Immortal Trailer: సంగీత దర్శకుడుగా, నటుడిగా పేరు సంపాదించిన జీవి ప్రకాష్ కుమార్.. తెలుగు, తమిళ ప్రేక్షకులకు బాగా సుపరిచితమే. ఎన్నో చిత్రాలకు సంగీతమందించడమే కాకుండా హీరోగా తన చిత్రాలతో ప్రేక్షకులను బాగా అలరించారు. ఇప్పుడు తాజాగా జీవి ప్రకాష్ నటిస్తున్న చిత్రం ఇమ్మోర్టల్ (Immortal Trailer) . తాజాగా ఈ చిత్రానికి సంబంధించి తెలుగు ట్రైలర్ ని కూడా మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ చిత్రాన్ని మారియప్పన్ చిన్న దర్శకత్వం వహించారు. కయాదు లోహర్ ఇందులో హీరోయిన్ గా నటిస్తోంది. తమిళంలో ఈ సినిమా విడుదల అయి.. భారీ విజయాన్ని అందుకోవడంతో తెలుగులో సెప్టెంబర్ 19న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయబోతున్నారు
ఇమ్మోర్టల్ తెలుగు ట్రైలర్ రిలీజ్..
తాజాగా ఈ సినిమా ట్రైలర్ ని విడుదల చేశారు . ట్రైలర్ చాలా ఉత్కంఠ భరితంగా సాగేలా కనిపిస్తోంది ముఖ్యంగా ఇందులో కయాదు లోహార్ గ్లామర్ కూడా హైలెట్గా నిలుస్తోంది. జీవి ప్రకాష్ యాక్టింగ్ కూడా మరింత ఆకట్టుకునేలా కనిపిస్తోంది. వీరిద్దరి మధ్య లవ్ స్టోరీ కూడా మరింత కొత్తగా కనిపిస్తోంది. ఈ సినిమాలో చాలా ట్విస్టులతో కూడిన సీన్స్ ఉన్నట్లు కనిపిస్తోంది. ఈ చిత్రంలో కథాంశం మరణం లేని ఒక రహస్య వ్యక్తి చుట్టూ తిరిగేలా చూపించారు. ముఖ్యంగా విజువల్స్ కూడా మరింత ఆకట్టుకునేలా కనిపిస్తున్నాయి. మరి ఈ సినిమా పైన కూడా భారీగానే అంచనాలు పెంచేసినట్టు కనిపిస్తోంది.
also read:Tollywood:పూజ చేస్తూ డేటింగ్ పై హింట్ ఇచ్చిన టాలీవుడ్ జంట..!
జీవి ప్రకాష్ కుమార్ కెరియర్..
జీవి ప్రకాష్ ఈ ఏడాది ఇరుముడి సినిమాకు అందించిన మ్యూజిక్ కూడా అద్భుతంగా ఆకట్టుకుంది. అలాగే తమిళంలో వచ్చిన విశ్వనాథ్ అండ్ సన్స్ సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంది. ఇలా ఒకవైపు సినిమాలకు మ్యూజిక్ అందించడమే కాకుండా మరొకవైపు హీరోగా కూడా అదరగొట్టేస్తున్నారు. ప్రముఖ సింగర్ సైంధవిని 2013లో వివాహం చేసుకున్న జీవీ ప్రకాష్ దంపతులకు 2020లో ఒక కుమార్తె జన్మించింది . అనంతరం మే 13, 2024 న సైంధవి, ప్రకాష్ విడాకులు తీసుకోబోతున్నట్లు ప్రకటించారు.
also read:Chiyaan Vikram:విక్రమ్ కొత్త సినిమా టైటిల్ ఇదే.. ‘అపరిచితుడు’ను మించిన ట్విస్ట్!
కయాదు లోహర్ సినీ కెరియర్..
కయాదులోహర్ సినీ కెరియర్ విషయానికి వస్తే.. 2021లో మొగిలిపేట అనే కన్నడ సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత 2022లో వచ్చిన అల్లూరి అనే చిత్రంలో తెలుగులో కూడా నటించింది. ఆ సినిమాతో పెద్దగా క్రేజ్ రాకపోవడంతో కాస్త గ్యాప్ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ 2025లో తమిళ్ లో విడుదలైన డ్రాగన్ సినిమాతో భారీ విజయాన్ని అందుకుంది. దీంతో తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా దగ్గరయింది. ఆ తర్వాత ఫంకీ సినిమాలో హీరోయిన్గా నటించిన ఈమె.. ప్రస్తుతం నాని నటిస్తున్న ది ప్యారడైజ్ చిత్రంలో కూడా హీరోయిన్గా నటిస్తోంది. అలాగే సూర్య 48వ చిత్రం తో పాటుగా మరో మలయాళ చిత్రంతో పాటు తమిళ సినిమాలో కూడా హీరోయిన్గా నటిస్తోంది.




