Friday, September 4, 2026
HomeLATESTIrumudi: ఇరుముడి2పై ఒక్క మాటతో క్లారిటీ ఇచ్చేసిన డైరెక్టర్..!

Irumudi: ఇరుముడి2పై ఒక్క మాటతో క్లారిటీ ఇచ్చేసిన డైరెక్టర్..!

Irumudi: ఇరుముడి 2 పై ప్రముఖ డైరెక్టర్ శివా నిర్వాణ ఒక్క మాటతో క్లారిటీ ఇచ్చారు. ఈ విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

on
- Advertisement -banner Ad

Irumudi: టాలీవుడ్ మాస్ హీరో రవితేజ డైరెక్టర్ శివ నిర్వాణ దర్శకత్వంలో వచ్చిన తాజా చిత్రం ఇరుముడి. ఈ సినిమా మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ రాబట్టడమే కాకుండా కుటుంబ కథా చిత్రం కావడం చేత ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంది. ముఖ్యంగా ఇందులో అయ్యప్ప స్వామికి సంబంధించి పాటలు జోరుగా సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో సినిమా పైన అంచనాలు పెరిగిపోయాయి. అయితే తాజాగా ఇరుముడి(Irumudi) సినిమా సూపర్ హిట్ అయిన నేపథ్యంలో ఈ సినిమా సీక్వెల్ లో రామ్ చరణ్ నటిస్తారా అనే ప్రశ్న పై డైరెక్టర్ శివ నిర్వాణ క్లారిటీ ఇచ్చారు.

ఇరుముడి సీక్వెల్ పై డైరెక్టర్ క్లారిటీ..

రామ్ చరణ్ మా సినిమాలో ఉంటే అది కచ్చితంగా అద్భుతంగా ఉండేది. కానీ ఇరుముడి సినిమా తీసేటప్పుడే.. ఆయనను కెమియో పాత్రలో తీసుకోవాలనే ఆలోచన మాకు అసలు రాలేదు. ఈ ప్రచారం కేవలం సోషల్ మీడియాలోనే మొదట చూశాను. ఆ తర్వాత మీడియా మిత్రులు కూడా అడగడంతో ఆ విషయం పైన క్లారిటీ ఇచ్చానని తెలిపారు. కథకు సహజంగా అలాంటి పాత్ర అవసరమైతే కచ్చితంగా రామ్ చరణ్తో పనిచేయడం ఒక అద్భుతంగా ఉండేదని డైరెక్టర్ శివ నిర్వాణ తెలిపారు. కథ రాసేటప్పుడు స్టార్ ను అనుకొని పాత్ర సృష్టించడం తన విధానం కాదు అంటూ తెలిపారు.

- Advertisement -
Advertisement

ALSO READ:Actor Ali: కాలికి కట్టుతో కమెడియన్ అలీ!

స్టార్ కోసం కథను రాయలేనంటూ..

ఇరుముడి సినిమా సహజంగానే పుట్టింది. మాలలో ఉన్న ఒక వ్యక్తికి తాగుడు ఉండడం , ఆ వ్యక్తి తన కూతురు కోసం అయ్యప్ప మాలవేయడం, ఆ 41 రోజులు దీక్షలో అతని జీవితంలో చోటు చేసుకున్నటువంటి కొన్ని మార్పుల కథ ఆధారంగానే ఈ చిత్రాన్ని చాలా సహజంగానే తీశామని తెలిపారు. అయితే ఇప్పుడు ఈ సినిమా హిట్ అయింది అనే కారణంతో వెంటనే ఇరుముడి 2 సినిమా కథ రాయలేను. మరో సహజమైన కథ పాయింట్ దొరికితేనే ఇరుముడి సీక్వెల్ పైన ఆలోచిస్తానంటూ డైరెక్టర్ శివ క్లారిటీ ఇచ్చారు. ఇరుముడి సినిమా ఇప్పటివరకు 200 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది.

- Advertisement -
Advertisement

ALSO READ:Allu Arjun:మొదటిసారి రాకా కోసం అల్లు అర్జున్ అలాంటి పని..!

దూసుకుపోతున్న ఇరుముడి..

రవితేజ కెరియర్ లోనే అత్యధికంగా కలెక్షన్స్ రాబట్టే చిత్రాలలో ఒకటిగా నిలిచే అవకాశం ఉన్నది. మైత్రి మూవీ మేకర్స్ వారు ఈ చిత్రాన్ని తక్కువ బడ్జెట్ తో తెరకెక్కించారు. బుధవారం రోజున అయ్యప్ప స్వామి ఇలా పులిపై కూతురి పాత్రధారి కూర్చొని పక్కనే రవితేజ, ప్రియా భవాని శంకర్ నిలబడి ఉన్న పోస్టర్ రిలీజ్ చేస్తూ.. మూడో వారంలో వచ్చిన ఇరుముడి ఏమాత్రం జోరు తగ్గలేదు అంటూ చిత్ర బృందం అధికారికంగా పోస్టర్ ద్వారా తెలిపారు. మరి ఈ వారం కూడా చెప్పుకోదగ్గ సినిమాలేవి లేకపోవడంతో ఈ వారం కూడా రవితేజ హవా కనిపించేలా ఉన్నది.

- Advertisement -
Advertisement

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you