Chiranjeevi:మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ వశిష్ట దర్శకత్వంలో రాబోతున్న మోస్ట్ వాంటెడ్ సోసియో ఫాంటసీ చిత్రం విశ్వంభర. ఈ చిత్రంలో హీరోయిన్గా త్రిష నటిస్తోంది. అలాగే కీలకమైన పాత్రలో చాలామంది టాలీవుడ్ హీరోయిన్స్ కూడా నటిస్తున్నారు. విశ్వంభర సినిమా నుంచి విడుదలైన ప్రతి అప్డేట్ కూడా సినిమా పైన అంచనాలు పెంచేసినప్పటికీ.. సినిమా టీజర్ విడుదల చేయగా ట్రోల్స్ ఎదురయ్యాయి. వాస్తవంగా ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తి చేసుకున్నప్పటికీ గ్రాఫిక్స్ పనుల వల్ల ఆలస్యం అవుతోందని వినిపిస్తోంది. అంతేకాకుండా ఓటీటి బిజినెస్ కూడా కాస్త లేటుగా అవ్వడం చేత విడుదల పైన కొంత సందిగ్ధత నెలకొన్నట్లు వినిపిస్తున్నాయి.
ఓటిటి డీల్ క్లియర్?
చిరంజీవి(Chiranjeevi) కూడా తన తదుపరి సినిమాల పైన ఎక్కువగా ఫోకస్ చేయడంతో విశ్వంభర సినిమా రిలీజ్ కు ఇలా ఎన్నో అడ్డంకులు కనిపిస్తున్నాయి. తాజాగా ఈ సినిమాకి సంబంధించి ఓటిటి బిజినెస్ క్లియర్ అవడంతో రిలీజ్ లైన్ కూడా క్లియర్ అయినట్లుగా టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అందుతున్న సమాచారం ప్రకారం విశ్వంభరా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటి సంస్థలలో ఒకటైన సోనీ లీవ్ పోటీపడి చివరికి అమెజాన్ ప్రైమ్ భారీ ధరకు దక్కించుకున్నట్లు వినిపిస్తున్నాయి.
also read:Samantha: ఘనంగా సమంత సీమంతపు వేడుక.. ఫోటోలు వైరల్!
విడుదలకు సిద్ధమవుతున్న విశ్వంభర..
దీంతో థియేట్రికల్ రిలీజ్ కి ఉన్న అడ్డంకులు అన్నీ కూడా పూర్తిగా తొలగిపోయినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే విశ్వంభర చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. అన్నీ అనుకున్నట్లు జరిగితే త్వరలోనే ఇందుకు సంబంధించి అధికారికంగా ప్రకటన కూడా వెలుపడే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. యువి క్రియేషన్ బ్యానర్ పైన భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. విశ్వంభర సినిమా సంక్రాంతి బరిలో వస్తే మాత్రం డైరెక్టర్ బాబి దర్శకత్వంలో వస్తున్న కాకా సినిమా పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
also read:Prithviraj Sukumaran:వారణాసి సినిమాపై పృథ్వీ రాజ్ కామెంట్స్..!
చిరంజీవి సినిమాలు.
ఈ ఏడాది చిరంజీవి మన శంకర వరప్రసాద్ గారు సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నారు. ఈ సినిమాతో ఏకంగా 300 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి సరికొత్త రికార్డును సృష్టించారు. కథల ఎంపిక విషయంలో కూడా చిరంజీవి ఆచితూచి అడుగులు వేస్తూ మరీ ముందుకు వెళ్తున్నారు. డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెలతో కూడా ఒక సినిమా చేయబోతున్నారు చిరంజీవి. చిరంజీవి ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ లో మాస్ యాక్షన్ సీన్స్ ఉండేలా తన కథలలో చూసుకుంటున్నారు.. మరి రాబోయే సినిమాలు ఎలా ఉంటాయో చూడాలి మరి.




