Friday, September 4, 2026
HomeLATESTAllari Naresh: అన్నపూర్ణ స్టూడియో బ్యానర్ నుంచి సినిమా రావాలంటే ఇంత కథ ఉందా?

Allari Naresh: అన్నపూర్ణ స్టూడియో బ్యానర్ నుంచి సినిమా రావాలంటే ఇంత కథ ఉందా?

Allari Naresh: ప్రముఖ హీరో అల్లరి నరేష్ తాజాగా అన్నపూర్ణ స్టూడియోస్ గురించి చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

on
- Advertisement -banner Ad

Allari Naresh: సినీ ఇండస్ట్రీలో కొత్త దర్శకులు ఏదైనా కథతో సినిమా చేయాలి అంటే ముందుగా నిర్మాతలను మెప్పించాల్సి ఉంటుంది. అందుకే చాలామంది పెద్ద నిర్మాణ సంస్థలు కథను చెప్పడానికే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ అలా ఒక్క నిర్మాత మాత్రమే కథ విని ఓకే చేయడం ఉండదు. మేనేజర్లు, క్రియేటివ్ టీమ్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్లు మరి కొంతమంది కీలకమైన వ్యక్తులు కథ విని దానిపైన చర్చించిన తర్వాతే సినిమా పట్టాలెక్కుతుంది. ఇప్పుడు తాజాగా టాలీవుడ్ హీరో అల్లరి నరేష్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి.

అన్నపూర్ణ స్టూడియోస్ పై అల్లరి నరేష్ కామెంట్స్..

అల్లరి నరేష్(Allari Naresh) నటించిన రంభ ఊర్వశి మేనక చిత్రం సెప్టెంబర్ 4వ తేదీన ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. ఈ సినిమాకు అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మాణ భాగస్వామిగా వ్యవహరించారు. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మీడియా ఇంటర్వ్యూలో పాల్గొన్న అల్లరి నరేష్ అన్నపూర్ణ స్టూడియోలో తన సినిమా కథ ఓకే కావడానికి జరిగిన ప్రక్రియ గురించి పలు విషయాలను తెలిపారు.. అల్లరి నరేష్ మాట్లాడుతూ.. రంభ ఊర్వశి మేనక చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మించడం సాధారణ విషయమేమి కాదని వెల్లడించారు. డైరెక్టర్ చంద్రమోహన్ రాసుకున్న కథను అన్నపూర్ణ స్టూడియోలో చాలామంది కీలక వ్యక్తులకు వివరించి వారి అంగీకారం తీసుకున్న తర్వాతే సినిమా ఓకే అయ్యిందని వెల్లడించారు.

- Advertisement -
Advertisement

ALSO READ:Madhuri Rathod:ఈశ్వర్ సాయి-మాధురి వివాదంలో ఫ్యుజులు ఎగిరిపోయే ట్విస్ట్.. తెర వెనుక కధ నడిపింది ఆ లేడీనే..!

వాళ్లంతా ఒప్పుకుంటేనే సినిమా పట్టాలెక్కుతుంది..

చంద్రమోహన్ రాసిన కథను అన్నపూర్ణ స్టూడియోలో నిమ్మకాయల ప్రసాద్, సుప్రియ ,నాగచైతన్య, నాగార్జున గారికి చెప్పి ఒప్పించిన తరువాతే ఈ చిత్రం ఓకే అయ్యిందంటూ అల్లరి నరేష్ తెలిపారు. ఒక కొత్త డైరెక్టర్ తన కథను ఇంతమంది కీలకమైన వ్యక్తులకు వివరించి, ప్రతి ఒక్కరిని కూడా కన్విన్స్ చేసిన తర్వాతే సినిమా సెట్స్ పైకి తీసుకువెళ్లడం జరుగుతుందని తెలిపారు. ఈ విషయంలో తమ సినిమా డైరెక్టర్ చంద్రమోహన్ సక్సెస్ అయ్యారు అంటూ అల్లరి నరేష్ ప్రశంసించారు. ఇటీవల కాలంలో ఒక కార్యక్రమంలో నాగార్జున మాట్లాడుతూ కొత్త దర్శకులు కొత్త కథలతో ముందుకు వస్తే.. తమ సంస్థ సినిమాలు చేయడానికి సిద్ధంగానే ఉన్నామని తెలిపారు.

- Advertisement -
Advertisement

ALSO READ:Rashmika:”పెళ్లయ్యాక 3 నెలలు విడిగానే ఉన్నాం”..పరసనల్ మ్యాటర్ బయట పెట్టిన రష్మిక!

చర్చకు దారితీసిన నాగార్జున మాటలు..

అలాంటిది ఇప్పుడు అల్లరి నరేష్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో మరింత ఆసక్తిని కలిగిస్తున్నాయి.. అన్నపూర్ణ స్టూడియోలో ఒక సినిమా కథను ఓకే చేయడానికి సంస్థలో ఆ కీలకమైన వ్యక్తుల ఆమోదం కూడా చాలా ముఖ్యమే అని నరేష్ మాటల ద్వారా ఇప్పుడు క్లియర్ గా అర్థమవుతుంది. అన్నపూర్ణ స్టూడియోస్ వంటి ప్రతిష్టాత్మక సంస్థలు సినిమా చేయాలనుకునే కొత్త దర్శకులకు కేవలం మంచి కథ ఉంటే సరిపోదనే విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కథను బట్టి వివిధ స్థాయిలలో వివరించి వాటిపైన నమ్మకం కలిగిస్తే సరిపోతుంది.

- Advertisement -
Advertisement

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you