Prithviraj Sukumaran:మహేష్ బాబు, డైరెక్టర్ రాజమౌళి కాంబినేషన్లో రాబోతున్న మోస్ట్ అవైటెడ్ చిత్రం వారణాసి. ఈ సినిమా పైన రోజు రోజుకి అంచనాలు కూడా పెరుగుతున్నాయి. భారీ బడ్జెట్ సినిమా కావడం చేత ఈ సినిమా షూటింగ్ విషయంలో రాజమౌళి ఎన్నో కఠిన నిర్ణయాలు తీసుకొని మరీ సినిమా షూటింగ్ చేయిస్తున్నప్పటికీ.. ఎక్కడో ఒకచోట లీక్ అవుతూనే ఉన్నాయి. అభిమానులు సైతం నిరుత్సాహపడుతున్నారు. ఈ సినిమాలోని కీలకమైన పాత్రలు మలయాళ స్టార్ హీరో పృధ్విరాజ్(Prithviraj Sukumaran) సుకుమారన్ నటిస్తున్నారు. హీరోయిన్గా ప్రియాంక చోప్రా నటిస్తోంది.
వారణాసి స్టోరీ లీక్ చేసిన పృథ్వీరాజ్..
వారణాసి సినిమా టైమ్ ట్రావెల్ కథ అంటూ గత కొద్దిరోజులుగా వినిపిస్తున్నా.. తాజాగా ఈ విషయం పైన పృథ్వీరాజ్ మాట్లాడుతూ.. వారణాసి సినిమా టైం ట్రావెల్ స్టోరీ కాదు అని, అంతకు మించిన స్థాయిలో కథ ఉంటుందని చాలా డిఫరెంట్ టైమ్ ట్రావెల్స్ మధ్య ఈ సినిమా కథ సాగుతుందంటూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. డైరెక్టర్ రాజమౌళి, మహేష్ బాబు, ప్రియాంక చోప్రా వంటి వారితో పని చేయడం చాలా ఆనందంగా ఉందంటూ పేర్కొన్నారు.
ALSO READ:Vijay Varma: తమన్నా మాజీ బాయ్ ఫ్రెండ్ పై నటి సంచలన కామెంట్స్..!
వారణాసి పై భారీ బజ్..
ముఖ్యంగా మహేష్ బాబు, పృథ్వీరాజ్, ప్రియాంక చోప్రా మధ్య వచ్చే సీన్స్ ఎలా ఉంటాయో చూడడానికి అభిమానులు కూడా చాలా ఎక్సైటింగ్ గా ఎదురుచూస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను టార్గెట్ చేసుకొని, ఇతర దేశాలలో కూడా పలు భాషలలో ఈ చిత్రాన్ని విడుదల చేసేలా రాజమౌళి ప్లాన్ చేశారు. అంతేకాకుండా ప్రమోషన్స్ ను కూడా తనదైన శైలిలో రాజమౌళి భారీగానే ప్లాన్ చేస్తున్నట్లు వినిపిస్తోంది. 2027 ఏప్రిల్ 7వ తేదీన వారణాసి సినిమా విడుదల చేయబోతున్నారు. సినిమా విడుదలకు ముందే ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో బజ్ క్రియేట్ అయ్యేలా చూసుకుంటున్నారు రాజమౌళి. వారణాసి సినిమా సింగిల్ పార్ట్ గానే తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది.
ALSO READ:Pawan–Mahesh:అజిత్-విజయ్ లాగా.. మహేష్-పవన్ చేయలేరా..? ఎందుకు..?
ఆ రేంజ్ గుర్తింపు కోసమే తపన..
ఈ సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీ రేంజ్ మరొకసారి ప్రపంచవ్యాప్తంగా పేరు వినిపించేలా చేస్తుందని అభిమానులు కూడా భావిస్తున్నారు. మహేష్ బాబు కెరియర్ లోనే ఈ సినిమా బెస్ట్ గా నిలిచిపోతుందంటూ టైటిల్ గ్లింప్స్ రిలీజ్ రోజున మహేష్ బాబు స్వయంగా చెప్పడంతో అభిమానులు తెగ ఆనందపడ్డారు. మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా సినిమా నుంచి అదిరిపోయే పోస్టర్ విడుదల చేయగా మరింత ఆకట్టుకుంది. వారణాసి సినిమా నుంచి మరిన్ని అప్డేట్ల కోసం అభిమానులు కూడా చాలా ఎక్సైటింగ్ గానే ఎదురు చూస్తున్నారు. మరి అభిమానుల కోరిక మేరకు రాజమౌళి ఏదైనా అప్డేట్ ప్రకటిస్తారేమో చూడాలి. మహేష్ బాబు సినిమాల విషయానికి వస్తే చివరిగా గుంటూరు కారం చిత్రంలో నటించారు. ఈ సినిమా మిక్స్డ్ టాక్స్ సంపాదించుకున్నప్పటికీ కలెక్షన్స్ పరంగా పరవాలేదు అనిపించుకుంది.




