Wednesday, September 16, 2026
HomeLATESTPrerana kambam:తల్లి కాబోతున్న బుల్లితెర నటి..!

Prerana kambam:తల్లి కాబోతున్న బుల్లితెర నటి..!

Prerana kambam: ప్రేరణ తల్లి కాబోతున్న విషయాన్ని అభిమానులతో పంచుకుంది. ఈ మేరకు షేర్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

on
- Advertisement -banner Ad

Prerana kambam:ఇటీవల చాలామంది సెలబ్రిటీలు వినాయక చవితి సందర్భంగా చాలామంది తమ ఇళ్లల్లో జరిగిన పండుగ ఫోటోలను, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉన్నారు.. అయితే ఇదే శుభముహూర్తాన బిగ్ బాస్ తెలుగు ఫేమ్ ప్రేరణ తాను తల్లి కాబోతున్నాననే విషయాన్ని అభిమానులతో పంచుకుంది. ఈ సందర్భంగా తన భర్తతో కలిసి బేబీ బంప్ ఫోటోలు, వీడియోను షేర్ చేయడంతో అవి కాస్తా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.. ఈ వీడియో చూసిన పలువురు అభిమానులు , నెటిజన్స్ సైతం ఇంస్టాగ్రామ్ లో ఈ జంటకు అభినందనలు తెలుపుతున్నారు.

తల్లి కాబోతున్న ప్రేరణ..

కన్నడ సినీ పరిశ్రమకు చెందిన ప్రేరణకి(Prerana kambam), పాన్ ఇండియా హీరోయిన్ రష్మిక మధ్య మంచి స్నేహ బంధం ఉంది.. వీరిద్దరూ నటిగా ఎంట్రీ ఇచ్చే సమయం నుంచి మంచి స్నేహితులు.. ఆ తర్వాత కాలంలో రష్మిక నేషనల్ క్రష్ గా పేరు సంపాదించగా.. ప్రేరణ సీరియల్ హీరోయిన్ గా మంచి పాపులారిటీ సంపాదించుకుంది. కృష్ణ ముకుంద మురారి అనే సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన ప్రేరణ.. ఆ తర్వాత బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో కంటెస్టెంట్ గా పాల్గొనింది. విజేతగా నిలవలేకపోయినప్పటికీ గ్రాండ్ ఫినాలే వరకు వచ్చి టాప్ 4 లో ఒకరిగా నిలిచింది.

- Advertisement -
Advertisement

ALSO READ:Ravi Teja:రవితేజకి షాక్ ఇచ్చిన సమంత.. ఈ ట్విస్ట్ అసలు ఊహించలేదుగా..!

శుభాకాంక్షలు చెబుతున్న సెలబ్రిటీలు..

ఆ తర్వాత కొద్ది రోజులకి తన భర్త శ్రీపాద్ తో కలిసి ఇస్మార్ట్ జోడి 3 రియాలిటీ షోలో పాల్గొని అక్కడ విజేతగా నిలవడం గమనార్హం. 2023 నవంబర్లో వీరు వివాహం చేసుకోగా మూడు సంవత్సరాల తర్వాత ఇప్పుడు శుభవార్త చెప్పారు. ఇందుకు సంబంధించి బేబీ బంప్ వీడియోని కూడా అభిమానులతో పంచుకున్నారు ఈ జంట. దీన్ని చూసిన బుల్లితెర సెలబ్రిటీ యష్మీ గౌడ, రోహిణి తదితర సెలబ్రిటీల సైతం ఈ జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు.

- Advertisement -
Advertisement

ALSO READ:Bigg Boss 10: ముఖేష్–దేబ్జానీ మధ్య క్యూట్ కెమిస్ట్రీ.. వర్షిణితో కొత్త ట్విస్ట్!

ప్రేరణ కెరియర్..

ప్రేరణ విషయానికి వస్తే ..ఈమె బెంగళూరులోని దయానంద సాగర్ కాలేజీలో బీటెక్ పూర్తి చేసింది. అంతేకాకుండా ఈమె స్పోర్ట్స్ లో కూడా సత్తా చాటినట్లు తెలుస్తోంది. కాలేజీలో ఉన్న సమయంలోనే మోడలింగ్ వైపుగా అడుగుపెట్టి.. కన్నడ సీరియల్స్ లో కూడా నటించి తన కెరీర్ ని మొదలు పెట్టింది. ఆ తర్వాత కన్నడలో పలు చిత్రాలలో కూడా నటించింది. అనంతరం తెలుగు ప్రేక్షకులకు కృష్ణ ముకుందా మురారి అనే సీరియల్ ద్వారా తన అద్భుతమైన నటనతో అందరిని ఆకట్టుకుంది.

- Advertisement -
Advertisement

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you