Ravi Teja:టాలీవుడ్ లో మాస్ హీరోగా పేరు సంపాదించిన రవితేజ ఈ ఏడాది ఇరుముడి సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నారు. రవితేజ కెరియర్ లోనే ఇరుముడి సినిమా మర్చిపోలేని సినిమాగా నిలిచింది. ముఖ్యంగా డైరెక్టర్ శివ నిర్వాణ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కించారు. ప్రియా భవాని శంకర్ హీరోయిన్ గా, బేబీ నక్షత్ర కీలకమైన పాత్రలో నటించింది. అలాగే సాయికుమార్, అజయ్ ఘోష్, రమేష్ ఇందిరా తదితర నటీనటులు నటించారు. ఇరుముడి సినిమాతో రవితేజ మార్కెట్ ఒక్కసారిగా పుంజుకుందని చెప్పవచ్చు.
రెమ్యూనరేషన్ పెంచేసిన రవితేజ..
ఇరుముడి సినిమా ఇచ్చిన సక్సెస్ కారణంగా రవితేజ(Ravi Teja) తన రెమ్యూనరేషన్ ని భారీగా పెంచేసినట్లు టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. సాధారణంగా పెద్ద హీరోలు.. తమ చిత్రాలకు నేరుగా రెమ్యూనరేషన్ అందుకోవడం లేదు. ముఖ్యంగా థియేట్రికల్ హక్కులలో వాటా తీసుకోవడం వంటివి చేస్తున్నారు. అలా ఇరుముడి ప్రాజెక్టు విషయంలో కూడా వాటిని అనుసరించారు ముందుగా రెమ్యూనరేషన్ తీసుకోకుండా నైజాం ఏరియా పంపిణీ హక్కులతో పాటుగా లాభాలలో కూడా వాటా తీసుకునేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. అలా నైజాం వసూళ్లతోనే ఏకంగా 50 కోట్లకు పైగా ఆదాయాన్ని అందుకున్నారు రవితేజ. ఇరుముడి సినిమా కేవలం నైజాం ఏరియాలోనే కాకుండా అన్ని ప్రాంతాలలో కూడా కళ్ళు చెదిరే లాభాలను అందుకుంది.
also read:Vishnu Vishal:సోషల్ మీడియాకెక్కిన కోలీవుడ్ స్టార్స్ రచ్చ..పోస్ట్ వైరల్..!
రెమ్యూనరేషన్ విషయంలో ఊహించని మార్పులు..
ఇటీవలే సినిమా విజయోత్సవ వేడుకలలో ప్రముఖ డైరెక్టర్ గా పేరు సంపాదించిన అనిల్ రావుపూడి సైతం సరదాగా కొన్ని విషయాలు బయటపెట్టడంతో రవితేజ రెమ్యూనరేషన్ విషయం మరింత బలాన్ని చేకూర్చింది. ఇరుముడి సినిమాతో భారీ మొత్తం రవితేజ చేతికి లభించడంతో తన రాబోయే ప్రాజెక్టుల లాభాలలో వాటాల పద్ధతిని పక్కన పెట్టి మరి ఇక ఒక్కో సినిమాకి 50 కోట్ల వరకు రెమ్యూనరేషన్ చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారట. ముఖ్యంగా అగ్ర నిర్మాత దిల్ రాజు నిర్మాణ విషయంలో రవితేజ హీరోగా సంక్రాంతి బరిలో ఉండాల్సిన ఒక క్రేజీ ప్రాజెక్టు ఈ కారణం వల్ల ఆలస్యం అవుతోందనే విధంగా వినిపిస్తోంది.
also read:Pranay Vanga:”దమ్ముంటే ‘స్పిరిట్’ను కిల్ చేయండి చూద్దాం”..సందీప్ రెడ్డి వంగా బ్రదర్ సంచలన సవాల్..!
రవితేజ మార్కెట్ విలువ ఒక్క సినిమాతో మారిపోతుందా?
రవితేజ మార్కెట్ విలువను ఒక సినిమా ఫలితంతో నిర్ధారించలేమంటూ ట్రేడ్ విశ్లేషకులు సైతం తెలియజేస్తున్నారు గతంలో ధమాకా వంటి సినిమా మంచి హిట్ టాక్ అయింది. కానీ ఆ తర్వాత నటించిన చిత్రాలన్నీ కూడా అభిమానులను నిరాశపరిచాయి. అయితే అందులో కొన్ని సినిమాలు కొన్ని ప్రాంతాలలో 10 కోట్ల గ్రాస్ కూడా అందుకోలేకపోయాయని , దీంతో చాలా ప్రాంతాలలో నష్టం కూడా వాటిల్లిందని వినిపిస్తున్నాయి. అందుకే రవితేజకు ఏకంగా 50 కోట్ల రెమ్యూనరేషన్ ఇవ్వడం అంటే ఎంత కరెక్టు అనే సందేహాలు ఇప్పుడు మొదలవుతున్నాయి. మరి ఈ విషయం పైన రవితేజ ఎలా స్పందిస్తారో చూడాలి మరి. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన న్యూస్ వైరల్ గా మారింది.




