Sunday, September 13, 2026
HomeLATESTVishnu Vishal:సోషల్ మీడియాకెక్కిన కోలీవుడ్ స్టార్స్ రచ్చ..పోస్ట్ వైరల్..!

Vishnu Vishal:సోషల్ మీడియాకెక్కిన కోలీవుడ్ స్టార్స్ రచ్చ..పోస్ట్ వైరల్..!

Vishnu Vishal:తమిళ నటుడు సూరితో జరిగిన గొడవకు సంబంధించి వస్తున్న వార్తలపై నటుడు విష్ణు విశాల్ స్పందించారు.

on
- Advertisement -banner Ad

Vishnu Vishal:ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలోని తోటి నటులకు అస్సలు పడడం లేదు. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ ఇలా అన్ని ఇండస్ట్రీల్లో ఉండే స్టార్ హీరోలకు, క్యారెక్టర్ ఆర్టిస్టులకు మధ్య ఏవో ఒక తగాదాలు వస్తూనే ఉన్నాయి. పైగా సోషల్ మీడియా అందరికీ అందుబాటులో ఉండడంతో ఆ వార్తలు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి.

రీసెంట్‌గా కోలీవుడ్ నటుడు విష్ణు విశాల్ (Vishnu Vishal)సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్ట్ హాట్ టాపిక్‌గా మారింది. విష్ణు విశాల్ గురించి అందరికీ తెలిసిందే. మంచి నటుడైన ఆయన నటించే సినిమాలు బాగా అభిమానులను ఆకట్టుకుంటూ ఉంటాయి. ఆయనకు ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంది.

- Advertisement -
Advertisement

సూరితో విభేదాలపై విష్ణు విశాల్ స్పందన :

ప్రముఖ కమెడియన్ సూరితో గతంలో తలెత్తిన విభేదాల గురించి ఈ మధ్యకాలంలో ఆయనపై నెగెటివ్‌గా వార్తలు వినిపించాయి. ఈ క్రమంలోనే దీనిపై ఆయన స్పందించారు. “మా మధ్య ఉన్న గొడవల గురించి ఈ మధ్యకాలంలో వార్తలు వస్తున్నాయి. మా మధ్య ఉన్న మనస్పర్థలు ఎప్పుడో పోయాయి. 2024లోనే పూర్తిగా క్లియర్ అయిపోయాయి. ఈ అంశంపై జరుగుతున్న తప్పుడు ప్రచారాలకు చెక్ పెట్టండి. అనవసరమైన విషయాలను పదే పదే చర్చించకండి. అది చాలా బ్యాడ్ రిమార్క్ అవుతుంది.

2024లోనే మేమిద్దరం పాత అపార్థాలన్నింటినీ పూర్తిగా పక్కన పెట్టేసి, కొత్త బాండింగ్‌తో ముందుకు వెళ్తున్నాం. మేమిద్దరం అండర్‌స్టాండింగ్‌తో ఉన్నాం. మా మధ్య ఉన్న స్నేహాన్ని చెడగొట్టొద్దు. ఒకరికి ఒకరు మంచి జరగాలని మేమిద్దరం కోరుకుంటున్నాం.

- Advertisement -
Advertisement

గతంలో ఎప్పుడో తలెత్తిన విషయాలను ఇప్పుడు మళ్లీ సోషల్ మీడియా వేదికగా బయటకు తీసి మా మధ్య ఉన్న స్నేహాన్ని పాడు చేయకండి. ఇద్దరం కెరీర్‌లో ముందుకు వెళ్తున్నాం. మాకు సపోర్ట్ చేయండి. ఆ పాత విషయాలన్నీ మర్చిపోయి కొత్త ప్రయాణంలో ముందుకు తీసుకెళ్తే బాగుంటుంది” అని కోరుకుంటున్నాను అంటూ విష్ణు విశాల్ తన సోషల్ మీడియా వేదికగా రియాక్ట్ అయ్యారు.

సూరితో కలిసి ఉన్న ఫొటో షేర్ చేసిన విష్ణు విశాల్ :

ఈ పోస్ట్‌తో పాటు సూరితో కలిసి ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసేలా ఒక ఫొటో కూడా షేర్ చేశారు. అది కాస్తా నెట్‌లో వైరల్ అవుతోంది.

- Advertisement -
Advertisement

also read:Pranay Vanga:”దమ్ముంటే ‘స్పిరిట్’ను కిల్ చేయండి చూద్దాం”..సందీప్ రెడ్డి వంగా బ్రదర్ సంచలన సవాల్..!

2020లో ఏం జరిగింది? :

2020 సంవత్సరంలో విష్ణు విశాల్ తండ్రికి సంబంధించిన ఒక భూ లావాదేవీల వ్యవహారంలో ప్రముఖ ఫైనాన్షియర్‌తో విభేదాలు తలెత్తాయి. ఈ ఆర్థిక లావాదేవీల వివాదంలో కమెడియన్ సూరి నేరుగా పోలీసులను ఆశ్రయించడం అప్పట్లో సెన్సేషన్‌గా మారింది. బాగా హీట్ పెంచేసింది.

వీరిద్దరి మధ్య విభేదాలు తారస్థాయికి చేరాయి. గొడవలన్నీ ఇలా జరిగినప్పటికీ, ఆ తర్వాత వీళ్లంతా సెట్ చేసుకున్నారు. కానీ సోషల్ మీడియాలో మాత్రం వాళ్లకు సంబంధించి అడపాదడపా నెగెటివ్ వార్తలు వస్తూనే ఉన్నాయి.

also read:The Paradise:నాని ప్యారడైజ్ సినిమా విషయంలో సంచలన నిర్ణయం..!

పాత విషయాలకు చెక్ పడుతుందా? :

ఈ క్రమంలోనే తాజాగా విష్ణు విశాల్ స్పందించాల్సి వచ్చింది. చూడాలి మరి.. విష్ణు విశాల్ పోస్టుతోనైనా ఆ వార్తలకు చెక్ పడుతుందో లేదో. మరికొందరు మాత్రం “ కలిసిపోయారు.. అదే చాలు” అంటూ హ్యాపీగా రియాక్ట్ అవుతున్నారు.

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you