Yash Toxic OTT:కన్నడ సినీ ఇండస్ట్రీలోనే అతి తక్కువ సమయంలో స్టార్ హీరోగా పేరు సంపాదించిన యశ్. తెలుగు ప్రేక్షకులకు కేజిఎఫ్, కే జి ఎఫ్ 2 చిత్రాలతో భారీ పాపులారిటీ సంపాదించుకున్నారు. ఈ సినిమాల తర్వాత మళ్లీ అదే అంచనాలతో ప్రేక్షకులను అలరించడానికి వచ్చిన చిత్రం టాక్సిక్. ఈ చిత్రానికి నేషనల్ అవార్డు విన్నర్ గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహించారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా గ్యాంగ్ స్టార్ యాక్షన్ డ్రామా చిత్రంగా ఈ సినిమాని విడుదల చేశారు. ఇందులో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్గా నటించింది.
ఓటీటీ లోకి రాబోతున్న యశ్ టాక్సిక్..
అంతేకాకుండా మరో స్టార్ హీరోయిన్ నయనతార, రుక్మిణి వసంత్, తారా సుతారియా, హూమా ఖురేషి లాంటి హీరోయిన్స్ కీలకమైన పాత్రలో నటించారు. కెవిఎన్ బ్యానర్ పైన ఈ చిత్రాన్ని నిర్మించారు. భారీ బడ్జెట్ తో ఆగస్టు 26న థియేటర్లోకి వచ్చిన ఈ సినిమా మొదటి షో తోనే నెగిటివ్ టాక్ ని మూట కట్టుకుంది. దీంతో ఈ సినిమా కలెక్షన్స్ పైన భారీగా ఎఫెక్ట్ పడిందని చెప్పవచ్చు. సుమారుగా ఈ సినిమా 300 కోట్లకు పైగా భారీ నష్టాలను మిగిల్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని ఎదురు చూస్తున్న అభిమానులు కూడా చాలామంది ఉన్నారు.
ALSO READ:Ibomma Ravi:ఐబొమ్మ రవి కేసులో బిగ్ ట్విస్ట్..!
స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
అలాంటి అభిమానులకు తాజాగా ఈ సినిమా డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటి సంస్థలలో ఒకటైన జి5 సంస్థ దక్కించుకుంది. కన్నడ, తెలుగు, తమిళ్, మలయాళం వంటి భాషలలో సెప్టెంబర్ 25న(Yash Toxic OTT)ఈ సినిమా స్ట్రిమింగ్ కి రాబోతున్నట్లు తెలుస్తోంది. అయితే హిందీ వర్షన్ కు సంబంధించి మాత్రం అక్టోబర్ 23 నుంచి ఓటీటీలోకి అందుబాటులోకి రాబోతున్నట్లు సమాచారం. మరి యశ్ నటించిన ఈ గ్యాంగ్ స్టార్ యాక్షన్ డ్రామా చిత్రం థియేటర్లలో ఫ్లాప్ గా నిలిచింది మరి ఓటీటిలో ఎలాంటి రికార్డులను సృష్టిస్తుందో చూడాలి మరి.
ALSO READ:Prerana kambam:తల్లి కాబోతున్న బుల్లితెర నటి..!
యశ్ తదుపరి చిత్రాలు..
యశ్ తదుపరి సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం బాలీవుడ్ లో భారీ బడ్జెట్ తో రాబోతున్న రామాయణ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా దీపావళి కానుకగా ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. వచ్చే ఏడాది రామాయణ 2 చిత్రాన్ని తీసుకువచ్చేలా చిత్ర బృందం ప్లాన్ చేస్తోంది. అలాగే డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కేజిఎఫ్ 3 సినిమాలో కూడా నటించే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు వినిపిస్తున్నాయి. టాక్సిక్ సినిమాతో డిజాస్టర్ అందుకున్న యశ్ మరి రామాయణ చిత్రంతో ఎలాంటి విజయాన్ని అందుకుంటారో చూడాలి. ప్రస్తుతం టాక్సిక్ సినిమా ఓటీటికీ సంబంధించిన న్యూస్ మాత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.




