Wednesday, September 30, 2026
HomeLATESTThe Paradise:నటుడు ప్రియదర్శిని అభినందించిన మాజీ మంత్రి హరీష్ రావు..!

The Paradise:నటుడు ప్రియదర్శిని అభినందించిన మాజీ మంత్రి హరీష్ రావు..!

The Paradise: ది ప్యారడైజ్ చిత్రంలో కేసీఆర్ పాత్ర పోషించిన నటుడు ప్రియదర్శిని మాజీ మంత్రి హరీష్ రావు అభినందించారు.

on
- Advertisement -banner Ad

The Paradise:టాలీవుడ్ లో ప్రముఖ నటుడుగా పేరు సంపాదించిన నటుడు ప్రియదర్శి ఎన్నో విభిన్నమైన పాత్రలలో నటించి మెప్పించారు. ఇటీవల నాని నటించిన ది ప్యారడైజ్(The Paradise) చిత్రంలో కేసీఆర్ పాత్రలో నటించడంతో చాలామంది ప్రశంసలు కురిపిస్తున్నారు. దీంతో టిఆర్ఎస్ నేతలు ఈ సినిమాని చూడడానికి ఇష్టపడుతున్నారు.మాజీ మంత్రి టిఆర్ఎస్ నేత హరీష్ రావుని తాజాగా ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ప్యారడైజ్ సినిమా గురించి అలాగే ఆయన నటించిన శంకరన్న పాత్ర గురించి హరీష్ రావుతో ముచ్చటించారు నటుడు ప్రియదర్శి.

ప్రియదర్శిని ప్రశంసించిన మాజీ మంత్రి హరీష్ రావు..

ఈ సందర్భంగా ప్రియదర్శి ఆయన సినీ ప్రయాణం, భవిష్యత్తు ప్రాజెక్టుల పైన కూడా మాట్లాడుకున్నట్లు సమాచారం. ఒక జాతి గుర్తింపు కోసం జరిగిన పోరాటాన్ని ఇటీవలే విడుదలైన ప్యారడైజ్ సినిమాలో చాలా అద్భుతంగా చూపించారని ప్రశంసలు కురిపించారు. ఆ పోరాట స్ఫూర్తి కి ప్రతీకగా నిలిచిన తెలంగాణ మొట్టమొదటి ముఖ్యమంత్రి కేసీఆర్ పాత్రలో ప్రియదర్శి నటించారు. ముఖ్యంగా కేసీఆర్ హావభావాలు , నడక , మాట తీరుని పట్టుకోవడం చాలా కష్టము. కానీ ఆ పాత్రలో ప్రియదర్శి సహజంగానే నటించడంతో ప్రశంసలు అందుకున్నారు. ఈ పాత్ర ప్రజలకు బాగా బలంగా కనెక్ట్ అయిందని అభినందించారు మాజీమంత్రి హరీష్ రావు.

- Advertisement -
Advertisement

also read:Amala Paul:ఇండస్ట్రీపై సంచలన కామెంట్స్ చేసిన అమలాపాల్..!

తెలంగాణ మట్టి కథలను మోసే అద్భుతమైన నటుడు..

గతంలో వచ్చిన మల్లేశం సినిమా ద్వారా తెలంగాణ చేనేత కార్మికుల కష్టాలను తెలియజేయడమే కాకుండా బలగం సినిమాతో మన పల్లె సంస్కృతిని కుటుంబ బంధాలను ప్రపంచానికి చాలా అద్భుతంగా చాటి చెప్పారని గుర్తు చేశారు. ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా వచ్చి తన స్వయంకృషితోనే తెలంగాణ మట్టి కథలను మోసే అద్భుతమైన నటుడుగా ఎదగడం తెలంగాణకే గర్వకారణం అంటూ కొనియాడారు. ముఖ్యంగా తెలంగాణ సినిమా సంస్కృతిని మరింత ముందుకు తీసుకు వెళ్లేలా భవిష్యత్తులో మరిన్ని గొప్ప ప్రాజెక్టులు చేపట్టాలంటూ హరీష్ రావు ఆకాంక్షించారు. ఈ విషయం పైన నటుడు ప్రియదర్శి మాజీ మంత్రి హరీష్ రావుకి ప్రత్యేక కృతజ్ఞతలను తెలియజేశారు.

- Advertisement -
Advertisement

also read:Chiranjeevi: ఓటీటీ షోకి హోస్టుగా చిరంజీవి..!

హరీష్ రావు పై తన అభిమానాన్ని చాటుకున్న ప్రియదర్శి..

- Advertisement -
Advertisement

నిత్యం ప్రజల మధ్య ఉంటూ ప్రజల కోసం పాటుపడే నాయకుడిగా పేరు సంపాదించడం వెనుక చాలా కృషి దాగి ఉందని, హరీష్ రావు పట్ల తనకున్న అభిమానాన్ని వ్యక్తం చేశారు నటుడు ప్రియదర్శి. నటుడు ప్రియదర్శి హీరోగా కూడా పలు చిత్రాలలో నటించి బాగానే పేరు సంపాదించారు. మరి రాబోయే రోజుల్లో ఎలాంటి పాత్రలలో నటించి ప్రేక్షకులను మరింత ఆకట్టుకుంటారో చూడాలి. ప్రస్తుతం మాజీ మంత్రి హరీష్ రావు చేసిన ట్వీట్ సైతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ది ప్యారడైజ్ చిత్రాన్ని డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల తెరకెక్కించారు. ఇందులో కయాదులోహర్ హీరోయిన్గా నటించగా, మోహన్ బాబు విలన్ గా నటించారు.

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you