Monday, September 28, 2026
HomeLATESTHrithik Roshan:జైలర్ 2లో హృతిక్ రోషన్ ఎంట్రీ.. వీడియో చూస్తే గూస్‌బంప్స్ పక్కా!

Hrithik Roshan:జైలర్ 2లో హృతిక్ రోషన్ ఎంట్రీ.. వీడియో చూస్తే గూస్‌బంప్స్ పక్కా!

Hrithik Roshan:సూపర్‌స్టార్ రజనీకాంత్ నటిస్తున్న ‘జైలర్ 2’పై అంచనాలు మరింత పెరిగాయి.

on
- Advertisement -banner Ad

Hrithik Roshan:సూపర్‌స్టార్ రజనీకాంత్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ‘జైలర్ 2’ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో ఇప్పటికే పలువురు ప్రముఖ నటీనటులు భాగమయ్యారు. తాజాగా బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ కూడా ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నట్లు ఓ వీడియో ద్వార క్లారిటీ వచ్చేసింది. దీంతో రజనీకాంత్, హృతిక్ రోషన్ కాంబినేషన్‌పై సినీ అభిమానుల్లో ఆసక్తి మరింత పెరిగింది.

షారుఖ్ స్థానంలో హృతిక్..:

‘జైలర్ 2’లో ఓ కీలక పాత్ర కోసం తొలుత బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్‌ను సంప్రదించినట్లు సినీ వర్గాల్లో వార్తలు వచ్చాయి. రజనీకాంత్‌తో కలిసి నటించేందుకు షారుఖ్ కూడా ఆసక్తి చూపినట్లు సమాచారం. అయితే ప్రస్తుతం తన కుమార్తె సుహానా ఖాన్ హీరోయిన్‌గా పరిచయం అవుతున్న ‘కింగ్’ సినిమాపై ఆయన ఎక్కువగా దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆ పాత్రలో హృతిక్ రోషన్‌ను ఎంపిక చేసినట్లు సమాచారం.

- Advertisement -
Advertisement

ALSO READ:Bigg Boss :బిగ్‌బాస్‌లో ఊహించని ట్విస్ట్.. 48 గంటల్లోనే మితిలేష్ ఎగ్జిట్!

చిన్ననాటి నుంచే రజనీతో అనుబంధం :

హృతిక్ రోషన్‌కు (Hrithik Roshan)రజనీకాంత్‌తో ఉన్న అనుబంధం ప్రత్యేకమైనది. 1986లో విడుదలైన ‘భగవాన్ దాదా’ సినిమాలో హృతిక్ బాలనటుడిగా కనిపించారు. ఆ చిత్రంలో రజనీకాంత్‌కు కొడుకు పాత్రలో నటించారు. ఇప్పుడు దాదాపు నాలుగు దశాబ్దాల తర్వాత అదే సూపర్‌స్టార్‌తో కలిసి హృతిక్ మరోసారి తెరపై కనిపించనుండటం ఆసక్తికరంగా మారింది.

- Advertisement -
Advertisement

ALSO READ:Mohan Babu:రచయిత కుమారుడికి మోహన్ బాబు బంపర్ ఆఫర్..!

రజనీ పాత్రకు అండగా..:

‘జైలర్ 2’లో రజనీకాంత్ టైగర్ ముత్తువేల్ పాండియన్ పాత్రలో కనిపించనున్నారు. ఈ కథలో ఓ కీలక సందర్భంలో రజనీ పాత్రకు అండగా నిలిచే వ్యక్తిగా హృతిక్ రోషన్ కనిపించనున్నట్లు సమాచారం. ఆయన పాత్రకు సినిమాలో మంచి ప్రాధాన్యత ఉంటుందని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

- Advertisement -
Advertisement

వైరల్ అవుతున్న హృతిక్ ఇంట్రడక్షన్:

ఇక హృతిక్ రోషన్‌కు సంబంధించిన ఇంట్రడక్షన్ సీన్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో ఆయన లుక్, స్క్రీన్ ప్రెజెన్స్, స్టైల్ అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్, హృతిక్ స్టైలిష్ ఎంట్రీ, ఆయన గ్రేస్ సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతున్నాయి. ఈ సన్నివేశానికి సంబంధించిన వీడియోలు, పోస్టర్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

భారీ తారాగణంతో జైలర్ 2:

‘జైలర్ 2’ను సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తోంది. నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రజనీకాంత్‌తో పాటు రమ్యకృష్ణ, విద్యాబాలన్, ఎస్.జే. సూర్య తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పుడు హృతిక్ రోషన్ కూడా ఈ ప్రాజెక్ట్‌లో చేరడంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. రజనీకాంత్, హృతిక్ కాంబినేషన్ తెరపై ఎలా ఉంటుందో చూడటానికి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా అక్టోబర్ 15 న గ్రాండ్ గా ధియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా ఎప్పుడెప్పుడు ధియేటర్స్ లో చూద్దామా అంటూ ఫ్యాన్స్ వెయిటింగ్. బోలెడు మంది స్టార్స్ ని ఒక్కే తెర పై చూసే ఛాన్స్ ఈ సినిమా అందిస్తుంది..!!

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you