418 Trailer:హారర్ సినిమాలు అంటే ఇష్టపడని వాళ్లు ఎవరైనా ఉంటారా? భయమేసినా సరే కళ్లకు చేతులు అడ్డుపెట్టుకొని, చేతి వేళ్ల సందుల్లో నుంచి వణుకుతూ వణుకుతూ సినిమాలు చూస్తారు. అంత ఇష్టం హారర్ మూవీస్ అంటే. అయితే ప్రతి ఒక్క హారర్ మూవీకి భారీ స్థాయిలో విజువల్ ఎఫెక్ట్స్, సౌండ్ ఎఫెక్ట్స్ ఉండాల్సిన పనిలేదు. కథతో కూడా భయపెట్టేస్తుంటారు. అలాంటి ఒక సినిమానే ‘418’. ఈ సినిమా ట్రైలర్ రీసెంట్‌గా రిలీజ్ అయింది.
ప్రశాంత్ అనిల్ సమర్పణలో ‘418’ :
ప్రశాంత్ అనిల్ సమర్పణలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు కీర్తన్ నాడ గౌడ డైరెక్షన్ వహించడం విశేషం. రీసెంట్‌గా విడుదలైన ట్రైలర్ అభిమానులను బాగా ఆకట్టుకుంటుంది. ఆకట్టుకుంది అని చెప్పడం కన్నా కూడా బాగా వణికించేసింది అని చెప్పడం పర్ఫెక్ట్.
ట్రైలర్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ‘వాట్ నెక్స్ట్.. వాట్ నెక్స్ట్..’ అని ఖచ్చితంగా అనుకుంటాం. ఇదేనేమో జరగబోయేది అని అనుకునే లోపే వేరే ట్విస్ట్ పెట్టేస్తారు. అలా టైప్‌లో ట్రైలర్ చాలా ఇంట్రెస్టింగ్ కట్స్‌తో ముగిసింది.
ALSO READ:TV:శనివారం టీవీ ముందు నుంచి కదలరు.. వరుసగా అదిరిపోయే సినిమాలు!
418 గదిలో అసలు ఏం జరుగుతుంది? :
ఇక ట్రైలర్ విషయానికి వస్తే.. 418 నెంబర్(418 Trailer) గదిలో ఏం జరుగుతుంది అసలు అనేదే ఈ సినిమా కాన్సెప్ట్. 15 ఏళ్లుగా మూసి ఉన్న గదిని మళ్లీ ఎందుకు తెరిచారు? అసలు అక్కడ ఏం జరిగింది? ఎందుకు 15 ఏళ్లుగా ఆ గదిలోకి ఎవరు వెళ్లలేదు? ఆ భయంకరమైన రహస్యం ఏంటి? అక్కడ అడుగుపెట్టిన వాళ్లకు ఏమవుతుంది? ఇంతవరకు అడుగు పెట్టిన వాళ్లు ఏమయ్యారు? అనే ప్రశ్నలు వెంటాడుతూనే ఉంటాయి.
ALSO READ:Samyuktha Menon:ఏకకాలంలో 6 చిత్రాలలో నటిస్తున్న స్టార్ హీరోయిన్.. ఆకట్టుకుంటున్న పోస్టర్స్!
సీరియస్ హారర్ థ్రిల్లర్‌గా ‘418’ :
సూర్యరాజు, చరణ్ లక్కరాజు, చైత్ర జె. ఆచార్, ప్రీతి పగడాల కీలక పాత్రల్లో నటించిన ఈ ‘418’ను సాధారణ హారర్ సినిమాలకు అస్సలు భిన్నంగా, చాలా డిఫరెంట్‌గా క్యూరియాసిటీ పెంచేస్తూ సీరియస్ హారర్ థ్రిల్లర్‌గా రూపొందించినట్లు ట్రైలర్ చూస్తేనే అర్థమవుతుంది.
ఇందులో 15 ఏళ్లుగా మూసి ఉన్న ఒక భవనంలోకి విజిట్ చేయడానికి యువత అక్కడికి వస్తుంది. అప్పుడు వాళ్లకు ఎదురైన సంఘటనలు ఎలా ఉన్నాయి? అసలు ఆ భవనం ఎందుకు క్లోజ్ చేసి ఉంది? అనేది అసలు కాన్సెప్ట్.
రూమ్ నెంబర్ 418 చుట్టూ మిస్టరీ :
ముఖ్యంగా రూమ్ నెంబర్ 418 చుట్టూ ఉన్న మిస్టరీ కథకు బాగా హైలైట్‌గా నిలుస్తుంది అని ట్రైలర్ చూస్తే తెలిసిపోతుంది. ఇక ట్రైలర్‌లో ‘దెయ్యాల కంటే మన ఊహలే ఎక్కువ ప్రమాదకరంగా ఉన్నాయి’ అని చెప్పేలా చూపించారు.
పెద్దగా కథను రివీల్ చేయకపోయినా సరే.. మూసి ఉన్న గది, అక్కడి వింత వాతావరణం, శబ్దాలు ట్రైలర్‌లో బాగా హీట్ పెంచేశాయి. చైత్ర జె. ఆచార్ పోషించిన దేవిక పాత్ర ట్రైలర్ మొత్తానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
సెప్టెంబర్ 18న థియేటర్లలో రిలీజ్ :
సెప్టెంబర్ 18వ తేదీన ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ అవ్వడానికి సిద్ధంగా ఉంది. సెన్సార్ సర్టిఫికెట్ ఈ సినిమాకు ఇవ్వడం గమనార్హం. ఈ సినిమా ఎంతవరకు జనాలను ఆకట్టుకుంటుంది అనేది తెలియాలంటే సెప్టెంబర్ 18 వరకు ఆగి వేచి చూడాల్సిందే. ఈ లోపు ఒకసారి ట్రైలర్‌పై లుక్కేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.




