Sree Leela:సినీ ఇండస్ట్రీలో ఎప్పుడు ఎవరికి అదృష్టం అనేది ఎలా వస్తుందో చెప్పడం చాలా కష్టం.. కేవలం ఒక్క హిట్టుతోనే స్టార్డం అందుకోవచ్చు లేదా వరుస ఫ్లాపులు ఎదురైనా అవకాశాలు అందుకుంటూనే ఉంటారు. మరి కొంతమందికే తగ్గిపోవచ్చు. ముఖ్యంగా కథానాయికల కెరియర్లో ఈ మార్పులు చాలా వేగవంతంగానే కనిపిస్తాయి. ఇప్పుడు అలాంటి దశలోనే టాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రీ లీల(Sree Leela) కెరియర్ ఉందని చెప్పవచ్చు. తెలుగు సినీ పరిశ్రమలో కొంతకాలం పాటు శ్రీ లీల పేరు వరుసగా వినిపించింది. ఎంతో మంది స్టార్ హీరోలతో నటించిన ఈ ముద్దుగుమ్మ తన డాన్స్ గ్లామర్ తో యూత్లో మంచి క్రేజ్ సంపాదించుకుంది.
టాలీవుడ్ కి శ్రీ లీల దూరం కాబోతోందా?
కానీ శ్రీ లీల కెరియర్ లో మాత్రం చెప్పుకోదగ్గ విజయాలు ఏవి అందుకోలేదు. టాలీవుడ్ లో వరుస సినిమాలతో దూసుకు వెళ్లిన శ్రీ లీల కెరియర్ ప్రస్తుతం నెమ్మది అయినట్లుగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆమె కెరియర్కు ఒక కొత్త దశను ఎంచుకొని మరీ ప్రారంభించబోతున్నట్లు తెలుస్తోంది. టాలీవుడ్ లో అవకాశాలు తగ్గిపోతున్న సమయంలో శ్రీలీల ప్రస్తుతం బాలీవుడ్ వైపుగా ఫోకస్ పెట్టినట్లు కనిపిస్తోంది. హిందీ పరిశ్రమలో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమైన ఈ ముద్దుగుమ్మ.. అక్కడే వరస అవకాశాలు అందుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు కనిపిస్తోంది.
ALSO READ:Suriya:సరికొత్త రికార్డు సృష్టించబోతున్న సూర్య..!
ముంబై కి మకాం మార్చనున్న శ్రీ లీల..
కొంతకాలం క్రితం బాలీవుడ్లో అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ తన చదువు పైన దృష్టి పెట్టడంతో సినిమాలకు కొంత మేరకు విరామం ఇచ్చినట్లుగా తెలుస్తోంది. తాజాగా తన వైద్య విద్యను కూడా పూర్తి చేసిన శ్రీ లీల ఇప్పుడు పూర్తిస్థాయిలో సినిమాల పైన దృష్టి పెట్టడానికే సిద్ధమయ్యింది. ఈసారి బాలీవుడ్ లో ఒకటి రెండు చిత్రాలే కాకుండా తన కెరీర్ ను మరింత బలంగా నిర్మించుకునేలా శ్రీ లీల అడుగులు వేస్తున్నట్లు టాకు వినిపిస్తోంది. శ్రీ లీల ఫోకస్ మొత్తం ప్రస్తుతం బాలీవుడ్ వైపు గానే కనిపిస్తోంది. అందుకే తన నివాసాన్ని కూడా అక్కడికే మార్చుకున్నట్లు వినిపిస్తోంది.
ALSO READ:Bigg Boss:నందు బిగ్ బాస్ ఎంట్రీపై బాంబ్ పేల్చిన సంధ్యారెడ్డి.. నాగార్జునకు స్ట్రాంగ్ వార్నింగ్!
ముంబైలో కొత్త ఇల్లు కొనుగోలు..
హైదరాబాదు నుంచి ముంబైలో ఉండడం కోసమే శ్రీలీల అక్కడ ఒక విలాసవంతమైన భవనాన్ని కొనుగోలు చేసినట్లు వినిపిస్తోంది. ముంబైలో ఉండడం ద్వారా హిందీ చిత్రాలకు, హిందీ చిత్ర పరిశ్రమకు మరింత దగ్గరగా ఉండవచ్చనే భావనతో ప్లాన్ చేసినట్లు వినిపిస్తోంది. ప్రస్తుతం బాలీవుడ్లో స్టార్ హీరో కార్తీక్ ఆర్యన్ సరసన ఒక చిత్రంలో నటిస్తోంది . ఈ సినిమాతోనే బాలీవుడ్లోకి అడుగుపెడుతోంది. ఈ క్రేజీ ప్రాజెక్టు తనకి గుర్తింపు తెస్తుందని శ్రీలీలా కూడా ఆశలు పెట్టుకుంది. సౌత్ లో వరుసగా సినిమాలు చేయడం కంటే హిందీ సినిమాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వాలని శ్రీలీల భావిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.




