Radhika Sarathkumar:టాలీవుడ్, కోలీవుడ్ లో ప్రముఖ నటిగా , నిర్మాతగా పేరు సంపాదించిన రాధికా శరత్ కుమార్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎన్నో వైవిధ్యమైన పాత్రలలో ఎంతో మంది హీరోల చిత్రాలలో నటించి తన నటనతో పేరు సంపాదించిన రాధికా శరత్ కుమార్ పలు రకాల లేడీ ఓరియంటెడ్ చిత్రాలలో కూడా నటించింది. ఇప్పటికీ తన నటనతో ఆకట్టుకుంటున్న రాధికా శరత్ కుమార్ తాజాగా సోషల్ మీడియా వేదికగా రివ్యూలు, కామెంట్స్ చేసేవారి తీరుపైన ఫైర్ అయినట్టు తెలుస్తోంది.. వాటి గురించి చూద్దాం.
సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడకూడదు..
నటి రాధిక శరత్ కుమార్(Radhika Sarathkumar) మాట్లాడుతూ .. సినిమాల పైన అభిప్రాయాలు చెప్పే క్రమంలో నటీనటులు , వారి కుటుంబ సభ్యుల యొక్క వ్యక్తిగత జీవితాలను కూడా చాలామంది ప్రస్తావిస్తూ అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని, ఇలా చేయడం సరికాదు అంటూ ఆమె ఫైర్ అయ్యింది. విమర్శలకు హద్దులు ఉండాలి.. వాటి పేరుతో వ్యక్తిగత దూషణలకు పాల్పడే వారి పైన కచ్చితంగా చర్యలు తీసుకునేలా వ్యవస్థ ఉండాలని ఆమె అభిప్రాయంగా తెలియజేశారు. ఒక కార్యక్రమంలో పాల్గొన్న నటి రాధిక ఈ అంశం పైన తన అభిప్రాయాలను సైతం తెలిపారు.
also read:Prabhash:ప్రభాస్ సినిమాకి టికెట్స్ ఇవ్వలేదని థియేటర్ని కొనేసిన నిర్మాత..!
చేతిలో ఫోన్ .. అందులో ఇంటర్నెట్ ఉంటే సరిపోదు..
డిజిటల్ ప్లాట్ ఫామ్ లు అందుబాటులోకి వచ్చిన తర్వాత సినిమా రివ్యూ పై.. సోషల్ మీడియాలో కామెంట్స్ చాలా మితిమీరిపోతున్నాయని, విమర్శలు కూడా హద్దులు దాటుతున్నాయి.. సినిమా నచ్చకపోతే కేవలం వాటి గురించి మాట్లాడే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుంది.. కానీ ఆ సినిమాల పేరుతో నటీనటుల వ్యక్తిగత జీవితాలను, కుటుంబాలకు సంబంధించిన ప్రస్తావనలు తీసుకురావడం సరైనది కాదు. స్మార్ట్ మొబైల్, ఇంటర్నెట్ ప్రతి ఒక్కరి చేతిలో ఉండడం వల్ల సోషల్ మీడియాలో ఏదైనా చెప్పొచ్చు అనే ధోరణిలో చాలామంది పెరిగిపోతున్నారని, యూట్యూబ్ ఇంప్రూయెన్సర్స్ తీరును ప్రశ్నించే వ్యవస్థ లేకపోవడం వల్లే ఇలా స్వేచ్ఛగా వ్యవహరిస్తున్నారని తెలిపింది.
also read:Mahesh Babu:డోంట్ ట్రబుల్ ది ట్రబుల్.. మూవీపై మహేష్ రివ్యూ..!
వ్యక్తిగత విమర్శలు చేయడం మానుకోండి..
సినిమా రివ్యూల పేరుతో వ్యక్తిగత విమర్శలు చేయడం మహిళలను కించపరిచేల మాట్లాడడం వంటి అంశాలు తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం ఉన్నదని.. వీటి పైన ఇప్పుడు స్పందించకపోతే రాబోయే రోజుల్లో మరింత పెరిగిపోయే అవకాశం ఉంటుంది అంటూ తెలిపారు. ఇక రివ్యూల విషయానికి వస్తే ప్రస్తుతం వాటిపైన సరైన స్పష్టత అనేది కనిపించడం లేదు.. కొన్ని సందర్భాలలో సినిమా నాణ్యతతో సంబంధం లేకుండా కావాలనే కొన్ని మంచి చిత్రాలకు అసత్య ప్రచారం చేస్తున్నారు. సినిమా బాగున్నప్పటికీ ఉద్దేశపూర్వకంగానే సోషల్ మీడియాలో తప్పుడు అభిప్రాయాలను వైరల్ చేయడం వల్ల చిత్ర బృందానికి నష్టం కలుగుతుంది. విమర్శించే హక్కును కాపాడుతూనే వ్యక్తిగత దూషణలు అసభ్య వ్యాఖ్యలను నియంత్రించేలా ఏదైనా ఒక బలమైన వ్యవస్థ అవసరం అంటూ రాధిక తన అభిప్రాయంగా తెలియజేసింది. ప్రస్తుతం నటి రాధిక చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.




