Bigg Boss:బిగ్ బాస్.. ఈ రియాలిటీ షో గురించి ప్రత్యేకంగా చెప్పాలా? బిగ్ బాస్ టీవీలో వస్తుందంటే చాలా పనులన్నీ పక్కన పెట్టుకొని ఇంట్రెస్ట్‌గా చూసే జనాలు బోలెడు మంది. ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 10 తెలుగు భాషలో సక్సెస్‌ఫుల్‌గా ముందుకు వెళ్తుంది. హిందీలో 20వ సీజన్ నడుస్తుండగా, తమిళం, తెలుగు భాషల్లో పదో సీజన్, మలయాళంలో 9వ సీజన్, కన్నడలో 13వ సీజన్ ఘనంగా మొదలయ్యాయి. ఇప్పుడు అన్ని భాషల్లోనూ బిగ్ బాస్ టాప్ టీఆర్‌పీ రేటింగ్‌తో ముందుకు వెళ్తుంది.
బిగ్ బాస్ హోస్టుల రెమ్యునరేషన్‌పై ఆసక్తి :
అయితే బిగ్ బాస్ గురించి ఎక్కువగా మాట్లాడుకునే జనాలు.. బిగ్ బాస్‌లోకి వెళ్లే కంటెస్టెంట్ల రెమ్యునరేషన్ గురించి, బిగ్ బాస్ షోను హోస్ట్ చేసే వాళ్ల రెమ్యునరేషన్ గురించి ఎక్కువగా చర్చించుకుంటూ ఉంటారు. ముఖ్యంగా బిగ్ బాస్ అనగానే అందరికీ బాగా గుర్తొచ్చేది సల్మాన్ ఖాన్. ఇండియన్ బిగ్ బాస్ చరిత్రలోనే అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే హోస్ట్‌గా ఆయనకు ఎప్పుడూ స్పెషల్ ఫ్యాన్ ఫాలోయింగ్, క్రేజ్ ఉంటుంది.
సల్మాన్ ఖాన్‌కు ఏకంగా రూ.120 కోట్లు? :
హిందీ బిగ్ బాస్ 20వ సీజన్ కోసం సల్మాన్ ఖాన్ ఏకంగా రూ.120 కోట్లు ఛార్జ్ చేశాడు అంటూ న్యూస్ బయటకు వచ్చింది. ఇది బిగ్ బాస్ (Bigg Boss)చరిత్రలోనే ఒక సంచలనం అంటూ కూడా నివేదికలు పేర్కొన్నాయి. ఒక్కో వీకెండ్ ఎపిసోడ్‌కు ఈ బాలీవుడ్ సుల్తాన్ సల్మాన్ ఖాన్ దాదాపు రూ.16 కోట్లకు పైగానే అందుకుంటూ ఉండడం విశేషం.
also read:Friday Tv movies:టీవీ ప్రేక్షకులకు ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్.. ఈరోజు సినిమాలివే!
నాగార్జున రెమ్యునరేషన్ ఎంతంటే? :
ఇక తెలుగులో అక్కినేని నాగార్జున హోస్ట్‌గా కొనసాగుతున్నారు. సీజన్ 3 కు రూ.10 కోట్లు తీసుకున్న ఆయన.. ప్రస్తుతం సీజన్ 10కి రూ.42 కోట్లు తీసుకుంటున్నట్లు టాక్ వినిపిస్తుంది.
also read:Epic Movie:ఎపిక్ మూవీ రివ్యూ: ఆనంద్, వైష్ణవి ప్రేమకథ ఎలా ఉంది?
కమల్ హాసన్ తర్వాత విజయ్ సేతుపతి :
తమిళంలో కమల్ హాసన్ తప్పుకున్న తర్వాత ఆ స్థానాన్ని భర్తీ చేసిన స్టార్ హీరో విజయ్ సేతుపతి ఏకంగా రూ.75 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు టాక్ వినిపిస్తుంది.
మోహన్‌లాల్‌కు రూ.35 కోట్లు :
ఇక మలయాళంలో మొదటి సీజన్ నుంచి తిరుగులేని హోస్ట్‌గా తనదైన స్టైల్‌లో దూసుకుపోతున్న మోహన్‌లాల్.. ఈ కొత్త సీజన్ కోసం రూ.35 కోట్లు ఛార్జ్ చేసినట్లు తెలుస్తుంది.
కన్నడలో కిచ్చా సుదీప్ :
మరోవైపు కన్నడలో కూడా బిగ్ బాస్ సూపర్ డూపర్ హిట్ అవుతుంది. 13వ సీజన్ కోసం కిచ్చా సుదీప్ దాదాపు రూ.22 కోట్లు పారితోషికం తీసుకున్నాడు అంటూ టాక్ వినిపిస్తుంది.
హోస్ట్ పాత్ర కూడా కీలకమే.. :
బిగ్ బాస్ షోను నడిపించడంలో కంటెస్టెంట్ల పాత్ర ఎంత ముఖ్యమో.. వాళ్లను క్రమశిక్షణలో పెడుతూ, వారిని ఎంకరేజ్ చేసే పాత్ర అయిన హోస్ట్‌ది కూడా అంతే ముఖ్యం. అందుకే బిగ్ బాస్ మేనేజ్‌మెంట్ టాప్ హీరోలను ఆ లిస్ట్‌లో చేరుస్తూ, వాళ్లు అడిగినంత రెమ్యునరేషన్ ఇస్తున్నారు.
ఒక సినిమా చేయకపోయినా పర్వాలేదు.. ఏడాదికి ఒకసారి ఈ బిగ్ బాస్ షోను హోస్ట్ చేస్తే చాలు.. కోట్లకు కోట్లు అకౌంట్‌లో వచ్చి చేరుతాయి అంటున్నారు సినీ ప్రముఖులు.




