నువ్వు ఇలా తప్పు చేయొచ్చా? ఇప్పుడు మొత్తం నాశనం. ఒకపక్క పర్సనల్ లైఫ్, మరొకపక్క ప్రొఫెషనల్ లైఫ్.. రెండూ పోయాయి” అంటూ ఆయనపై ట్రోలింగ్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఇప్పుడు మాధురి రాథోడ్, ఈశ్వర్ సాయి పేర్లు దారుణాతి దారుణంగా ట్రోలింగ్‌కు గురవుతున్నాయి.




