Samantha: టాలీవుడ్ హీరోయిన్ సమంత మొదటిసారి ఏ మాయ చేసావే సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమయ్యింది. ఆ తర్వాత ఎంతో మంది స్టార్ హీరోలతో నటించి అతి తక్కువ సమయంలోనే స్టార్ స్టేటస్ ని సంపాదించుకున్న సమంత.. అక్కినేని హీరో నాగచైతన్యను ప్రేమించి వివాహం చేసుకుంది. అనంతరం పలు సినిమాలలో నటించిన సమంత(Samantha) నాగచైతన్య ను వివాహమైన నాలుగేళ్లకే విడాకులు తీసుకోవడంతో నిరంతరం వార్తలలో నిలుస్తూనే ఉండేది. ముఖ్యంగా ఎఫైర్ రూమర్స్ కూడా సమంత పైన చాలా ఎక్కువగానే వినిపించాయి.
సమంత చేతి వేలికి స్పెషల్ రింగ్..
వీటికి తోడు సమంత మయోసైటిస్ వ్యాధి బారిన పడడంతో సమంత చాలా ఇబ్బందులను ఎదుర్కొంది. ఆ తర్వాత మళ్లీ తిరిగి సినిమాలలో నటించడమే కాకుండా ప్రముఖ డైరెక్టర్ గా పేరు సంపాదించిన రాజ్ నిడుమోరును ప్రేమించి రెండవ వివాహం చేసుకుంది. అప్పుడు కూడా సమంత పైన చాలా దారుణంగానే ట్రోల్స్ వినిపించాయి. అయినా కూడా వాటన్నిటిని లెక్కచేయకుండా సమంత , డైరెక్టర్ రాజ్ నిడుమోరును వివాహం చేసుకొని త్వరలోనే తల్లి కాబోతోంది. సమంత వివాహానికి సంబంధించి కొన్ని ఫోటోలు కూడా సోషల్ మీడియాలో గడిచిన కొన్ని నెలల క్రితం వైరల్ గా మారాయి.
also read:Bigg Boss:బిగ్ బాస్ హోస్టుల రెమ్యునరేషన్.. ఎవరు ఎంత తీసుకుంటున్నారంటే?
ఆ రింగ్ ప్రత్యేకతపై సమంత ఏమన్నారు అంటే?
అయితే ఇటీవల ది హాలీవుడ్ రిపోర్టర్ ఇండియా తో మాట్లాడిన సమంత తన ఎంగేజ్మెంట్ గురించి పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేసింది. సమంత మాట్లాడుతూ తమ పెళ్లి ఫోటోలను షేర్ చేసిన సమయంలో తన వేలికి ఉన్న రింగు ప్రత్యేక ఆకర్షణీయంగా నిలిచిందని అయితే ఈ రింగ్.. నాకు రాజ్ ప్రపోజ్ చేసిన సమయంలో నా చేతికి తొడిగారని తెలిపారు. ఈ రింగుకు సంబంధించిన ఎలాంటి విషయాలైనా సరే రాజ్ ను అడగాల్సిందే అంటూ సమంత తెలిపింది. కానీ ఈ రింగ్ మాత్రం గ్రీకుకి చెందిన ఒక జ్యువెలరీ డిజైనర్ రూపొందించారనే విషయం మాత్రమే తనకు తెలుసు అంటూ తెలిపింది.
also read:Friday Tv movies:టీవీ ప్రేక్షకులకు ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్.. ఈరోజు సినిమాలివే!
తొలి బిడ్డ కోసం వెయిటింగ్..
ఈ రింగ్ రాజ్ కి చాలా ప్రత్యేకం అని తెలిపింది సమంత. అయితే పెళ్లిలో కాకుండా సమంతకు ప్రపోజ్ చేసే సమయంలోనే ఈ రింగ్ ని తొడిగినట్లు తెలిపింది. దీని విలువ సుమారుగా కోటి రూపాయలకు పైగా ఉంటుందని సమాచారం. అంతేకాకుండా ఇందులో ఎనిమిది ప్రొడ్రైట్ కట్ వజ్రాలు, పూలరేకులు కూడా అమర్చినట్లు తెలుస్తోంది. డిసెంబర్ ఒకటి 2025న ఈషా ఫౌండేషన్ లో అత్యంత సన్నిహితుల సమక్షంలో సమంత, రాజ్ నిడుమోరు వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. త్వరలోనే వీరిద్దరూ బిడ్డకు జన్మనివ్వబోతున్నారు. ఈ నేపథ్యంలోనే సమంత సినిమాలకు బ్రేక్ ఇచ్చి మరి ప్రెగ్నెన్సీ లైఫ్ ని ఎంజాయ్ చేస్తోంది. ప్రస్తుతం సమంత చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.




