Friday, September 4, 2026
HomeLATESTAllu Arjun:మొదటిసారి రాకా కోసం అల్లు అర్జున్ అలాంటి పని..!

Allu Arjun:మొదటిసారి రాకా కోసం అల్లు అర్జున్ అలాంటి పని..!

Allu Arjun: అట్లీ దర్శకత్వంలో హీరోగా నటిస్తున్న అల్లు అర్జున్ రాకా సినిమా కోసం మొదటిసారి అలాంటి పని చేసినట్టు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ గా మారుతున్నాయి.

on
- Advertisement -banner Ad

Allu Arjun:స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ , డైరెక్టర్ అట్లీ కాంబినేషన్లో వస్తున్న చిత్రం రాకా.. ఈ సినిమా నుంచి ఇప్పటివరకు వచ్చిన ప్రతి అప్డేట్ కూడా సినిమా పైన ఆసక్తిని పెంచేసింది. ముఖ్యంగా ఇందులో అల్లు అర్జున్ కనిపించిన తీరు అభిమానులకు కొత్తగా కనిపిస్తోంది. భారీ బడ్జెట్ సినిమా కావడం , హాలీవుడ్ స్థాయిలో మేకింగ్ ఉండడంతో సినిమా పైన రోజురోజుకి అంచనాలను పెరుగుతున్నాయి. ఇప్పుడు తాజాగా ఈ సినిమా గురించి ఒక గాసిప్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది.

మూడు విభిన్నమైన పాత్రలలో అల్లు అర్జున్..

అదేమిటంటే ఈ చిత్రంలో అల్లు అర్జున్(Allu Arjun) ఒకటి కాదు ఏకంగా మూడు విభిన్నమైన షేడ్స్ ఉన్న పాత్రలలో కనిపించబోతున్నట్లు వినిపిస్తోంది. ఈ మూడు పాత్రల లుక్స్, బాడీ లాంగ్వేజ్ క్యారెక్టర్రైజేషన్ పూర్తిగా డిఫరెంట్ గా ఉంటాయనే టాక్ ఇప్పుడు వినిపిస్తోంది .రాకా చిత్రంలో ఇదే అసలైన ట్విస్ట్ అన్నట్లుగా సమాచారం. సాధారణంగా ఒకే హీరో మూడు పాత్రలలో కనిపిస్తే వాళ్ల మధ్య అన్నదమ్ముల బంధము లేదా తండ్రి కొడుకుల బంధం, గత జన్మ కనెక్షన్ వంటివి ఉంటుందని ఊహిస్తూ ఉంటారు. కానీ రాకా చిత్రంలో మాత్రం ఈ ముగ్గురు క్యారెక్టర్లకు ఎలాంటి సంబంధం ఉండదట. ఈ ముగ్గురు తమ తమ ప్రపంచాలలో తమ కథలతో కనిపిస్తారని.. కానీ కథ ముందుకు వెళ్లే కొద్దీ మూడు కథలు ఒకే పాయింట్ దగ్గర వచ్చి కలుస్తాయనే టాక్ వినిపిస్తోంది.

- Advertisement -
Advertisement

ALSO READ:Allari Naresh: అన్నపూర్ణ స్టూడియో బ్యానర్ నుంచి సినిమా రావాలంటే ఇంత కథ ఉందా?

అసలు స్టోరీ ఏంటంటే?

రాకా చిత్రంలోని మూడు పాత్రల జీవితాలు వేరువేరు ప్రపంచాలలో ఉంటాయని అయితే వారి సమస్యలు కూడా వేరువేరుగా ఉంటాయి కానీ ఏదో ఒక కీలకమైన సంఘటన ఈ ముగ్గురిని ఒకే కథలోకి తీసుకువస్తుందట.ముగ్గురికి సంబంధం లేదు కానీ ఆ ముగ్గురు కథ ఒక్కటే అనే కాన్సెప్ట్ తో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నట్లు వినిపిస్తోంది. అల్లు అర్జున్ కూడా ఈ మూడు షేడ్స్ కోసం తన లుక్స్, మేనరిజం, యాక్టింగ్ లో కూడా పూర్తి సరికొత్త వేరియేషన్స్లో చూపించబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. మూడు పాత్రలలో ఒక పాత్రలో పూర్తిగా రఫ్ అండ్ రా లుక్ లో, మరొక పాత్రలో స్టైలిష్ గా, ఇంకొక పాత్ర ఇప్పటివరకు చూడని ఒక డిఫరెంట్ లాంగ్వేజ్ తో కనిపించబోతున్నట్లు ప్రచారం అయితే జరుగుతుంది.

- Advertisement -
Advertisement

ALSO READ:Madhuri Rathod:ఈశ్వర్ సాయి-మాధురి వివాదంలో ఫ్యుజులు ఎగిరిపోయే ట్విస్ట్.. తెర వెనుక కధ నడిపింది ఆ లేడీనే..!

సినిమాపై అంచనాలు తారస్థాయికి..

మరి ఈ మూడు పాత్రలు ఎందుకు ఒకేలా ఉంటున్నాయి? వాళ్ల జీవితాలు ఒకే సంఘటనలో ఎందుకు జరుగుతున్నాయి? చివరికి ఈ ముగ్గురు కథలు ఎలా కనిపిస్తాయి ? అనేది సినిమాలో సస్పెన్స్ అంటూ వినిపిస్తోంది. మరి ఇదే కాన్సెప్ట్ తో ఒకవేళ సినిమా తెరకెక్కిస్తే ఒకే హీరోలో మూడు షేర్స్ చూపించడమే కాకుండా మూడు వేరు వేరు స్టోరీలను ఒకే కథగా మలిచే ప్రయోగమే రాకా సినిమా నిలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరి ఏం జరుగుతుందో చూడాలి. మొత్తానికి అయితే ఈ సినిమా కోసం ఏకంగా మూడు పాత్రలలో విభిన్నమైన క్యారెక్టర్లలో నటించాలని అల్లు అర్జున్ తీసుకుని నిర్ణయం సినిమాపై మరిన్ని అంచనాలు పెంచేసింది.

- Advertisement -
Advertisement

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you