Sri Devi: సౌత్ ఇండస్ట్రీలో దివంగత నటీమణి శ్రీదేవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన అందం, అభినయంతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న శ్రీదేవి ఎంతోమంది స్టార్ హీరోలతో నటించింది. శ్రీదేవి భర్త బోణీ కపూర్ .. వీరికి ఇద్దరు కుమార్తెలు కలరు. జాన్వీ కపూర్ , ఖుషీ కపూర్. గత కొంతకాలంగా శ్రీదేవి ఆస్తికి సంబంధించి ఏదో ఒక విషయం వైరల్ గా మారింది. తాజాగా చెన్నైలోని శ్రీదేవి ఆస్తికి సంబంధించిన వివాదం ఇప్పుడు మరొకసారి తెరమీదికి వచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఈ ఇష్యూ ఇప్పుడు సుప్రీంకోర్టు వరకు చేరినట్లు తెలుస్తోంది.
శ్రీదేవి కుటుంబానికి సుప్రీంకోర్టు నోటీసులు..
చెన్నై ఈస్ట్ కోస్ట్ రోడ్డులో ఉన్న స్థలం పైన దాఖలైన ఈ పిటిషన్ విచారించిన న్యాయస్థానం తదుపరి విచారణ వరకు అక్కడే స్టేటస్ కొనసాగించాలంటూ ఆదేశాలను జారీ చేసింది. ఆస్తి వివాదాన్ని ఇద్దరూ కూడా సామరస్యంగా పరిష్కరించుకోవాలంటూ సూచించింది. 1988లో దివంగత నటి శ్రీదేవి కుటుంబానికి 2.7 ఎకరాల భూమిని విక్రయించారు. అందులో వాటా కోరుతూ ఒక మహిళ ఆమె సోదరుడు దాఖలు చేసిన పిటిషన్ పైన సుప్రీంకోర్టు నోటీసులను జారీ చేసింది. శ్రీదేవి భర్త, పిల్లలు పైన ఆమె దాఖలు చేసిన ధావన్ మద్రాస్ హైకోర్టు కొట్టివేస్తూ ఉత్తర్వులను జారీ చేయగా.. ఆ మహిళ సవాల్ చేసింది. దీంతో తదుపరి విచారణ జరిగే వరకు వివాదాస్పదమైన ఆస్తి పైన యధాతధ స్థితిని కొనసాగించాలంటూ జస్టిస్ కె వి విశ్వనాథ ఆదేశాలను జారీ చేశారు.
also read: Dada Saheb falke award:కేజిఎఫ్ నటుడికి దాదా సాహెబ్ పాల్కే అవార్డు..!
అసలేం జరిగిందంటే?
అసలు విషయంలోకి వెళ్తే.. 1998 లో చెన్నై ఈస్ట్ కోస్ట్ రోడ్డులో సుమారుగా 4.77 ఎకరాల స్థలాన్ని ముదలియార్ అనే వ్యక్తి కుటుంబం నుంచి హీరోయిన్ శ్రీదేవి కొనుగోలు చేశారు.. దశాబ్దాలుగా ఇది శ్రీదేవి కుటుంబం ఆధీనంలోనే ఉన్నది. శ్రీదేవి మరణాంతరం 2023లో ఆస్తి మార్పిడి కోసం దరఖాస్తు చేసుకోగా.. ముదలియార్ రెండవ భార్య పిల్లలైన శివగామి, ఆమె సోదరుడు ఆస్తిలో తమకు వాటా ఉందంటూ చంగల్పట్టు కోర్టులో సివిల్ కేస్ నమోదు చేశారు. అయితే ఈ కేసును కొట్టివేయాలంటూ శ్రీదేవి భర్త బోని కపూర్, కుమార్తెల సైతం హైకోర్టుని ఆశ్రయించారు. ముదలియార్ మొదటి భార్య ప్రాణాలతో ఉన్న సమయంలోనే ఆయన రెండో వివాహం చేసుకున్నారు. కాబట్టి రెండో భార్య పిల్లలకు చట్టపరంగా వారసత్వ హక్కులు ఉండవంటూ బోనీకపూర్ తరుపున లాయర్ వాదించారు. దీంతో హైకోర్టు శివగామి వేసిన సివిల్ కేసిన సైతం కొట్టివేసింది. అనంతరం శివగామి సుప్రీంకోర్టుని ఆశ్రయించగా ఇప్పుడు ఈ కేసులో బోనీ కపూర్ కుటుంబానికి నోటీసులను పంపించింది.
also read; Nani The Paradise:ది ప్యారడైజ్ సినిమా సెన్సార్ రివ్యూ..!
క్లారిటీ వస్తుందా?
ఈ వివాదాన్ని సామరస్యంగా పరిష్కరించుకునేందుకే అవకాశాలను అన్వేషించాలంటూ సుప్రీంకోర్టు ఇరువురి పక్షాలను కోరింది. దీంతో ఇప్పుడు డిసెంబర్ 18వ తేదీకి వాయిదా వేసినట్లు తెలుస్తోంది. మరి ఈ విషయం పైన అప్పుడైనా క్లారిటీ వస్తుందేమో చూడాలి మరి.




