Kevvu Karthik:తెలుగు బుల్లితెరపై ప్రేక్షకులు సైతం చాలా ఎక్సైటింగ్ గా ఎదురుచూసే షో ఏదైనా ఉంది అంటే అది బిగ్ బాస్ షో అని చెప్పవచ్చు. ప్రస్తుతం తెలుగు బిగ్ బాస్ పదవ సీజన్ రన్ అవుతోంది. తాజాగా ఆదివారం జరిగిన ఎపిసోడ్లో నటుడు కృష్ణుడు ఎలిమినేట్ అయ్యారు. మరొకవైపు ఈసారి హౌస్ లో అడుగుపెట్టే వైల్డ్ కార్డు కంటెస్టెంట్స్ గురించి గత కొద్దిరోజులుగా ఏదో ఒక న్యూస్ వైరల్ గా మారుతోంది. ఈ క్రమంలోనే జబర్దస్త్ కమెడియన్లలో ఒకరైన కెవ్వు కార్తీక్ బిగ్ బాస్ హౌస్ లోకి వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇవ్వబోతున్నారని వార్తలు వినిపించాయి. ఈ విషయం పైన తాజాగా ఒక టాక్ షోలో పాల్గొన్న కెవ్వు కార్తిక్ అసలు విషయాన్ని తెలియజేశారు.
వైల్డ్ కార్డు ద్వారా కార్తీక్ హౌస్ లోకి వెళ్ళనున్నారా?
కెవ్వు కార్తీక్(Kevvu Karthik) మీరు బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లడానికి యూకే నుంచి ఇండియాకి తిరిగి వచ్చారా అంటూ పరోక్షంగా ప్రశ్నించగా? అందుకు కార్తీక్ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తూ ఇవన్నీ నీకు ఎలా తెలుసు అని అనడంతో ఆయన బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లడం ఖాయం అనే విధంగా తెలుస్తోంది. అలాగే ఈ సీజన్ లో తన ఫ్రెండ్స్ వర్షిని, వంశీ, పొట్టి నరేష్ , ఆటో రాంప్రసాద్ హౌస్ లో ఉన్నారని వారందరూ బాగా ఆడాలని కోరుకుంటున్నాను అంటూ కార్తీక్ తెలిపారు.
also read:Rashmika Mysaa: యాక్షన్ సీన్స్ తో దుమ్ము లేపేసిన రష్మిక..!
ఆ కమెడియన్ టాప్ 5 లో ఉంటారు..
నా ఉద్దేశంలో ఈసారి పొట్టి నరేష్ టాప్ ఫైవ్ లో ఉంటారని, కుదిరితే సీజన్ విన్నర్ అయ్యే అవకాశం కూడా ఉందంటూ కార్తీక్ తెలియజేశారు. ఒకవేళ హౌస్ లోకి వైల్డ్ కార్డు ద్వారా వెళ్తే.. పరిస్థితి ఏంటి అంటూ యాంకర్ ప్రశ్నించగా? ఒకవేళ నేను హౌస్ లోకి వెళితే మాత్రం నేను గెలవాలనే కోరుకుంటానంటూ చాలా సరదాగా సమాధానం తెలిపారు. అంతేకాకుండా గతంలో వెళ్లిన జబర్దస్త్ కమెడియన్స్ కూడా చాలామంది టాప్ ఫైవ్ లేదా రన్నర్ గా మాత్రమే నిలిచారని తెలిపారు కార్తీక్.
also read:Kajal Aggarwal:దాని వల్లే భార్యాభర్తల మధ్య దూరం.. విడాకులపై కాజల్ అగర్వాల్ కీలక వ్యాఖ్యలు
ట్రోఫీ గెలవాలని కోరుకుంటున్నా..
కానీ ఈసారి మాత్రం ఖచ్చితంగా జబర్దస్త్ కమెడియన్ బిగ్ బాస్ ట్రోఫీ సాధించాలని చాలా గట్టిగా కోరుకుంటున్నానని తెలిపారు. అగ్నిపరీక్ష ద్వారా హౌస్ లోకి అడుగుపెట్టిన కామనర్స్ ఆట తీరును కూడా కార్తీక్ ప్రశంసించారు. మొదటిసారి కెమెరా ముందుకు వచ్చినప్పుడు వారు చాలా అద్భుతంగా ఆడుతున్నారు. ఈ అవకాశాన్ని కూడా సరిగ్గా ఉపయోగించుకుంటే వారికి చాలా మంచి భవిష్యత్తు ఉంటుందంటూ తెలిపారు. మరి యూకే నుంచి ఇండియాకి తిరిగి వచ్చిన కెవ్వు కార్తీక్ నిజంగానే బిగ్ బాస్ హౌస్ లోకి వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇస్తారో లేదో చూడాలి మరి. తన భార్య పిల్లల కోసమే తాను అన్నిటిని వదిలేసి యూకే లో సెటిల్ అయ్యారని తెలియజేశారు.




