Friday, October 2, 2026
HomeLATESTVaralakshmi Sarathkumar:తల్లి కావడంపై వరలక్ష్మి శరత్ కుమార్ షాకింగ్ కామెంట్స్..!

Varalakshmi Sarathkumar:తల్లి కావడంపై వరలక్ష్మి శరత్ కుమార్ షాకింగ్ కామెంట్స్..!

Varalakshmi Sarathkumar: ప్రముఖ హీరోయిన్ వరలక్ష్మి శరత్ కుమార్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొని తల్లి కావడంపై చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

on
- Advertisement -banner Ad

Varalakshmi Sarathkumar:కోలీవుడ్, టాలీవుడ్ లో హీరోయిన్గా పలు చిత్రాలలో నటించిన వరలక్ష్మి శరత్ కుమార్ కి అంత త్వరగా గుర్తింపు రాలేదు. కానీ ఎప్పుడైతే విలన్ గా చిత్రాలలో కీలకమైన పాత్రలలో నటించిందో అప్పటినుంచి ఈమె పేరు భారీ పాపులారిటీ అందుకుంది. అంతేకాకుండా లేడీ ఓరియెంటెడ్ చిత్రాలలో కూడా నటిస్తూ మంచి పవర్ఫుల్ పాత్రలతో తెలుగు ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంది వరలక్ష్మి శరత్ కుమార్. గతంలో స్టార్ హీరోతో ప్రేమలో ఉందనే విధంగా వార్తలు వినిపించాయి. కానీ 2024లో ముంబై ప్రాంతానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త నికోలయ్ సచ్ దేవ్ ను ప్రేమించి మరీ వివాహం చేసుకుంది.

పిల్లల్ని కనడం పై వరలక్ష్మి శరత్ కుమార్ కామెంట్..

తాజాగా తన వ్యక్తిగత జీవితం పైన వరలక్ష్మి శరత్ కుమార్ (Varalakshmi Sarathkumar)పలు కీలకమైన వ్యాఖ్యలు చేసింది.. పిల్లల్ని కనడం, కనక పోవడం అనేది ప్రతి దంపతుల యొక్క తమ వ్యక్తిగత పరిస్థితులు అభిప్రాయాల ఆధారంగానే ఈ నిర్ణయం తీసుకుంటారంటూ తెలిపింది. తనకు పిల్లలు వద్దని ,తన భర్త నికోలయ్ సచ్ దేవ్ కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నారని తెలిపారు. తాము తీసుకున్నటువంటి ఈ నిర్ణయం మంచి పేరేంటింగ్ నిర్ణయం అవుతుందని తన అభిప్రాయంగా తెలిపింది వరలక్ష్మి శరత్ కుమార్.

- Advertisement -
Advertisement

ALSO READ:Tollywood 2027:సీనియర్ హీరోలంతా సంక్రాంతి టార్గెట్..!

ఆమె మా కూతురు..

ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నప్పుడు తన వ్యక్తిగత విషయాలను తెలిపింది. తనకు పిల్లలు కనడం అంటే ఇష్టం లేదు. నేను కనలేనని కాదు కానీ నాకు పిల్లలు వద్దు ఇది చాలా స్పష్టమైన ఎంపిక.. తన భర్తకు కూడా పిల్లలు వద్దని తెలిపారని తెలిపింది. తన భర్తకు గత వివాహం నుంచి ఒక కుమార్తె ఉందని వరలక్ష్మి శరత్ కుమార్ తెలిపారు ఆమెను తాను ఎప్పుడూ కూడా తమ కూతురుగానే భావిస్తున్నామని తెలిపింది. ఇక తమ వద్ద ఉన్న రెండు కుక్కపిల్లలు కూడా తమ పిల్లలాగే చూసుకుంటున్నామని పిల్లలు వద్దనుకోవడం పూర్తిగా తమ వ్యక్తిగత నిర్ణయమే అంటూ తెలిపింది. ఈ విషయంలో మా ఇద్దరి ఆలోచనలు ఒకేలా ఉన్నాయంటూ వెల్లడించింది.

- Advertisement -
Advertisement

ALSO READ:Vaishnav tej:మొదటి సినిమాతోనే 100 కోట్లహిట్ కొట్టిన మెగా హీరో.. ఇప్పుడేం చేస్తున్నారంటే..?

బాధ్యత లేకపోతే పిల్లలు వద్దు..

పేరెంటింగ్ అనేది చాలా బాధ్యతతో కూడుకున్న విషయమని.. మీరు ఈ విషయంలో సిద్ధంగా లేకపోతే పిల్లలను కనకండి అదే మంచి పేరెంటింగ్ యొక్క నిర్ణయం అని తాను భావిస్తానని చెప్పుకొచ్చింది. వరలక్ష్మి శరత్ కుమార్ సినీ కెరియర్ విషయానికి వస్తే 2012లో పెద్దపొడి అనే తమిళ చిత్రం ద్వారా తన కెరీర్ ని మొదలు పెట్టి చివరిగా సరస్వతి అనే చిత్రంలో నటించింది. ప్రస్తుతం పోలీస్ కంప్లైంట్, రిజానా వంటి చిత్రాలలో నటిస్తోంది. గతంలో కూడా పలు షోలకి హోస్టుగా కూడా వ్యవహరించింది వరలక్ష్మి శరత్ కుమార్. వివాహమనంతరం వరలక్ష్మి శరత్ కుమార్ పలు చిత్రాలతో బిజీగా ఉన్నది.

- Advertisement -
Advertisement

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you