Suriya:కోలీవుడ్ హీరో సూర్య మొత్తం వరుస సినిమాలతో జోరు మీద ఉన్నారు. ఈ ఏడాది కరుప్పు, విశ్వనాథ్ అండ్ సన్స్ చిత్రాలతో మంచి విజయాలను అందుకున్నారు. ఇప్పుడు తాజాగా సూర్య రాబోయే చిత్రంతో హ్యాట్రిక్ కోసం ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. కంగువా, రెట్రో చిత్రాలతో సూర్య ప్రేక్షకుల ముందుకు వచ్చినా.. ఈ సినిమాలు పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. దీంతో ఇకమీదట ప్రయోగాలు చేసుకోవడం కంటే కథల సెలక్షన్స్ విషయంలో డిఫరెంట్ గా ఆలోచించడం మేలని, అందుకు తగ్గట్టుగా కమర్షియల్ యాంగిల్ సినిమా కదలని ఎంచుకుంటున్నారు.
వరుస సినిమాలతో జోరు పెంచిన సూర్య..
ఈ ఫార్ములా వర్క్ అవుట్ అయ్యే కరుప్పు, విశ్వనాథ్ అండ్ సన్స్ సినిమాతో మంచి విజయాలను అందుకున్నారు. ఈ సక్సెస్ ఎంజాయ్ చేస్తూ ఇప్పుడు మరొకసారి హ్యాట్రిక్ కొట్టేందుకు ప్లాన్ చేస్తున్నారు సూర్య. తన 47వ సినిమా టైటిల్ అండ్ రిలీజ్ డేట్ ని కూడా ప్రకటించారు. ఈ సినిమాని దీపావళి పండుగ సందర్భంగా బరిలోకి దింపబోతున్నారు. దీపావళి కానుకగా నవంబర్ ఆరవ తేదీన ఈ చిత్రాన్ని రిలీజ్ చేయబోతున్నారు. ఇందులో సూర్య ఒక డిఫరెంట్ గెటప్ లో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఆవేశం డైరెక్టర్ జీతూ మాధవన్ డైరెక్షన్, నజ్రియా హీరోయిన్గా, ప్రేమలు హీరో నస్లేన్ కీలకమైన పాత్రలో నటిస్తున్నారు.
ALSO READ:Bigg Boss:నందు బిగ్ బాస్ ఎంట్రీపై బాంబ్ పేల్చిన సంధ్యారెడ్డి.. నాగార్జునకు స్ట్రాంగ్ వార్నింగ్!
హ్యాట్రిక్ గ్యారెంటీ..
సీన్ సినిమాతో హ్యాట్రిక్ విజయాన్ని కొడితే ఈ తరం హీరోలలో విజయ్ సేతుపతి తర్వాత అలా ఒకే ఏడాది అలాంటి రేర్ ఫీట్ అందుకున్న హీరోగా సూర్య ఉండబోతున్నారు. సీన్ సినిమా 200 కోట్లు కొడితే కోలీవుడ్ చరిత్రలోనే ఈ మార్కును టచ్ చేసిన మొదటి హీరోగా రికార్డు క్రియేట్ చేయడం ఖాయమని అభిమానులు భావిస్తున్నారు. తెలుగు, తమిళ్, మలయాళం వంటి దర్శకులతో హ్యాట్రిక్ విజయాలను అందుకున్న తొలి తమిళ హీరోగా కూడా పేరు సంపాదించే అవకాశం ఉంది. మరి సూర్య కెరియర్ లో ఈ రికార్డ్స్ ఎలా క్రియేట్ చేస్తారో తెలియాలి అంటే దీపావళి వరకు ఆగాల్సిందే. ఈ సినిమాకి సూర్య భార్య జ్యోతిక నిర్మాతగా వ్యవహరిస్తున్నట్లు వినిపిస్తోంది.
ALSO READ:Bigg Boss:బిగ్ బాస్ హౌస్ నుంచి గోడ దూకి పారిపోయేందుకు కంటెస్టెంట్ ప్రయత్నం..!
పాత్రలకే ప్రాధాన్యతనిస్తున్న సూర్య..
సూర్య (Suriya)తన కెరియర్ లో ఎప్పుడూ కూడా విభిన్నమైన పాత్రలకే ప్రాధాన్యత ఇస్తూ ఉండేవారు. అయితే ఈ మధ్యకాలంలో కథల ఎంపిక విషయంలో కొంతమేరకు ఆచితూచి అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తోంది. అందుకే కథలలో చాలా డిఫరెంట్ గా ఉండడమే కాకుండా , విభిన్నమైన మాస్, క్లాస్ లుక్స్ తో ఆడియన్స్ ని ఆకట్టుకుంటున్నారు. ప్రస్తుతం సూర్యకి సంబంధించి ఈ న్యూస్ ఇప్పుడు వైరల్ గా మారింది.




