Friday, October 2, 2026
HomeLATESTVaishnav tej:మొదటి సినిమాతోనే 100 కోట్లహిట్ కొట్టిన మెగా హీరో.. ఇప్పుడేం చేస్తున్నారంటే..?

Vaishnav tej:మొదటి సినిమాతోనే 100 కోట్లహిట్ కొట్టిన మెగా హీరో.. ఇప్పుడేం చేస్తున్నారంటే..?

Vaishnav tej: మెగా హీరో వైష్ణవ్ తేజ్ మూడేళ్లయిన కొత్త ప్రాజెక్టు ప్రకటించకపోవడంతో కనీసం ఈసారైనా హిట్ అందుకుంటారా అంటూ అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

on
- Advertisement -banner Ad

Vaishnav tej:టాలీవుడ్ లో మెగా ఫ్యామిలీకి సంబంధించి నిరంతరం సినిమాల గురించి లేదా పదవుల గురించి ఏదో ఒక విషయం వినిపిస్తూనే ఉంది. మెగా ఫ్యామిలీ నుంచి హీరోగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన వారిలో వైష్ణవ్ తేజ్ కూడా ఒకరు. తన మొదటి సినిమా ఉప్పెనతో భారీ విజయాన్ని అందుకున్న ఈ హీరో ఈ చిత్రాన్ని బుచ్చిబాబు సనా దర్శకత్వంలో తెరకెక్కించారు. ఇందులో హీరోయిన్గా కృతి శెట్టి నటించి మంచి పాపులారిటీ సంపాదించుకుంది. ఆ తర్వాత ఈ జోడీకి కూడా భారీగా క్రేజ్ పెరిగిపోయింది. మొదటి చిత్రంతోనే అటు వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి ఇద్దరూ కూడా 100 కోట్ల మార్కుని అందుకోవడంతో ఖచ్చితంగా టాలీవుడ్లో తమదైన ముద్ర వేసుకుంటారని భావించారు.

మూడేళ్లయిన కొత్త ప్రాజెక్టు ప్రకటించని మెగా హీరో..

కానీ ఉప్పెన సినిమా అందించిన విజయాన్ని వైష్ణవ్ తేజ్ ఆ తర్వాత సినిమాలతో అందుకోలేకపోయారు. విభిన్నమైన కథలను (కొండ పొలం, రంగ రంగ వైభవంగా, ఆది కేశవ)ఎంచుకుంటూ ముందుకు వెళుతున్నప్పటికీ సినిమాలన్నీ ఘోరంగా డిజాస్టర్ అవుతున్నాయి. దీంతో వైష్ణవ్(Vaishnav tej) కెరియర్ విషయంలో చాలా గ్యాప్ ఏర్పడిందని మెగా అభిమానులు భావిస్తున్నారు. దాదాపుగా మూడేళ్లుగా తన తదుపరి సినిమా ఏంటి అనే విషయంపై ఇప్పటివరకు అధికారికంగా ప్రకటించలేదు.

- Advertisement -
Advertisement

also read:Sigma Movie Review : సిగ్మా మూవీ రివ్యూ.. జాసన్ సంజయ్ డైరెక్షన్ ఎలా ఉందంటే?

ఆడియన్స్ లో పెరుగుతున్న ఆసక్తి..

వైష్ణవ్ తేజ్ మాత్రం తనకు సరిపోయే కథ పాత్ర కోసమే ఎదురు చూస్తున్నా అంటూ చెబుతున్నారు. ఇప్పటికే చాలామంది దర్శకులు కథలు చెబుతున్నా..వింటున్నప్పటికీ ఇప్పటివరకు ఏ ప్రాజెక్టును అధికారికంగా ఫైనల్ చేయలేదట. మొదటి సినిమాతో 100 కోట్ల క్లబ్ లోకి వెళ్ళిన ఈ హీరో ఇప్పుడు వరుస పరాజయాలతో వెనుకపడ్డారు. ఈ నేపథ్యంలోనే తదుపరి సినిమా సక్సెస్ అయితేనే వైష్ణవ్ తేజ్ కెరియర్ నిలబడుతుందని ఆయన అభిమానులు భావిస్తున్నారు. మరి వైష్ణవ్ తేజ్ ఎలాంటి కథతో అభిమానులను అలరిస్తారో చూడాలి మరి.

- Advertisement -
Advertisement

also read:Dorothy Movie:కీర్తి సురేష్ ‘డోరతీ’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్..!

మరి కృతి శెట్టి సంగతి ఏంటి?

కృతి శెట్టి కూడా గత సినిమాలతో వరుసగా ఫ్లాపులను ఎదుర్కొంటోంది. దీంతో తన కెరియర్ విషయంలో సతమతమవుతున్న ఈ ముద్దుగుమ్మ రెమ్యూనరేషన్ ని కూడా పెద్దగా డిమాండ్ చేయలేదని వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు తాజాగా డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో రాబోతున్న జనవరి 12న విడుదల అనే చిత్రంలో మరో హీరోయిన్గా నటిస్తోంది. ఇందులో విక్టరీ వెంకటేష్, కళ్యాణ్ రామ్ నటిస్తూ ఉండగా హీరోయిన్ కీర్తి సురేష్ కూడా ఇందులో నటిస్తోంది. మరి ఈ సినిమాతో నైనా కృతి శెట్టి కెరియర్ మలుపు తిరుగుతుందేమో చూడాలి మరి. చాలా గ్యాప్ తీసుకొని మరి తెలుగు సినిమాలలో నటిస్తున్న కృతి శెట్టి తమిళంలో వరుసగా సినిమాలలో నటిస్తోంది.

- Advertisement -
Advertisement

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you