Friday, September 11, 2026
HomeLATESTActor Jayadev:టాక్సిక్ మూవీ మొదటిరోజు నెగిటివ్ రివ్యూ పై యశ్ కామెంట్స్..!

Actor Jayadev:టాక్సిక్ మూవీ మొదటిరోజు నెగిటివ్ రివ్యూ పై యశ్ కామెంట్స్..!

Actor Jayadev: ప్రముఖ సినీ నటుడు జయదేవ్ టాక్సిక్ మూవీ నెగిటివ్ టాక్ తెచ్చుకోవడం తో యశ్ రియాక్షన్ ను ఆయన బయటపెట్టారు.

on
- Advertisement -banner Ad

Actor Jayadev:కన్నడ హీరో రాకింగ్ స్టార్ యశ్ నటించిన తాజా చిత్రం టాక్సిక్. ఈ సినిమా భారీ అంచనాలతో ఆగస్టు 26న ప్రేక్షకుల ముందుకి విడుదలయ్యింది. అయితే విడుదలైన మొదటి రోజు నుంచి నెగిటివ్ టాక్ మూట కట్టుకోవడంతో ఈ సినిమా కలెక్షన్స్ పైన భారీగా దెబ్బ పడింది. అయితే ఈ సినిమా గురించి వచ్చిన నెగటివ్ రివ్యూస్ రావడంతో ఆయన ఫ్యాన్స్ కూడా ఫైర్ అయ్యారు. ముఖ్యంగా చాలామంది కన్నడ సెలబ్రిటీలు కూడా సినిమా కథని అర్థం చేసుకోవాలంటే సపోర్టు చేశారు. కానీ హీరో యశ్ నెగిటివ్ రివ్యూ ని ఎలా తీసుకున్నారనే విషయం ఇప్పుడు అందరిలోనూ ఆసక్తికరంగా మారింది.

టాక్సిక్ రిజల్ట్ పై యశ్ రియాక్షన్..

తాజాగా టాక్సిక్ చిత్రానికి డబ్బింగ్ సూపర్వైజర్ గా పని చేసిన నటుడు జయదేవ్ మోహన్.. హీరో యశ్ రియాక్షన్ గురించి తెలిపారు. ఈ సినిమా విడుదలైన మొదటి రోజు నెగటివ్ రివ్యూస్ రావడంతో యశ్ తనకి ఫోన్ చేశారని జైదేవ్ మోహన్(Actor Jayadev) తెలిపారు. అలా నెగిటివ్ రిలీజ్ వచ్చినప్పటికీ యశ్ చాలా కూల్ గా మాట్లాడారని సినిమా విషయంలో ఎక్కువగా ఆందోళన చెందాల్సిన పనిలేదంటూ యశ్ తెలిపినట్లు వివరించారు. ఎక్కువగా బాధపడొద్దు ఇక సినిమాను ప్రేక్షకులనే వదిలేద్దాం వాళ్లకు నచ్చితే ఆదరిస్తారు లేకపోతే లేదు.. కానీ వాళ్ళ నిర్ణయాన్ని మనం గౌరవించాలి. మనం చేయాల్సిన పని ఇంకా ఉంది అంటూ యశ్ చెప్పినట్లుగా తెలిపారు జైదేవ్.

- Advertisement -
Advertisement

ALSO READ:Sree Leela:టాలీవుడ్ కి దూరం కాబోతున్న శ్రీ లీల..!

నటుడు జయదేవ్ ఏమన్నారంటే..?

ఆయన స్వరంలో సినిమా రిజల్ట్ పైన ఎలాంటి బాధ ఉన్న చాలా స్పష్టంగా వినిపిస్తుంది. ఓ సినిమా కోసం ఎంతో కష్టపడిన తర్వాత మొదటి రోజు నెగటివ్ టాక్ రావడం హీరోతో పాటుగా టీం ని చాలా ప్రభావితం చేస్తుందని చెప్పుకొచ్చారు. అయినప్పటికీ యశ్ మాత్రం రిజల్ట్ నే అంగీకరిస్తూ ముందుకు వెళ్లే ధోరణిని ప్రదర్శించినట్లుగా తెలిపారు. భారీ బడ్జెట్ తో డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో ఈ సినిమా విడుదలయ్యింది. ట్రైలర్, టీజర్ కి వచ్చిన రెస్పాన్స్ థియేటర్లలో సినిమా విడుదలైన తర్వాత సినిమాను చూసిన ప్రేక్షకులు ఆశించిన స్థాయిలో లేకపోవడంతో బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా మిగిలింది.

- Advertisement -
Advertisement

ALSO READ:Suriya:సరికొత్త రికార్డు సృష్టించబోతున్న సూర్య..!

యశ్ పై ప్రశంసలు..

సుమారుగా టాక్సిక్ సినిమాకి 250 నుంచి 300 కోట్ల రూపాయల వరకు నష్టం వచ్చినట్లుగా వినిపిస్తుంది. సినిమా ఫలితం ఎలా ఉన్నప్పటికీ నెగిటివ్ రివ్యూస్ వచ్చినా.. యశ్ స్పందించిన తీరు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.. ప్రేక్షకుల తీర్పుని తప్పు పట్టకుండా గౌరవిస్తూ తన పని పైన దృష్టి పెట్టడం తో పలువురు నెటిజన్స్ సైతం యశ్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రస్తుతం యశ్ బాలీవుడ్ రామాయణ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా ఈ ఏడాది దీపావళికి విడుదల కాబోతోంది.

- Advertisement -
Advertisement

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you