Deepika Padukone:బాలీవుడ్లో స్టార్ కపుల్స్ గా పేరు సంపాదించిన దీపికా పదుకొనే, రణవీర్ సింగ్ దంపతులు 2వసారి తల్లిదండ్రులుగా మారారు. దీపిక రెండో బిడ్డకు శనివారం రోజున జన్మనిచ్చింది. ఈ శుభవార్తను దీపికా రణవీర్ దంపతులు శనివారం మధ్యాహ్నం సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ఈ పోస్ట్ ద్వారా తమ కుటుంబంలోకి రెండవసారి లక్ష్మీదేవి వచ్చిందంటూ తెలిపారు. దీపికా, రణవీర్ సిద్ధి వినాయక దర్శనానికి వెళ్ళగా.. అప్పటినుంచి ఆమె రెండో బిడ్డ రాక గురించి పలు రకాల వదంతులు ఎక్కువగా వినిపించాయి.
మరోసారి పండంటి బిడ్డకు జన్మనిచ్చిన దీపిక..
ఆ తర్వాత ఆడబిడ్డ పుట్టిన వార్త దీపిక (Deepika Padukone)అభిమానులకు తెలియడంతో ఈ విషయాన్ని మరింత వైరల్ గా చేస్తున్నారు. తమ బిడ్డ పాదాలను చూపిస్తూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ ని షేర్ చేశారు. తమ అభిమానులకు, ఆరాధకులకు ధన్యవాదాలు కూడా తెలియజేశారు ఈ జంట.
దీపిక రణవీర్ సింగ్ ప్రేమ , పెళ్లి..
చాలా కాలం పాటు సాగిన ప్రేమాయణం తర్వాత రణవీర్ సింగ్, దీపికా 2018 నవంబర్లో ఇటలీలోని లేక్కోమా లో వీరి వివాహం చేసుకున్నారు. వీరి వివాహ వేడుకలకు సంబంధించి ఇంటర్నెట్లో కూడా చాలా వైరల్ గా మారాయి. ఆ తర్వాత 2024 సెప్టెంబర్ లో దీపిక, రణ వీర్ తమ మొదటి బిడ్డకు జన్మనిచ్చారు ఆ సమయంలో వారి ఇంట్లో కుమార్తె వచ్చిందని , వారి కుమార్తెకు దువా పడుకునే అనే పేరు కూడా పెట్టారు.
also read:Radhika Apte:నగ్నంగా నటించడంపై సంచలన నిర్ణయం తీసుకున్న రాధిక ఆప్టే..!
దీపికా పదుకొనే సినిమాలు..
ఇప్పుడు తాజాగా రెండవ కుమార్తె రావడంతో రణవీర్ దీపికా కుటుంబంలో ఆనంద వెల్లివిరుస్తోంది. దీపిక, శిశువు ఇద్దరు కూడా సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నట్లుగా కుటుంబ సభ్యులకు కూడా తెలిపారు. ఈ శుభవార్త తెలిసిన వెంటనే అటు కత్రినా కైఫ్, ఆలియా భట్, మరి కొంతమంది సెలబ్రిటీలు కూడా వీరికి అభినందనలు తెలియజేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించి సోషల్ మీడియాలో న్యూస్ వైరల్ గా మారింది. దీపికా పదుకొనే సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం అల్లు అర్జున్తో రాకా అనే సినిమాలో నటిస్తోంది. అలాగే షారుక్ ఖాన్ నటిస్తున్న కింగ్ చిత్రంలో కూడా నటిస్తున్నట్లు తెలుస్తోంది.
also read:Atlee:విజయ్ సేతుపతి వివాదంపై అట్లీ గాడిద కథ..ఆ మాటతో హీట్ పెంచేశాడే..!
రణవీర్ సింగ్ సినిమాలు..
రన్వీర్ సింగ్ సినిమాల విషయానికి వస్తే.. ఈ ఏడాది దురంధర్ ది రివేంజ్ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నారు. ప్రస్తుతం ప్రళయ అనే చిత్రంలో నటిస్తున్నారు . అలాగే మరో బాలీవుడ్ చిత్రంలో కూడా నటిస్తున్నట్లు తెలుస్తోంది. బాలీవుడ్ లో మాత్రం దురంధర్ 3 మొదలుపెట్టే అవకాశాలు ఉన్నాయనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి. తమ రెండవ బిడ్డ కోసం కొద్ది రోజులపాటు ఈ జంట విశ్రాంతి తీసుకోబోతోంది. అనంతరం సినిమా షూటింగ్లో పాల్గొనే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
View this post on Instagram




