OTT Releases Today:ఈ వారం థియేటర్లలో ‘ది ప్యారడైజ్’తో పాటు ‘అనుమాన పక్షి’, ‘కల్యాణం కమనీయం జీవితం’, ‘ప్రేమనే ఊరిలో’ వంటి సినిమాలు ప్రేక్షకులను అలరిస్తున్నాయి. మరోవైపు ఓటీటీ వేదికలపై కూడా కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు సందడి చేస్తున్నాయి. ముఖ్యంగా శుక్రవారం (సెప్టెంబర్ 25) ఒక్కరోజే పలు కొత్త కంటెంట్ స్ట్రీమింగ్కు వచ్చింది. హారర్, థ్రిల్లర్, కామెడీ, క్రైమ్, రొమాన్స్, స్పోర్ట్స్ డ్రామా వంటి విభిన్న జానర్లలో (OTT Releases Today)సినిమాలు అందుబాటులోకి వచ్చాయి.
జీ5లో ‘అగథ’, ‘హాయ్’ :
ప్రముఖ నిర్మాత ఎం.ఎస్. రాజు దర్శకత్వంలో కామాక్షి భాస్కర్ల, శ్రవణ్ రెడ్డి ప్రధాన పాత్రల్లో నటించిన హారర్ థ్రిల్లర్ ‘అగథ’ సెప్టెంబర్ 25 నుంచి జీ5లో స్ట్రీమింగ్ అవుతోంది. మరోవైపు లేడీ సూపర్‌స్టార్ నయనతార, కవిన్ జంటగా విష్ణు ఎడవన్ దర్శకత్వంలో తెరకెక్కిన కామెడీ ఫ్యామిలీ డ్రామా ‘హాయ్’ కూడా జీ5లోకి వచ్చింది. తమిళంతో పాటు తెలుగు సహా ఇతర భాషల్లో ఈ సినిమా అందుబాటులో ఉంది.
ప్రైమ్ వీడియోలో ‘రంభ ఊర్వశి మేనక’ :
అల్లరి నరేష్ ప్రధాన పాత్రలో చంద్రమోహన్ చింతాడ దర్శకత్వంలో తెరకెక్కిన కామెడీ ఫాంటసీ డ్రామా ‘రంభ ఊర్వశి మేనక’ తాజాగా అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. థియేటర్లలో మిశ్రమ స్పందన అందుకున్న ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇదే ప్లాట్ఫామ్లో ‘ఫోటోగ్రాఫర్’ అనే ఫాంటసీ థ్రిల్లర్, ‘డోంట్ బీ షై’ అనే రొమాంటిక్ కామెడీ కూడా అందుబాటులోకి వచ్చాయి.
also read:Film industry:అత్యధిక ఆస్తి కలిగిన భారతీయ నటులు వీళ్లే..!
సోనీ లివ్‌లో ‘హబీబీ’ :
కోలీవుడ్ నటుడు, దర్శకుడు ధనుష్ తండ్రి కస్తూరి రాజా ప్రధాన పాత్రలో నటించిన తమిళ పీరియాడికల్ రొమాంటిక్ డ్రామా ‘హబీబీ’ సోనీ లివ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. మీరా కతివరన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలోని కథ, నటనకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించినట్లు సమాచారం. ఈ మూవీ తమిళంతో పాటు తెలుగులోనూ ప్రేక్షకులకు అందుబాటులోకి వచ్చింది.
also read:Chiranjeevi :చిరంజీవి బ్లడ్ బ్యాంక్‌పై షాకింగ్ ఆరోపణలు..ల్యాబ్ టెక్నీషియన్ సంచలన కామెంట్స్!
నెట్‌ఫ్లిక్స్‌లో క్రైమ్ థ్రిల్లర్ :
బాలీవుడ్ నటి హ్యుమా ఖురేషీ ప్రధాన పాత్రలో నటించిన క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ ‘బేబీ డూ ఆర్ డై’ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. నచికేత్ సమంత్ దర్శకత్వం వహించిన ఈ సినిమా హిందీతో పాటు తెలుగు డబ్బింగ్లోనూ అందుబాటులోకి వచ్చింది. దీంతో పాటు నెట్‌ఫ్లిక్స్‌లో ‘యూనాబాంబర్’, ‘ది డిఫరెంట్ వరల్డ్’, ‘ది ఫైనల్ ప్రాబ్లమ్’ వంటి కంటెంట్ కూడా స్ట్రీమింగ్ అవుతోంది.
ఇతర ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో.. :
జియో హాట్‌స్టార్‌లో ‘హుంకార్: ది రోర్’, ‘మ్యాంగో పచ్చా’ స్ట్రీమింగ్ అవుతున్నాయి. జీ5లో ‘బకైతీ సీజన్ 2’ కూడా అందుబాటులోకి వచ్చింది. ఇక సన్ నెక్స్ట్లో స్పోర్ట్స్ డ్రామా ‘అంగీకారం’ స్ట్రీమింగ్ అవుతోంది. మొత్తంగా ఈ వారం ఓటీటీల్లో తెలుగు, తమిళం, హిందీతో పాటు ఇతర భాషలకు చెందిన సినిమాలు, వెబ్ సిరీస్‌లు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాయి.




