Actress Ambika:తమిళ నటుడు, టీవీకే పార్టీ అధినేత సీఎం విజయ్, ప్రముఖ స్టార్ హీరోయిన్ త్రిష నిరంతరం ఏదో ఒక విషయంలో వార్తలను నిలుస్తూ ఉన్నారు. యూకే లోన్ సిల్వర్ స్టోన్ లో జరిగిన అజిత్ కుమార్ లెమాన్స్ కప్ రేస్ లో వీరిద్దరూ కలిసి కనిపించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే గత కొంతకాలంగా పలు రకాల విమర్శలు వినిపించినప్పటికీ ఇప్పుడు తాజాగా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్న వీడియో వల్ల త్రిష విజయ్ మధ్య ఉన్న రూమర్స్ నిజమే అనేటట్టుగా కనిపిస్తున్నాయి.
త్రిష – విజయ్ రిలేషన్ పై అంబికా కామెంట్..
రేసింగ్ ఈవెంట్ ను విజయ్ గ్యాలరీ నుంచి వీక్షిస్తూ ఉండగా సడన్గా త్రిష మధ్యలో కనిపించారు. అయితే విజయ్ వెంటనే తన ముఖం వీడియోల పడకుండా పక్కకు తప్పుకోవడం వీడియోలో చూడవచ్చు .కానీ అది వర్క్ అవుట్ కాలేదు. వీరిద్దరూ కలిసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో విజయ్ త్రిష మధ్య ఉన్న స్నేహం గురించి చర్చనీయాంశంగా మారిందని చెప్పవచ్చు. అయితే ఈ విషయం పైన ప్రముఖ నటి అంబికా (Actress Ambika)స్పందిస్తూ ఒక ఇంటర్వ్యూల ఆమె మాట్లాడుతూ త్రిష స్థానంలో తాను ఉంటే అలా కెమెరాలు ముందుకు వచ్చేదాన్ని కాదు అంటూ తెలిపారు.
ALSO READ:Yash Toxic OTT: ఓటీటిలోకి వస్తున్న టాక్సిక్ .. ఎప్పుడంటే..?
త్రిష స్ధానంలో నేనుంటే అలా చేయను..
ఒక గొప్ప వ్యక్తి స్థానంలో కి వెళ్లినంత మాత్రాన పాత స్నేహాలను ఎవరు వదులుకోవాల్సిన అవసరం లేదు.. కానీ మనం ఆలోచించినంత ఉన్నంతగా బయట వ్యక్తులు ఎవరు ఉండరు. మన ప్రవర్తన వల్ల మన స్నేహితుల పైన విమర్శలు కూడా వస్తాయని తెలిసినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి.. ఒకవేళ నేనే త్రిష స్థానంలో ఉంటే నా వల్ల అనవసరమైన నెగిటివ్ వస్తుందని తెలిస్తే ఖచ్చితంగా బహిరంగ కార్యక్రమాలకు వెళ్లే దాన్ని కాదు అంటూ.. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే అంటూ తెలిపింది నటి అంబిక.
ఇద్దరు వ్యక్తులు మంచి స్నేహితులుగా ఉన్నప్పుడు అందులో ఒకరు ఉన్నత పదవిలో ఉంటే ఆ స్నేహాన్ని వేరే విధంగా ఎవరూ చూడకూడదు అంటూ అంబిక తెలిపింది.
ALSO READ:Ibomma Ravi:ఐబొమ్మ రవి కేసులో బిగ్ ట్విస్ట్..!
అంబిక కెరియర్..
అంబిక సినీ కెరియర్ విషయానికి వస్తే .. కన్నడ , తెలుగు, మలయాళం వంటి చిత్రాలలో నటించి మెప్పించింది. తెలుగులో ఎన్టీఆర్ ,కృష్ణంరాజు, ఏఎన్ఆర్ వంటి నటులతో కూడా నటించారు. అలా అన్ని భాషలలో కలుపుకొని సుమారుగా 300 కు పైగా చిత్రాలలో నటించింది అంబిక. అంబిక వెండితెర పైనే కాదు బుల్లితెర పైన కూడా తన నటనతో మెప్పించారు. 1998లో అమెరికాకు చెందిన డాక్టర్ను వివాహం చేసుకొని విదేశాలకు వెళ్ళిపోయినట్లు తెలుస్తోంది. వీరికి ఇద్దరు కుమారులు. అంబికా తన భర్తకు మధ్య మనస్పర్ధలు రావడంతో 1996లో విడాకులు తీసుకుని విదేశాల నుంచి ఇండియాకి తిరిగి వచ్చేసింది.




