Kiara Advani:బాలీవుడ్ నటి కియారా అద్వానీ, హీరో సిద్ధార్థ్ మల్హోత్రా దంపతులకు సంబంధించి ఓ ఆసక్తికరమైన వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కొంతకాలం ప్రేమలో ఉన్న ఈ జంట 2023లో వివాహ బంధంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. రాజస్థాన్‌లోని జైసల్మేర్‌లో జరిగిన వీరి పెళ్లి వేడుకలు అప్పట్లో బాలీవుడ్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పెళ్లి తర్వాత కూడా తమ వ్యక్తిగత జీవితాన్ని వీలైనంత వరకు ప్రైవేట్‌గా ఉంచుతూ వస్తున్నారు.
తొలి సంతానం తర్వాత మారిన జీవితం :
2025లో కియారా, సిద్ధార్థ్ దంపతులు తమ తొలి సంతానంగా ఓ పాపకు తల్లిదండ్రులయ్యారు. ఆ చిన్నారికి ‘సారాయ్’ అనే పేరు పెTTaaru. అయితే కుమార్తెకు సంబంధించిన ఫొటోలు, వ్యక్తిగత వివరాలను మాత్రం ఈ జంట పెద్దగా బయటకు వెల్లడించలేదు. తమ బిడ్డ జీవితంలోకి వచ్చిన తర్వాత ప్రపంచమే కొత్తగా అనిపిస్తోందని పలుమార్లు చెప్పుకొచ్చారు.
రెండోసారి తల్లిదండ్రులుగా..:
ఇప్పుడు కియారా, సిద్ధార్థ్ మరోసారి తల్లిదండ్రులు కాబోతున్నారనే వార్త అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది. ఈ సందర్భంగా ఈ జంట.. తమ కుటుంబంలోకి మరో చిన్నారి రాబోతున్న ఆనందాన్ని పంచుకున్నట్లు తెలుస్తోంది. “మరోసారి దేవుడు మాకు అత్యంత గొప్ప బహుమతిని ప్రసాదించాడు. మా హృదయాలు ప్రేమ, కృతజ్ఞతలతో నిండిపోయాయి” అంటూ భావోద్వేగ సందేశాన్ని షేర్ చేశారు.
also read:Koffee With Karan 9: విజయ్-రష్మిక జంటగా ‘కాఫీ విత్ కరణ్ 9’.. ఆ సీక్రెట్స్ బయటపడనున్నాయా?
అభిమానుల నుంచి శుభాకాంక్షలు :
ఈ వార్త వెలుగులోకి వచ్చిన వెంటనే కియారా, సిద్ధార్థ్‌కు అభిమానుల నుంచి పెద్ద ఎత్తున శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. బాలీవుడ్‌కు చెందిన పలువురు ప్రముఖులు, స్నేహితులు కూడా ఈ జంటకు అభినందనలు తెలుపుతున్నారు. రెండో బిడ్డకు సంబంధించిన మరిన్ని వివరాలను ఈ జంట ఎప్పుడు వెల్లడిస్తారనే ఆసక్తి కూడా నెలకొంది.
also read:Allu Arjun:స్నేహారెడ్డి పెట్టుకున్న హెయిర్ క్లిప్ ధర ఎంతో తెలిస్తే షాక్!
‘భరత్ అనే నేను’తో టాలీవుడ్ ఎంట్రీ :
కియారా అద్వానీకి (Kiara Advani)టాలీవుడ్‌తోనూ ప్రత్యేక అనుబంధం ఉంది. మహేష్‌బాబు హీరోగా నటించిన ‘భరత్ అనే నేను’ సినిమాతో ఆమె తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. తొలి చిత్రంతోనే మంచి విజయాన్ని అందుకున్నారు. ఆ తర్వాత రామ్‌చరణ్‌తో కలిసి ‘వినయ విధేయ రామ’లో నటించారు. ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోయినా, రామ్‌చరణ్, కియారా జోడీకి మాత్రం మంచి గుర్తింపు వచ్చింది.
మళ్లీ ‘గేమ్ చేంజర్’లో జోడీ :
రామ్‌చరణ్, కియారా కాంబినేషన్‌కు వచ్చిన క్రేజ్ కారణంగా ఈ జంట మరోసారి ‘గేమ్ చేంజర్’ కోసం కలిసి పనిచేసింది. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో వీరిద్దరూ జంటగా కనిపించారు. అయితే ఈ చిత్రం కూడా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోయింది. ప్రస్తుతం సినిమాలతో పాటు కుటుంబ జీవితంలోనూ ఆనందకరమైన క్షణాలను ఆస్వాదిస్తున్న కియారా, సిద్ధార్థ్.. మరో కొత్త బాధ్యతకు సిద్ధమవుతున్నారనే వార్త అభిమానుల్లో ఆనందాన్ని నింపుతోంది.
View this post on Instagram




