Sunday, September 13, 2026
HomeLATESTAdarsha kutumbam:వెంకటేష్ ఆదర్శ కుటుంబం టీజర్ రిలీజ్..!

Adarsha kutumbam:వెంకటేష్ ఆదర్శ కుటుంబం టీజర్ రిలీజ్..!

Adarsha kutumbam: వెంకటేష్ త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న ఆదర్శ కుటుంబం ఏకే 47 మూవీ నుండి తాజాగా టీజర్ విడుదల చేశారు.

on
- Advertisement -banner Ad

Adarsha kutumbam:టాలీవుడ్ హీరో విక్టరీ వెంకటేష్ , డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న తాజా చిత్రం ఆదర్శ కుటుంబం.. AK 47. ఈ సినిమా గత కొంతకాలంగా వరుస అప్డేట్లతో మంచి హైప్ ఏర్పడింది. ఈ చిత్రంతో త్రివిక్రమ్ తన మార్కుని మరొకసారి చూపించబోతున్నారు. వెంకటేష్ కి జోడిగా శ్రీనిధి శెట్టి నటించబోతోంది. వెంకటేష్ కు ఉన్న కుటుంబ ప్రేక్షకుల ఇమేజ్ ని త్రివిక్రమ్ మార్కుతో ఈ సినిమా కథలో మరింత వినోదాన్ని జోడించి మరి తెరకెక్కించినట్లు ఇప్పటివరకు విడుదలైన అప్డేట్ లలో కనిపిస్తోంది.

ఆదర్శ కుటుంబం టీజర్ రిలీజ్..

ఇప్పుడు తాజాగా ఈ చిత్రానికి సంబంధించి టీజర్ ని విడుదల చేశారు. మధ్యతరగతి ఇళ్లల్లో జరిగే సరదా సంభాషణలతో మొదలైన గ్లింప్స్ వెంకీ, వెంకటేష్ కామెడీతో త్రివిక్రమ్ పవర్ ఫుల్ డైలాగ్స్ తో ఊహించని ఎనర్జిటిక్ యాక్షన్ సీన్స్ ఇందులో మరింత ఆకట్టుకుంటున్నాయి. హీరో వెంకటేష్ తనదైన శైలిలో నవ్విస్తూనే యాక్షన్ ఎలివేన్స్ తో మరింత థ్రిల్ చేసేలా కనిపిస్తున్నారు. ఆదర్శ కుటుంబం AK 47 హౌసులో ఆదర్శ కుటుంబంలా(Adarsha kutumbam) కనిపిస్తూనే.. ఆ ఫ్యామిలీ దాచిన అసలు కథ ఏంటి అనేది టీజర్ లో మరింత ఉత్కంఠ రేకెత్తించేలా కనిపిస్తోంది.

- Advertisement -
Advertisement

also read:Ravi Teja:ఇరుముడి సక్సెస్ తో భారీగా రెమ్యూనరేషన్ పెంచిన రవితేజ..!

సినిమాపై అంచనాలు పెంచిన టీజర్..

నారా రోహిత్, నివేదా పేతురాజు, బ్రహ్మాజీ, రఘు బాబు, వెన్నెల కిషోర్, సత్య వంటి నటీనటులు ఇందులో నటించారు. థమన్ అందించిన మ్యూజిక్ కూడా టీజర్ ఎలివేన్స్ ని మరింత ముందుకు తీసుకువెళ్లిందని చెప్పవచ్చు. త్రివిక్రంతో ఎన్నో బ్లాక్బస్టర్ చిత్రాలను తెరకెక్కించిన హారిక అండ్ హాసిని క్రియేషన్ బ్యానర్ పైన ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం అక్టోబర్ రెండవ తేదీ 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయబోతున్నారు. మరి ఈసారి వెంకటేష్ తన సినిమాతో ఫ్యామిలీ ఆడియన్స్ ని ఎలా ఆకట్టుకుంటారు ఏ విధంగా కలెక్షన్స్ రాబడతారు అనే విషయం తెలియాల్సి ఉంది.

- Advertisement -
Advertisement

also read:Vishnu Vishal:సోషల్ మీడియాకెక్కిన కోలీవుడ్ స్టార్స్ రచ్చ..పోస్ట్ వైరల్..!

వరుస అప్డేట్లతో సినిమాపై భారీ హైప్..

ఇప్పటికే వరుస అప్డేట్లతో బిజీగా ఉన్న ఆదర్శ కుటుంబంపై ఇప్పుడు మరొకసారి టీజర్ తో సినిమా పైన అంచనాలను పెంచేసింది. వెంకటేష్ తన కామెడీ టైమింగ్ తో సహజమైన నటనతో కుటుంబ బంధాలు, సంభాషణ వినోదం , బావోద్వేగాలకు ప్రాధాన్యత ఇచ్చినట్లు కనిపిస్తోంది. అలాగే వెంకటేష్ జనవరి 12వ తేదీన విడుదల అనే చిత్రంతో 2027 సంక్రాంతి కానుకగా హీరో కళ్యాణ్ రామ్ తో కలిసి రాబోతున్నారు. ప్రస్తుతం వరుస సినిమాలతో ఉన్న వెంకటేష్ వరుసగా ఫ్యామిలీ ఆడియన్స్ ని అలరిస్తున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించి టీజర్ అయితే వైరల్ గా మారింది..

- Advertisement -
Advertisement

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you