Sunday, September 20, 2026
HomeLATESTRavi Teja:మాస్ మహారాజా షాకింగ్ డిమాండ్.. హసిత్ గోలి సినిమా ఆగిపోయిందా?

Ravi Teja:మాస్ మహారాజా షాకింగ్ డిమాండ్.. హసిత్ గోలి సినిమా ఆగిపోయిందా?

Ravi Teja:మాస్ మహారాజా రవితేజ, దర్శకుడు హసిత్ గోలి కాంబినేషన్‌లో తెరకెక్కాల్సిన సినిమా గురించి ఆసక్తికరమైన వార్తలు వైరల్ అవుతున్నాయి.

on
- Advertisement -banner Ad

Ravi Teja:ప్రజెంట్ రవితేజకు సంబంధించిన ఈ న్యూస్ సోషల్ మీడియాలో బాగా హీట్ పెంచేస్తుంది. రవితేజ గురించి నిన్న మొన్నటి వరకు సోషల్ మీడియాలో ఎలాంటి ట్రోలింగ్ జరిగిందో అందరికీ తెలిసిందే. ఆయన చేసే సినిమాలు అస్సలు బాగుండడం లేదు అంటూ, సినిమా ఫ్లాప్ అవుతున్నాయి అంటూ, నిర్మాతలకు భారీ నష్టాలు వస్తున్నాయి అంటూ ఒకటా రెండా ఎన్నెన్నో వైరల్ న్యూస్ మనం సోషల్ మీడియాలో చూసాం.

‘ఇరుముడి’ తర్వాత మారిపోయిన పరిస్థితి :

అయితే ఇదంతా ‘ఇరుముడి’ సినిమా రిలీజ్ అవ్వకముందు. ‘ఇరుముడి’ సినిమా రిలీజ్ అయిన తర్వాత చిన్నా పెద్దా, ముసలి, యంగ్ పీపుల్స్ అందరూ కూడా రవితేజకు బిగ్ ఫ్యాన్ అయిపోయారు. అసలు ‘ఇరుముడి’ సినిమా రిలీజ్ టైంలో, ‘ఇరుముడి’ సినిమా షూటింగ్ టైంలో, ఫ్రీ రిలీజ్ ఈవెంట్ టైంలో ఈ సినిమా ఇంత పెద్ద హిట్ అవుతుంది అని ఎవరు ఊహించలేదు. బహుశా డైరెక్టర్ శివ, నిర్మాత కూడా ఎంత పెద్ద హిట్ అవుతుంది అని ఊహించలేదు అనుకుంటూ ఉంటారు అని సోషల్ మీడియాలో పలు రకాల వార్తలు కూడా వినిపించాయి.

- Advertisement -
Advertisement

రవితేజకు భారీగా పెరిగిన డిమాండ్? :

అయ్యప్ప స్వామి దయవల్ల ‘ఇరుముడి’ సినిమా సూపర్ డూపర్ హిట్ అయిపోయింది. ఎలా అంటే రామ్ చరణ్, యష్, ప్రభాస్ పక్కన కుర్చీ వేసి కూర్చునే స్థాయికి ఎదిగిపోయాడు. ఇప్పుడు రవితేజకు(Ravi Teja) అయితే ఇదే ఇప్పుడు పెద్ద తలనొప్పిగా మారింది.

రూ.20 కోట్ల రెమ్యూనరేషన్‌తో పాటు నైజాం హక్కులు?:

అందుతున్న సమాచారం ప్రకారం రవితేజ తన రెమ్యూనరేషన్‌ను భారీగా పెంచేసినట్లు తెలుస్తుంది. రూ.20 కోట్ల రెమ్యూనరేషన్‌తో పాటు నైజాం హక్కులు కూడా ఓ సినిమా విషయంలో అడిగారట. ఆ కారణంగా ఆ సినిమాను పూర్తిగా ఆపేశారు అంటూ ఫిలిం వర్గాలలో చర్చ నడుస్తుంది.

- Advertisement -
Advertisement

హసిత్ గోలి సినిమాకు బ్రేక్? :

అందుతున్న లేటెస్ట్ అప్‌డేట్ ప్రకారం హసిత్ గోలి దర్శకత్వంలో నిర్మాత తిరు రాజు తలపెట్టిన ఓ ప్రతిష్టాత్మకమైన సినిమా ఇకపై ముందుకు రాకపోవచ్చు అంటూ తెలుస్తుంది. దీనికి మెయిన్ కారణం రవితేజ రెమ్యూనరేషన్. ఈ సినిమా కోసం రవితేజ రూ.20 కోట్లు ప్లస్ నైజాం హక్కుల డిమాండ్ చేశారట. ఇవన్నీ వర్కౌట్ అయ్యే పనులు కావులే అంటూ దిల్ రాజు టీం ఈ సినిమాను పక్కన పెట్టేసినట్లు తెలుస్తుంది.

also read:Nayanthara:వరుస పరాజయాల ఎఫెక్ట్.. నయనతార సంచలన నిర్ణయం!

- Advertisement -
Advertisement

రవితేజ డిమాండ్లతో సినిమా ఆగిపోయిందా? :

మాస్ మహారాజా రవితేజ ఈ రేంజ్‌లో రెమ్యూనరేషన్ పెంచేస్తారు అని చిత్ర బృందం ఊహించలేకపోయింది. ఆ కారణంగానే ఈ సినిమా ఆగిపోయినట్లు ప్రచారం జరుగుతుంది. అయితే దాని స్థానంలో ఒకప్పటి దిల్ రాజు భాగస్వామి లక్ష్మణ్, వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో మూవీ సర్టిఫైకి రాబోతున్నట్లు తెలుస్తుంది. ఇది అఫీషియల్ కాదు, జస్ట్ వైరల్ టాక్. మాస్ మహారాజ రవితేజ డిమాండ్లకు లక్ష్మణ్ ఓకే చెప్పారట.

also read:Deepika Padukone:రెండోసారి బిడ్డకు జన్మనిచ్చిన స్టార్ కపుల్స్.. ఈసారి ఎవరంటే..?

రవితేజ క్రేజ్ ఉన్నప్పుడే డిమాండ్ చేస్తున్నారా? :

ఇక రవితేజ రైట్ రాంగ్‌గా ఆలోచిస్తూ ఉండే టైం పోయింది. ఎందుకంటే దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలి అన్న పాత ఫార్ములాను మళ్లీ ఫాలో అవుతున్నాడు రవితేజ. క్రేజ్ ఉన్నప్పుడు డిమాండ్ చేయాలి.

అన్ని సినిమాలు ‘ఇరుముడి’లా హిట్ అవుతాయా? :

అయితే ఇక్కడ ఒక చిన్న లాజిక్ ఉంది. అన్ని సినిమాలు రవితేజ అనుకున్న ‘ఇరుముడి’ లాంటి హిట్ అవ్వవు. ఒకవేళ అయితే లెక్కలు వర్కౌట్ అవుతాయి. లేకపోతే సినిమా ఇండస్ట్రీలో ఊహించని తలకిందులు ఎన్నో జరిగినట్లు రవితేజ విషయంలో కూడా అలాగే జరగొచ్చు. చూడాలి మరి ముందు ముందు ఏం జరుగుతుందో. ఇదంతా అఫీషియల్ ఏం కాదు గానీ ఫిలిం వర్గాల టాక్ మాత్రమే.

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you