Friday, September 18, 2026
HomeLATESTBIGG BOSS-10:బిగ్‌బాస్ ఝాన్సీపై ట్రోల్స్.. రంగంలోకి దిగిన తల్లి.. నెటిజన్లకు గట్టి వార్నింగ్!

BIGG BOSS-10:బిగ్‌బాస్ ఝాన్సీపై ట్రోల్స్.. రంగంలోకి దిగిన తల్లి.. నెటిజన్లకు గట్టి వార్నింగ్!

BIGG BOSS-10:బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10 కంటెస్టెంట్ జాన్సీపై వస్తున్న ట్రోలింగ్‌పై ఆమె తల్లి స్పందించారు.

on
- Advertisement -banner Ad

BIGG BOSS-10:బిగ్‌బాస్ సీజన్ 10 ఈ మధ్యనే బాగా గ్రాండ్‌గా లాంచ్ చేశారు. హౌస్‌లోకి వెళ్లిన కంటెస్టెంట్స్ తమదైన స్టైల్‌లో ఆట ఆడుతూ, తమ సత్తా చూపిస్తూ టాప్ రేంజ్‌లో ఉండాలని తాపత్రయపడిపోతున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే బిగ్‌బాస్ సీజన్ 10(BIGG BOSS-10) చూస్తున్న ప్రేక్షకులు ఒక కంటెస్టెంట్ గురించి బాగా మాట్లాడుకుంటున్నారు. ఆమె మరెవరో కాదు.. కామనర్ గా హౌస్‌లోకి అడుగుపెట్టిన ఝాన్సీ. ఆమె ఆట తీరు పూర్తిగా మారిపోయింది అన్న టాక్ వినిపిస్తుంది.

బిగ్‌బాస్ అగ్నిపరీక్షతో ఎంట్రీ :

బిగ్‌బాస్ అగ్నిపరీక్ష సీజన్ 2లోకి అడుగుపెట్టిన ఆమె తన టాలెంట్‌తో బిగ్‌బాస్ టికెట్ అందుకొని హౌస్‌లోకి కూడా ఎంట్రీ ఇచ్చింది. అయితే హౌస్‌లోకి వెళ్లిన తర్వాత మాత్రం ఝాన్సీ ఆట తీరు పూర్తిగా ఫేక్‌గా అయిపోయింది అంటున్నారు. ఆమె చాలా సెల్ఫిష్‌గా గేమ్ ఆడుతుంది అంటున్నారు. ఇంకొంచెం స్టెప్ ముందుకేసి, కట్టప్ప కంటే దారుణంగా వెన్నుపోట్లు పొడుస్తుంది అంటూ కూడా ట్రోలింగ్ స్టార్ట్ చేశారు.

- Advertisement -
Advertisement

రైతుబిడ్డ పేరుతో హైడ్రామా అంటూ ట్రోల్స్ :

ఝాన్సీ రైతుబిడ్డ పేరుతో హైడ్రామా నడిపిస్తుంది అంటూ ట్రోలింగ్ చేస్తున్నారు. ఆమెను చూస్తుంటే గతంలో పల్లవి ప్రశాంత్ గుర్తొచ్చినట్లే ఉంది అంటున్నారు నెటిజన్స్. రైతుబిడ్డపై ట్రోల్స్ చేస్తున్నారు.

ALSO READ:Supriya Yarlagadda:అక్కినేని నాగార్జున మేనకోడలికి కీలక పదవి..!

- Advertisement -
Advertisement

ఝాన్సీపై వస్తున్న విమర్శలపై తల్లి స్పందన :

దీనిపై ఝాన్సీ తల్లి తీవ్రంగా స్పందించింది. ఝాన్సీపై వస్తున్న విమర్శలపై ఆమె తల్లి హేమలత ఘాటుగా స్పందించారు. “ఝాన్సీ గురించి ఏం తెలుసని మాట్లాడుతున్నారు? ఝాన్సీ చాలా మంచి అమ్మాయి. ఝాన్సీ బిగ్‌బాస్‌లోకి వెళ్లడం చాలా చాలా హ్యాపీగా ఉంది. నా కూతురు అని చెప్పడం లేదు. ఆమె బాగా ఆడుతుంది.

రెండు తెలుగు రాష్ట్రాల్లో కొన్ని లక్షల మంది నా కూతుర్ని ఆదరిస్తున్నారు, అభిమానిస్తున్నారు. కానీ కొంతమంది మాత్రమే కావాలని టార్గెట్ చేసి విమర్శిస్తున్నారు. తప్పు లేకపోయినా తప్పు చేసినట్లు చిత్రీకరిస్తున్నారు. సరిగ్గా చూడండి.. నా కూతురు ఎంత బాగా గేమ్ ఆడుతుంది అనేది. నిజాయితీగా ఆడుతుంది, కవరింగులు ఇవ్వడం లేదు.

- Advertisement -
Advertisement

ALSO READ:Hero Karthikeya:హీరో కార్తికేయ డైరెక్టర్‌గా ఎంట్రీ.. తొలి సినిమాతోనే భారీ సర్‌ప్రైజ్!

విమర్శించే ముందు ఆలోచించండి :

నా కూతుర్ని విమర్శించేందుకు ఎవరికీ హక్కు లేదు. నా కూతుర్ని విమర్శించే ముందు తన స్థానంలో మీ అక్క లేదా చెల్లెలు ఉంటే ఇలాగే విమర్శలు చేస్తారా? అది గుర్తుంచుకోండి” అంటూ ఘాటుగా జవాబిచ్చింది. “నా కూతుర్ని లక్షలాది మంది అభిమానిస్తున్నారు. వారి ఆశీర్వాదాలతో ఆమె గెలుస్తుంది” అంటూ ధీమా వ్యక్తం చేసింది.

ఝాన్సీ చిన్నప్పటి నుంచి కష్టపడి పనిచేసే తత్వం ఉంది అని హేమలత చెప్పుకొచ్చారు. ఆ కష్టాన్ని నమ్ముకుంటుందని, బిగ్‌బాస్‌లో కూడా ఆ కష్టాన్ని నమ్ముకొని ఈ స్థాయికి వచ్చింది అని తెలిపారు. ప్రస్తుతం ఝాన్సీపై జరుగుతున్న ట్రోలింగ్.. మరోపక్క ఝాన్సీ తల్లి ఇచ్చిన రియాక్షన్‌పై నెటిజన్స్ స్పందిస్తున్నారు. కొంతమంది ఝాన్సీని సపోర్ట్ చేస్తుంటే, మరికొంతమంది “హైడ్రామా రైతుబిడ్డ” అంటూ ట్రోల్ చేస్తున్నారు. చూడాలి మరి.. రానున్న ఎపిసోడ్స్‌లో అయినా ఝాన్సీ తన ఆట తీరు మార్చుకుంటుందేమో…??

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you