Wednesday, October 7, 2026
HomeLATESTKoffee With Karan 9: విజయ్‌-రష్మిక జంటగా ‘కాఫీ విత్ కరణ్‌ 9’.. ఆ సీక్రెట్స్‌...

Koffee With Karan 9: విజయ్‌-రష్మిక జంటగా ‘కాఫీ విత్ కరణ్‌ 9’.. ఆ సీక్రెట్స్‌ బయటపడనున్నాయా?

Koffee With Karan 9 : బాలీవుడ్‌ దర్శకుడు, నిర్మాత కరణ్‌ జోహార్‌ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ప్రముఖ సెలబ్రిటీ టాక్‌ షో ‘కాఫీ విత్ కరణ్‌’ సీజన్‌ 9 త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు తెలుస్తోంది.

on
- Advertisement -banner Ad

Koffee With Karan 9 : బాలీవుడ్‌ దర్శకుడు, నిర్మాత కరణ్‌ జోహార్‌ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ప్రముఖ సెలబ్రిటీ టాక్‌ షో ‘కాఫీ విత్ కరణ్‌’ సీజన్‌ 9(Koffee With Karan 9) త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు తెలుస్తోంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే దీపావళి సందర్భంగా తొలి ఎపిసోడ్‌ ప్రసారం కానున్నట్లు సమాచారం. ఈ సీజన్‌లో టాలీవుడ్‌ నుంచి విజయ్‌ దేవరకొండ, అల్లు అర్జున్‌ వంటి స్టార్లు సందడి చేయనున్నారని ఇప్పటికే వార్తలు వచ్చాయి.

తొలిసారి జంటగా విజయ్‌, రష్మిక :

అయితే ఈ సీజన్‌లో విజయ్‌ దేవరకొండతో పాటు ఆయన భార్య, స్టార్‌ హీరోయిన్‌ రష్మిక మందన్న కూడా పాల్గొననున్నట్లు తెలుస్తోంది. పెళ్లికి ముందు ‘గీత గోవిందం’, ‘డియర్‌ కామ్రేడ్‌’ చిత్రాల్లో జంటగా నటించిన ఈ ఇద్దరూ.. పెళ్లి తర్వాత తొలిసారి ‘రణబాలి’ సినిమాలో కలిసి కనిపించబోతున్నారు. ఈ సినిమా అక్టోబర్‌ 16న విడుదల కానున్న నేపథ్యంలో, మూవీ ప్రమోషన్‌తో పాటు తమ లవ్‌ జర్నీ గురించి కూడా కరణ్‌ జోహార్‌ ఆసక్తికరమైన ప్రశ్నలు అడగనున్నట్లు సమాచారం. ఈ ఎపిసోడ్‌ షూటింగ్‌ను త్వరలో ముంబైలో నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారట.

- Advertisement -
Advertisement

ALSO READ: Allu Arjun:స్నేహారెడ్డి పెట్టుకున్న హెయిర్ క్లిప్ ధర ఎంతో తెలిస్తే షాక్!

విజయ్‌కు ఇది రెండోసారి :

‘కాఫీ విత్ కరణ్‌’లో విజయ్‌, రష్మిక కలిసి పాల్గొనడం ఇదే తొలిసారి. అయితే విజయ్‌ దేవరకొండకు మాత్రం ఈ షో కొత్త కాదు. గతంలో ‘లైగర్‌’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా సీజన్‌ 7లో ఆయన అనన్య పాండేతో కలిసి కరణ్‌ జోహార్‌ షోలో పాల్గొన్నారు. దీంతో కరణ్‌ అడిగే వ్యక్తిగత, ఆసక్తికరమైన ప్రశ్నలకు విజయ్‌ మరోసారి ఎలా స్పందిస్తారనే ఆసక్తి నెలకొంది.

- Advertisement -
Advertisement

చివరి సీజన్‌గా ప్రత్యేకంగా? :

‘కాఫీ విత్ కరణ్‌’కు సీజన్‌ 9తో ముగింపు పలకనున్నారనే ప్రచారం కూడా జరుగుతోంది. ఇదే చివరి సీజన్‌ అయితే దీన్ని మరింత ప్రత్యేకంగా తీర్చిదిద్దేందుకు కరణ్‌ జోహార్‌ భారీ సెలబ్రిటీ లైనప్‌ను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.

బాలీవుడ్‌ నుంచి భారీ సెలబ్రిటీలు :

విజయ్‌, రష్మిక, అల్లు అర్జున్‌తో పాటు విక్కీ కౌశల్‌, దిల్జీత్‌ దోసాంజ్‌ కూడా ఈ సీజన్‌లో పాల్గొననున్నట్లు సమాచారం. ‘దిల్‌ చాహ్తా హై’ 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆమిర్‌ ఖాన్‌, సైఫ్‌ అలీఖాన్‌, ఫర్హాన్‌ అక్తర్‌, అక్షయ్‌ ఖన్నాతో ప్రత్యేక ఎపిసోడ్‌ను ప్లాన్ చేస్తున్నారట.

- Advertisement -
Advertisement

ALSO READ: Ravi Teja:రవితేజ-వివేక్ ఆత్రేయ మూవీపై క్రేజీ అప్‌డేట్.. హీరోయిన్ ఎవరో తెలుసా?

అలాగే ‘కభీ ఖుషీ కభీ గమ్‌’ 25వ వార్షికోత్సవం సందర్భంగా కాజోల్‌, కరీనా కపూర్‌ ఖాన్‌, జయ బచ్చన్‌తో మరో స్పెషల్‌ ఎపిసోడ్‌ ఉండనున్నట్లు తెలుస్తోంది. అక్షయ్‌ కుమార్‌, అజయ్‌ దేవగణ్‌తోనూ ప్రత్యేక షో ఉంటుందని సమాచారం. వరుణ్‌ ధావన్‌, కృతి సనన్‌, సమయ్‌ రైనా, ఫరా ఖాన్‌, అనన్య పాండే, షనయా కపూర్‌, లక్ష్య, జాన్వీ కపూర్‌ వంటి పలువురు సెలబ్రిటీలు కూడా ఈ సీజన్‌లో సందడి చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. మరి చివరి సీజన్‌గా ప్రచారం జరుగుతున్న ‘కాఫీ విత్ కరణ్‌ 9’ ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you