Kalanithi maran:బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్న డైరెక్టర్లు చాలామంది ఉన్నారు. అయితే డైరెక్టర్లు హీరోగా నటించి మంచి విజయాలు అందుకున్న సెలబ్రిటీలు కూడా చాలా తక్కువ మందే ఉన్నారు. అలాంటి వారిలో డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కూడా ఒకరు. ఈ ఏడాది డీసీ చిత్రం ద్వారా హీరోగా పరిచయమై భారీ విజయాన్ని అందుకున్నారు. ఆగస్టు 7న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ తమిళ యాక్షన్ డ్రామా చిత్రం బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. 25 కోట్లతో తీసిన ఈ సినిమా ఏకంగా 100 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది.
వారికి బీఎండబ్ల్యూ కార్లు బహుమతి..
చిన్న బడ్జెట్ తో ఇంతటి విజయాన్ని సాధించడంతో సన్ పిక్చర్స్ సంస్థ ఈ విజయోత్సవాన్ని చాలా ఘనంగా సెలబ్రేట్ చేసుకుంది. ఈ విజయానికి ప్రధాన కారణమైన ముగ్గురు కీలకమైన వ్యక్తులను సైతం కళానిధి మారన్ స్వయంగా అభినందించారు. సినిమా డైరెక్టర్ అరుణ్ మాదేశ్వరన్ , ఈ సినిమా ద్వారా హీరోగా పరిచయమైన డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ ,అలాగే సినిమా సక్సెస్లో కీలకమైన సంగీతాన్ని అందించిన మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ లకు లగ్జరీ బీఎండబ్ల్యూ కార్లను కానుకగా అందించారు.
also read:Samantha: సమంత ఎంగేజ్మెంట్ రింగ్ స్పెషల్ ఏంటో తెలుసా..?
చిత్ర బృందానికి స్పెషల్ రివార్డ్..
ఇందుకు సంబంధించిన దృశ్యాలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్ గా మారుతున్నాయి. ఈ సినిమా కోసం పనిచేసిన టెక్నీషియన్ల శ్రమను కూడా గుర్తించి వారికి తగిన రీతిలో భారీ రివార్డులను కూడా ప్రకటించారు నిర్మాత కళానిధి మారన్(Kalanithi maran). ఈ విషయం పైన చాలామంది నేటిజన్స్ పై సినీ ప్రముఖులు కూడా ప్రశంసల కురిపిస్తున్నారు. మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ వరుసగా బ్లాక్ బాస్టర్ విజయాలను అందుకుంటూ దూసుకుపోతున్నారు. లగ్జరీ కారుని కూడా చేర్చుకోవడం అభిమానులకు మరింత ఆసక్తిని కలిగిస్తోంది.
also read:Bigg Boss:బిగ్ బాస్ హోస్టుల రెమ్యునరేషన్.. ఎవరు ఎంత తీసుకుంటున్నారంటే?
వైరల్ గా మారిన ఫోటోలు..
అయితే ఈ వేడుకలు వైరల్ గా మారుతున్న వేళ సినీ వర్గాలలో ఒక ఆసక్తికరమైన చర్చ మొదలయ్యింది. అదేమిటంటే ఈ చిత్రంలో నటించిన హీరోయిన్ వామిక గబ్బి తన విలక్షణమైన నటనతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఆమె నటనే డిసి సినిమాకి ప్రధాన బలమని చెప్పవచ్చు.. అయితే ఈ సినిమా విజయోత్సవంలో డైరెక్టర్ హీరో మ్యూజిక్ డైరెక్టర్ లకు ప్రాధాన్యం లభించింది. కానీ హీరోయిన్ గా నటించిన వామికా గబ్బికి మాత్రం దక్కకపోవడం పై పలు రకాలుగా నేటిజన్స్ సినీ విశ్లేషకులు సైతం చర్చించుకుంటున్నారు. ఏది ఏమైనా తక్కువ బడ్జెట్ తో భారీ విజయాన్ని అందుకొని భారీ కలెక్షన్స్ రాబట్టిన చిత్రంగా నిలిచింది డిసి సినిమా. మరి రాబోయే రోజుల్లో కూడా డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ తదుపరి సినిమాలను ప్రకటిస్తారేమో చూడాలి మరి.
Mr. Kalanithi Maran congratulated and presented the keys to brand-new BMW cars to Arun Matheswaran, Lokesh Kanagaraj and Anirudh, for the success of Blockbuster #DC! 💥@Dir_Lokesh @ArunMatheswaran @anirudhofficial #DCMegaBlockbuster pic.twitter.com/QOgmCA6ZqI
— Sun Pictures (@sunpictures) September 10, 2026




