Thursday, September 10, 2026
HomeLATESTRanaBali :వైరల్ గా మారిన రణబాలి టీజర్!

RanaBali :వైరల్ గా మారిన రణబాలి టీజర్!

RanaBali : విజయ్ దేవరకొండ రష్మిక మందన్న కాంబినేషన్లో వస్తున్న రణబాలి మూవీ నుండి మేకర్స్ తాజాగా టీజర్ విడుదల చేశారు.

on
- Advertisement -banner Ad

RanaBali :టాలీవుడ్ లో మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్ గా పేరు సంపాదించిన జంటలలో విజయ్ దేవరకొండ, రష్మిక జంట ముందు వరుసలో ఉంటుంది. ఈ ఏడాది వివాహం చేసుకున్న ఈ జంట వివాహం తర్వాత మొదటిసారి జంటగా నటిస్తున్న చిత్రం రణబాలి(RanaBali). ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తోనే నిర్మిస్తున్నారు. డైరెక్టర్ రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా పైన అటు విజయ్ దేవరకొండ అభిమానులు కూడా భారీగా అంచనాలు పెట్టుకున్నారు. వాస్తవంగా ఈ సినిమా ఎప్పుడో విడుదల కావాల్సి ఉండగా.. కొన్ని కారణాల చేత వాయిదా పడింది.

రణబాలి నుండి టీజర్ రిలీజ్..

తాజాగా ఈ సినిమాకి సంబంధించి టీజర్ ని విడుదల చేయగా.. అద్భుతమైన రెస్పాన్స్ లభించినట్లు కనిపిస్తోంది. ఈ చిత్రంలో హాలీవుడ్ నటుడు మమ్మీ ఫేమ్ ఆర్నాల్డ్ ఓస్లో నెగిటివ్ పాత్రలో అద్భుతంగా కనిపించారు. ముఖ్యంగా ఈ సినిమాలో యాక్షన్ డ్రామా కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. 1854 నుంచి 1878 మధ్య బ్రిటిష్ పనులలో.. చోటు చేసుకున్న కొన్ని సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని పెరకెక్కించినట్లు టీజర్ లో కనిపిస్తోంది. దీంతో ఈ సినిమా పైన అభిమానులకు మరింత ఆసక్తి పెరిగిపోయింది.

- Advertisement -
Advertisement

also read:Balakrishna:బాలయ్య -కొరటాల శివ షూటింగ్ మొదలు అప్పుడే..!

ఒక్క షాట్ తో సినిమాపై భారీ హైప్..

అంతేకాకుండా చివరిలో విజయ్ దేవరకొండ చిన్న కుండతో నీరు పెట్టగా.. ఆ కుండని ఒక గుహలో నుంచి వ్యక్తి తీసుకొని పోవటాన్ని హైలైట్ గా చూపించారు. దీంతో ఈ సినిమాలో ఎవరైనా కీలకమైన పాత్రలో నటిస్తున్నారా లేదా అనే అనుమానాలు మొదలవుతున్నాయి. దాదాపుగా ఈ సినిమా చిత్రీకరణ పూర్తి చేసుకున్నట్లు తెలుస్తోంది. అక్టోబర్ 16వ తేదీన దసరా కానుకగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకి తీసుకురాబోతున్నారు. పాన్ ఇండియా లెవెల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి మేకర్స్ సన్నహాలు చేస్తున్నారు. ఈ చిత్రానికి అజయ్, అతుల్ సంగీతాన్ని అందిస్తున్నారు. టీజర్ తో రణబాలి సినిమా పైన మరింత అంచనాలను పెంచేసింది యూనిట్ .

- Advertisement -
Advertisement

also read:Epic Movie:సెన్సార్ పూర్తి చేసుకున్న ఎపిక్.. ఫ్యామిలీ ఆడియన్స్ దూరమేనా?

విజయ్ దేవరకొండ తదుపరి చిత్రాలు..

గత కొంతకాలంగా సరైన సక్సెస్ కోసం సతమతమవుతున్న విజయ్ దేవరకొండ, రణబాలి చిత్రంతో మంచి విజయాన్ని అందుకుంటారని అభిమానులు ధీమాని తెలియజేస్తున్నారు. విజయ్ దేవరకొండ తదుపరి సినిమాల విషయానికి వస్తే.. రౌడీ జనార్ధన్ అనే సినిమాలో నటిస్తున్నాడు . అలాగే డైరెక్టర్ శౌర్యతో కూడా మరొక సినిమాను చేయబోతున్నారు. చివరిగా 2025లో కింగ్డమ్ సినిమాతో అదరగొట్టారు విజయ్ దేవరకొండ.

- Advertisement -
Advertisement

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you