Wednesday, September 9, 2026
HomeLATESTPrabhash:ప్రభాస్ సినిమాలపై అభిమానులకు టెన్షన్..!

Prabhash:ప్రభాస్ సినిమాలపై అభిమానులకు టెన్షన్..!

Prabhash: రెబల్ స్టార్ ప్రభాస్ సినిమాల విషయంలో అభిమానులు టెన్షన్ పడుతున్నారు.ఈ మేరకు పలు విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

on
- Advertisement -banner Ad

Prabhash:రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రాలలో.. ప్రభాస్ అభిమానులు ఫౌజీ, స్పిరిట్ సినిమాల కోసం చాలా ఆత్రుతగా ఎదురు చేస్తున్నారు. ఈ రెండు చిత్రాలు కేవలం మూడు నెలల వ్యవధిలోని థియేటర్లోకి రాబోతుండడంతో ఒకవైపు అభిమానులు ఆనంద పడుతున్నా.. మరొకవైపు నిరుత్సాహ పడుతున్నారు. ముఖ్యంగా ఈ సినిమాల నుంచి ఎలాంటి చిన్న అప్డేట్ వచ్చినా సరే సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతుంది. తాజాగా ఇప్పుడు ప్రభాస్ అభిమానులను టెన్షన్ కి గురి చేస్తున్న ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ప్రభాస్ బర్తడే స్పెషల్..

ఫౌజీ సినిమా డిసెంబర్ 3వ తేదీన, స్పిరిట్ సినిమా వచ్చే ఏడాది మార్చి 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఈ నేపథ్యంలోనే అక్టోబర్ 23న ప్రభాస్(Prabhash) పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రాలకు సంబంధించి అదిరిపోయే అప్డేట్ అయితే తీసుకువచ్చేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు వినిపిస్తోంది. ముఖ్యంగా స్పిరిట్ సినిమా డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా.. బర్తడే సందర్భంగా ఒక సరికొత్త ట్రీట్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నట్లుగా టాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా ఒక పవర్ఫుల్ యాక్షన్ గ్లింప్స్ రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారట. స్పిరిట్ సినిమా పైన ఉండే అంచనాలను మరింత పైకి తీసుకువచ్చేలా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

- Advertisement -
Advertisement

also read:Vijay Deverakonda:స్టేజ్ మీదే వారికి వార్నింగ్ ఇచ్చిన విజయ్ దేవరకొండ..!

ఒకేరోజు రెండు చిత్రాల అప్డేట్స్..

మరొకవైపు ఫౌజీ సినిమాని డైరెక్టర్ హానురాగవపూడి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా నుంచి వీడియో కంటెంట్ ను విడుదల చేసేందుకు చిత్ర బృందం సన్నహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ఒకేరోజు అటు ప్రభాస్ నటిస్తున్న రెండు భారీ ప్రాజెక్టుల నుంచి అప్డేట్ వచ్చాయి అంటే చాలు కచ్చితంగా పోలికలు మొదలయ్యే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా రిలీజ్ విషయంలో ఫౌజీ ముందుగా ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. ఈ నేపథ్యంలోని ముందుగా ఏ చిత్రమైతే విడుదల అవుతుందో ఆ సినిమాకి ఎక్కువగా ప్రాధాన్యత లభించే అవకాశం ఉంటుంది.

- Advertisement -
Advertisement

also read:Anand Deverakonda:”వైష్ణవి చైతన్యతో లవ్”..ఆనంద్ దేవరకొండ సెన్సేషనల్ కామెంట్స్..!

అభిమానులలో కొత్త టెన్షన్..

దీన్నిబట్టి చూస్తే ఫౌజీ కోసం స్పిరిట్ సినిమా అప్డేట్ ను వెనక్కి తీసుకునే అవకాశం ఉందా అనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ విషయం పైన అధికారికంగా ఇంకా ఎటువంటి ప్రకటన అయితే రాలేదు. కానీ ప్రభాస్ అభిమానులలో మాత్రం చిన్నపాటి క్లాష్ రూమర్స్ వస్తాయేమో అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మరి ప్రభాస్ బర్త్ డే రోజున ఏం జరుగుతుందో తెలియాలి అంటే అప్పటివరకు ఆగాల్సిందే. ఇవే కాకుండా ప్రభాస్ బర్త్ డే రోజున పలు సినిమాల అప్డేట్లు కూడా వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

- Advertisement -
Advertisement

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you