Wednesday, September 30, 2026
HomeLATESTAishwarya Rai Bachchan:ఐశ్వర్య రాయ్ కి తప్పని బాడీ షేమింగ్..!

Aishwarya Rai Bachchan:ఐశ్వర్య రాయ్ కి తప్పని బాడీ షేమింగ్..!

Aishwarya Rai Bachchan: మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్య రాయ్ పై ఇప్పుడు బాడీ షేమింగ్ ట్రోల్స్ చేయడం సోషల్ మీడియాలో సంచలనంగా మారుతుంది.

on
- Advertisement -banner Ad

Aishwarya Rai Bachchan:బాలీవుడ్లో ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించి ప్రపంచ సుందరిగా కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకున్న అందాల తార ఐశ్వర్యారాయ్ గురించి చెప్పాల్సిన పనిలేదు. ఇప్పుడు తాజాగా మరొకసారి అంతర్జాతీయ వేదిక పైన ప్రత్యేకతను చాటుకున్నది. పారిస్ ఫ్యాషన్ వీక్ లో జరిగిన ఒక ప్రతిష్టాత్మకమైన ఫ్యాషన్ షోలో సందడి చేసింది ఐశ్వర్యరాయ్. తన స్టైల్ గ్రేస్ తో అక్కడ అందరిని ప్రత్యేకించి ఆకట్టుకుంది. ర్యాంప్ వాక్ పూర్తయిన తర్వాత అభిమానులను ఉద్దేశించి ఆమె ఇచ్చిన ఫ్లయింగ్ కిస్ హార్ట్ సింబల్స్ కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

రాయల్ లుక్ లో ఐశ్వర్యారాయ్ ర్యాంప్ వాక్..

ఈ సందర్భంలోనే కొంతమంది నెటిజన్స్ సైతం ఐశ్వర్య రాయ్ లుక్స్ ను సైతం విమర్శిస్తూ ఆమె శరీరాకృతి పైన పలు రకాల కామెంట్స్ చేస్తున్నారు. అంతర్జాతీయ కార్యక్రమంలో వయోలా డేవిస్ , సిమోన్ ఆష్లే, కెండల్ జెన్నర్ తదితర ప్రముఖులు సైతం యువర్ వర్క్ ఫ్యాషన్ షోలో సందడి చేశారు. అయితే ఐశ్వర్య రాయ్ లుక్కు మాత్రం ప్రత్యేకంగా ఆకట్టుకుంది. స్టైలిష్ మోహిత్ రాయ్ ఆమె లుక్కుని డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. అలా ర్యాంపు పై ఐశ్వర్యరాయ్ నడుస్తూ ప్రదర్శించిన తీరు అభిమానులను ఆకట్టుకుంది.

- Advertisement -
Advertisement

also read:Tollywood:అక్టోబర్ 2న బరిలో ఐదు క్రేజీ చిత్రాలు..!

ఐశ్వర్యరాయ్ పై బాడీ షేమింగ్ ట్రోల్స్..

అయితే ఐశ్వర్యరాయ్ ఫ్యాషన్ షో కి సంబంధించి పోస్టులు వైరల్ గా మారడంతో నెటిజన్స్ ఆమె బాడీని టార్గెట్ చేస్తూ పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ముఖ్యంగా ఐశ్వర్య బరువు పైన గతంలో ఫోటోలను పోలుస్తూ విమర్శిస్తున్నారు. కొందరు ఆమె లుక్స్ పైన అసభ్యకరమైన కామెంట్ చేస్తూ ఉండగా మరికొందరు ఆమె గర్భధారణకు సంబంధించిన ప్రశ్నల పైన కామెంట్స్ చేస్తున్నారు. ఐశ్వర్యారాయ్ తల్లి కాబోతోందా అంటూ ప్రశ్నిస్తున్నారు. మరి కొంతమంది ఐశ్వర్యారాయ్ బరువు తగ్గాలని సూచిస్తూ ట్రోల్ చేస్తున్నారు. కానీ ఐశ్వర్యరాయ్ అభిమానులు మాత్రం ఆమెకు మద్దతుగా కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఐశ్వర్యారాయ్ ఫేస్ కాస్త ఉబ్బినట్టుగా కనిపిస్తోంది. బ్లాక్ దుస్తులలో ఐశ్వర్యారాయ్ చాలా అద్భుతంగా కనిపిస్తోందని మరి కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు.

- Advertisement -
Advertisement

also read:The Paradise:నటుడు ప్రియదర్శిని అభినందించిన మాజీ మంత్రి హరీష్ రావు..!

ఐశ్వర్యారాయ్ సినీ కెరియర్..

ఐశ్వర్యరాయ్ సినీ కెరియర్ విషయానికి వస్తే 1997లో మొదటిసారి ఇరువర్ అనే తమిళ చిత్రం ద్వారా తన కెరియర్ ను మొదలుపెట్టింది. తెలుగులో రావోయి చందమామ అనే సినిమాలో కూడా నటించింది. ఆ తర్వాత బాలీవుడ్ వైపుగా అడుగులు వేసి పలు చిత్రాలలో నటించి స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించింది. 2007 ఏప్రిల్ 20వ తేదీన అభిషేక్ బచ్చన్ ను ప్రేమించే వివాహం చేసుకుంది. వీరికి ఆరాధ్య బచ్చన్ అనే కుమార్తె కలదు. చివరిగా 2023లో పొన్నియన్ సెల్వన్ 2 చిత్రంలో నటించింది. ఈ సినిమా తర్వాత మళ్లీ తన తదుపరి చిత్రాన్ని మాత్రం ప్రకటించలేదు ఐశ్వర్యరాయ్. ఇప్పుడు మరొకసారి తన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ట్రెండీగా మారుతుంది ఐశ్వర్యారాయ్.

- Advertisement -
Advertisement

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you