OTT:తొలిసారి దర్శకత్వ బాధ్యతలు చేపట్టిన రాజా కరుప్పస్వామి తెరకెక్కించిన చిత్రం ‘మోద రాత్రి’. రిషికాంత్ కథానాయకుడిగా నటించిన ఈ సినిమాలో అనిష్మా కథానాయికగా కనిపించారు. భరత్ శంకర్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మించింది. ఆగస్టు 21న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకుల నుంచి మంచి స్పందనను అందుకుంది.
పెళ్లి తర్వాత జీవితంలో అనూహ్య మలుపులు :
వివాహం అనే బంధం ఒక యువతి, యువకుడి జీవితాలను ఎలా మార్చింది? వారి జీవితాల్లో చోటుచేసుకున్న సంఘటనలు ఎలాంటి పరిస్థితులకు దారితీశాయి? అనే అంశాలను ప్రధానంగా తీసుకుని ఈ కథను తెరకెక్కించారు. సాధారణంగా కనిపించే వివాహ బంధం వెనుక దాగి ఉన్న భావోద్వేగాలు, ప్రేమ, ఆశలు, బాధలను కథలో ఆసక్తికరంగా చూపించినట్లు తెలుస్తోంది.
చిన్న బడ్జెట్‌తో భారీ వసూళ్లు :
సుమారు రూ.3 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ‘మోద రాత్రి’ చిత్రం బాక్సాఫీస్ వద్ద అంచనాలకు మించి స్పందనను అందుకున్నట్లు సమాచారం. ఇప్పటివరకు ఈ సినిమా దాదాపు రూ.10 కోట్ల వరకు వసూళ్లు సాధించినట్లు తెలుస్తోంది. తక్కువ బడ్జెట్‌తో రూపొందిన సినిమాకు ఈ స్థాయి కలెక్షన్లు రావడం విశేషంగా మారింది. దీంతో ‘మోద రాత్రి’ నిర్మాతలకు మంచి లాభాలను అందించిన చిత్రంగా నిలిచినట్లు సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మరోవైపు థియేటర్లలో ప్రతివారం కొత్త సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నప్పటికీ, ‘మోద రాత్రి’పై ప్రేక్షకుల్లో ఆసక్తి కొనసాగుతుండటం గమనార్హం. ముఖ్యంగా సినిమాకు లభిస్తున్న పాజిటివ్ టాక్, ప్రేక్షకుల స్పందన కారణంగానే వసూళ్లు స్థిరంగా కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ చిత్రం మరింతగా కలెక్షన్లు సాధించే అవకాశాలపై ఆసక్తి నెలకొంది.
ALSO READ:Sunday Movies: ఆదివారం టీవీలో సినిమాల జాతర.. ఏ ఛానల్లో ఏ మూవీ అంటే?
నెట్‌ఫ్లిక్స్‌లోనూ మంచి ఆదరణ :
థియేట్రికల్ రన్ అనంతరం సెప్టెంబర్ 18న ప్రముఖ ఓటీటీ(OTT)దిక నెట్‌ఫ్లిక్స్‌లో ‘మోద రాత్రి’ స్ట్రీమింగ్కు వచ్చింది. ఓటీటీలోకి వచ్చిన తర్వాత కూడా ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. ముఖ్యంగా కథలోని భావోద్వేగ అంశాలు, పాత్రల మధ్య సంబంధాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. సినిమా లో నటించిన నటీనటులు నటించలేదు జీవించేశారు అని చెప్పడంలో సందేహం లేదు.
ALSO READ:Ravi Teja:మాస్ మహారాజా షాకింగ్ డిమాండ్.. హసిత్ గోలి సినిమా ఆగిపోయిందా?
రిషికాంత్ పాత్రకు ప్రశంసలు :
ఈ సినిమాలో రిషికాంత్ పోషించిన పాత్రపై ప్రత్యేకంగా చర్చ జరుగుతోంది. ప్రతి అమ్మాయి మనసులో ఉండే కొన్ని ఆశలు, ప్రేమను కోల్పోయి నిస్సహాయ స్థితిలో ఉన్న ఓ యువతికి అండగా నిలిచే వ్యక్తిగా ఆయన పాత్రను చూపించారు. ఈ పాత్రలోని భావోద్వేగాలను రిషికాంత్ చక్కగా పలికించారని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు.
మరోవైపు దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్, నటుడు సింబు తదితరులు కూడా ‘మోద రాత్రి’ చిత్రాన్ని ప్రశంసించారు. థియేటర్లలో మంచి టాక్ తెచ్చుకున్న ఈ సినిమా ప్రస్తుతం ఓటీటీలోనూ ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ముందుకు సాగుతోంది.




