Irumudi OTT: ఇరుముడి.. ఇరుముడి.. ఇరుముడి.. ఇప్పుడు ఎక్కడ చూసినా సరే ఈ సినిమా పేరు ఎక్కువగా వినిపిస్తుంది. మాస్ మహారాజా రవితేజ హీరోగా, టాలెంటెడ్ డైరెక్టర్ శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ఇరుముడి. ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ అయ్యి ఎంత పెద్ద సూపర్ డూపర్ హిట్ అయిందో అందరికీ తెలిసిందే. విడుదలైనప్పటి నుంచి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన అందుకుంటూ వస్తుంది. బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర సృష్టిస్తుంది. ఇప్పటివరకు నెలకొల్పిన క్రేజీ రికార్డ్స్ అన్నింటినీ కూడా ఈ సినిమా తుక్కుతుక్కు చేసి పడేసింది.
నాలుగో వారంలోనూ కొనసాగుతున్న జోరు :
ఈ చిత్రం ప్రస్తుతం విజయవంతంగా నాలుగో వారంలోకి అడుగుపెట్టింది. విడుదలైనప్పటి నుంచి ప్రేక్షకుల నుంచి మంచి స్పందనను అందుకుంటూ, బాక్సాఫీస్ వద్ద తన జోరును కొనసాగిస్తోంది. నాలుగో వారంలోనూ సినిమాకు వస్తున్న ఆదరణ మేకర్స్‌లో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది. థియేటర్లలో ప్రేక్షకులను అలరించిన ఈ సినిమా ఇప్పుడు డిజిటల్ ప్రేక్షకులను కూడా మెప్పించేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే ఓటీటీ స్ట్రీమింగ్కు సంబంధించిన ఏర్పాట్లను మేకర్స్ పూర్తి చేసినట్లు తెలుస్తోంది. థియేట్రికల్ రన్ కొనసాగుతున్న సమయంలోనే డిజిటల్ స్ట్రీమింగ్పై ఆసక్తి పెరగడం విశేషంగా మారింది.
సెప్టెంబర్ 18 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ :
సెప్టెంబర్ 18, 2026 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ఈ సినిమా స్ట్రీమింగ్ కాబోతుంది. పలు భాషల్లో ఈ సినిమాను అందుబాటులోకి తీసుకురానున్నట్లు సమాచారం అందుతుంది. నెట్‌ఫ్లిక్స్ యాప్‌లో ఈ సినిమా విడుదలకు సంబంధించిన వివరాలు కనిపించడంతో, ఓటీటీ రిలీజ్‌పై స్పష్టత వచ్చేసినట్లైంది.
రవితేజ పర్ఫామెన్స్.. బేబీ నక్షత్ర పాత్ర హైలెట్ :
ఈ సినిమాలో రవితేజ పర్ఫామెన్స్ వేరే లెవెల్. ఇక బేబీ నక్షత్ర పాత్ర హైలెట్‌గా మారింది. సినిమా మొత్తం కూడా తండ్రి కూతురు సెంటిమెంట్‌తో తెరకెక్కడంతో ఈ సినిమాకు బాగా ఎమోషనల్‌గా కనెక్ట్ అయిపోయారు జనాలు.మరీ ముఖ్యంగా సినిమాలోని ‘మల్లెపూల పల్లకి’ పాట అయ్యప్ప స్వామి భక్తులకు పూనకాలు తెప్పించినట్లైంది .. ఒకటి కాదు, రెండు కాదు.. సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అభిమానులను చక్కగా ఆకట్టుకుంది. ఫ్యామిలీ ఆడియన్స్‌ను థియేటర్‌కు రప్పించేలా చేసింది.
ALSO READ: వెంకటేష్ ఆదర్శ కుటుంబం టీజర్ రిలీజ్..!
రూ.200 కోట్లకు పైగా వసూళ్లు :
థియేటర్లలో ఇరుముడి(Irumudi OTT) ఇప్పటికే రూ.200 కోట్లకు పైగా ప్రపంచవ్యాప్తంగా వసూళ్లు సాధించేసింది. ఈ స్థాయి విజయాన్ని అందుకున్న తర్వాత డిజిటల్ విడుదలకు సిద్ధమవుతూ ఉండటంతో ఓటీటీ ప్రేక్షకుల్లో కూడా ఈ సినిమాపై ఆసక్తి పెరిగిపోయింది. థియేటర్లలో సినిమా చూడలేకపోయిన వారు, అలాగే ఇంకొన్నిసార్లు సినిమా చూడాలి అనుకునే వాళ్లకు ఓటీటీ మంచి ఆప్షన్‌గా నిలిచింది. సెప్టెంబర్ 18న ఈ సినిమా స్ట్రీమింగ్ కాబోతూ ఉండటంతో అభిమానులు ఇంట్రెస్టింగ్గా ఈ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు. గత కొంతకాలంగా హిట్లు లేక అల్లాడిపోయిన రవితేజకు ఒకేసారి భారీ హిట్ రావడంతో ఫ్యాన్స్ కూడా ఫుల్ ఖుషి అవుతున్నారు.




