Prabhas:డార్లింగ్ ప్రభాస్ పెళ్లి చేసుకుంటే చూడాలి అంటూ ఎంతమంది వెయిట్ చేస్తున్నారో అనే దాని గురించి ప్రత్యేకంగా మాట్లాడాల్సిన అవసరమే లేదు. కోట్లాది మంది అభిమానులు, పెద్ద పెద్ద సెలబ్రిటీస్ కూడా డార్లింగ్ హీరో ప్రభాస్ పెళ్లి చేసుకుంటే చూడాలి అని ఎప్పటినుంచో వెయిట్ చేస్తున్నారు. కానీ ఆయన మాత్రం పెళ్లి అంటే చాలు పరిగెత్తిపోతున్నారు. ఏ ఈవెంట్‌కి వచ్చినా పెళ్లి గురించి ప్రశ్నిస్తారేమో అంటూ ముందుగానే మైక్ తీసుకోకుండా జాగ్రత్త పడిపోతారు. అంత దూరంగా ఉంటాడు ప్రభాస్ పెళ్లికి.
రొమాంటిక్ పోస్ట్‌తో షాక్ :
ప్రభాస్(Prabhas) సాధారణంగా రొమాంటిక్‌గా మాట్లాడే సందర్భాలు చాలా తక్కువ. అలాంటి రొమాంటిక్ యాంగిల్ ఆయనను మనం తెరపై మాత్రమే చూడాలి. రీసెంట్‌గా ఆయన సోషల్ మీడియా ఖాతాలో ఒక పోస్ట్ కనిపించింది. అది కూడా ఒక రొమాంటిక్ పోస్ట్ కావడంతో జనాలు షాక్ అయిపోయారు. ఇది నిజంగా మన ప్రభాస్‌నా? లేకపోతే ప్రభాస్ డార్లింగ్ అకౌంట్‌ని ఎవరైనా హ్యాక్ చేశారా? అన్న విధంగా ఆ పోస్ట్ ఉంది.
“ వేర్ ఆర్ యు మై జూలియట్ డార్లింగ్” :
“I feel a bit like Romeo today, where are you my Juliet darlingey ❤️”అంటూ ప్రభాస్ పేరుతో ఓ పోస్ట్ సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. ఈ పోస్ట్ ఇప్పుడు నెట్టింట చర్చనీయాంశంగా మారింది. కొంతమంది అభిమానులు ఈ పోస్ట్‌ను ప్రభాస్ స్వయంగా చేశారని అంటుండగా, మరికొందరు మాత్రం ఆయన అకౌంట్‌ను ఎవరో హ్యాక్ చేసి ఈ పోస్ట్ పెట్టి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అసలు ఈ పోస్ట్ వెనుక నిజం ఏమిటనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. ప్రభాస్ నిజంగానే ఈ పోస్ట్ చేశారా? లేక హ్యాకింగ్‌కు గురయ్యారా? అనే విషయంపై అభిమానుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై ప్రభాస్ స్పందిస్తేనే పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
ALSO READ:Hrithik Roshan:జైలర్ 2లో హృతిక్ రోషన్ ఎంట్రీ.. వీడియో చూస్తే గూస్‌బంప్స్ పక్కా!
సినిమా ప్రమోషన్స్‌లో భాగమేనా? :
కొంతమంది మాత్రం అసలు ఇది ఆయన ఒరిజినల్ లైఫ్‌కి సంబంధించింది కాదు అని, ఒక సినిమా గురించే ఉంటుంది అంటూ మాట్లాడుకుంటున్నారు. అసలు ప్రభాస్ ఈ పోస్ట్ ఎందుకు పెట్టారు? సినిమా గురించేనా? లేకపోతే నిజంగానే ఆయన పెళ్లి గురించి ఏమైనా గుడ్ న్యూస్ చెప్పబోతున్నారా? అంటూ రకరకాలుగా వార్తలు వినిపిస్తున్నాయి.
ALSO READ:Bigg Boss :బిగ్‌బాస్‌లో ఊహించని ట్విస్ట్.. 48 గంటల్లోనే మితిలేష్ ఎగ్జిట్!
సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న పోస్ట్ :
అయితే ఈ పోస్టుపై సోషల్ మీడియాలో భిన్నమైన చర్చ జరుగుతోంది. వందలో దాదాపు 90 శాతం మంది మాత్రం ఇది ప్రభాస్ నటిస్తున్న కొత్త సినిమా ప్రమోషన్స్‌లో భాగంగానే చేసిన పోస్టింగ్ అని అభిప్రాయపడుతున్నారు. అసలు ఈ పోస్ట్ వెనుక ఉన్న విషయం ఏమిటనేది ప్రభాస్ స్వయంగా స్పందిస్తేనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
ప్రస్తుతం మాత్రం ఆయన చేసిన ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. ప్రభాస్ అభిమానులు సైతం దీనిపై ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. నిజంగానే ఇది సినిమా ప్రమోషనా? లేక మరేదైనా ప్రత్యేక కారణం ఉందా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మరి ఈ విషయంపై ప్రభాస్ ఎలాంటి వివరణ ఇస్తాడో, ఈ పోస్ట్ వెనుక అసలు కథ ఏమిటో తెలియాలంటే మరికొంత సమయం వేచి చూడాల్సిందే. అప్పటివరకు సోషల్ మీడియాలో ఈ చర్చ కొనసాగుతూనే ఉంటుంది.




