Wednesday, October 7, 2026
HomeLATESTDhanush:కొత్త పార్టీకి పేరు రిజిస్టర్ చేయించిన ధనుష్.. పొలిటికల్ ఎంట్రీ ఖాయమేనా?

Dhanush:కొత్త పార్టీకి పేరు రిజిస్టర్ చేయించిన ధనుష్.. పొలిటికల్ ఎంట్రీ ఖాయమేనా?

Dhanush: ప్రముఖ కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ పొలిటికల్ ఎంట్రీ కి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి.

on
- Advertisement -banner Ad

Dhanush:కోలీవుడ్లో స్టార్ హీరోగా పేరు సంపాదించిన ధనుష్ త్వరలోనే రాజకీయాలలోకి అడుగుపెట్టబోతున్నారంటూ గత కొద్దిరోజులుగా వార్తలు వినిపించాయి. ఇప్పటికే ఆయన తమిళగ ఎళుచ్చి కళగం .. పేరుతో పార్టీకి సంబంధించి రిజిస్ట్రేషన్ కూడా చేయించారనే ప్రచారం కూడా ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తోంది. త్వరలోనే దీనిపైన ధనుష్ నుంచి అధికారికంగా ప్రకటన రాబోతోందని టాక్ వినిపిస్తోంది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ధనుష్ పోటీ చేయాలనే ఆలోచనలో కూడా ఉన్నట్లు గతం నుంచే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయంపై తన మామ సూపర్ స్టార్ రజనీకాంత్ మద్దతు కూడా ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ధనుష్ పొలిటికల్ ఎంట్రీ..

గత కొన్ని నెలలుగా ధనుష్ తన అభిమాన సంఘాలతో పలు రకాల సమావేశాలు నిర్వహించడంతో తన పేరుని మరింత బలోపేతం చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. అభిమాన సంఘాల ద్వారా కూడా కొన్ని రకాల సేవా కార్యక్రమాలు చేయడం వంటివి కూడా చేస్తూ ఉన్నారు ధనుష్. ఈ వార్తలన్నీ కూడా ధనుష్ పొలిటికల్ ఎంట్రీ పై కన్ఫర్మ్ చేయడానికి మరింత బలాన్ని చేకూరుస్తున్నాయని చెప్పవచ్చు. కానీ ధనుష్ నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారికంగా స్పందన అయితే రాలేదు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో తమిళ స్టార్ హీరో విజయ్ టీవీకే పార్టీ తరఫున పోటీ చేసి భారీ విజయాన్ని అందుకున్నారు.

- Advertisement -
Advertisement

also read: Allu Arjun:స్నేహారెడ్డి పెట్టుకున్న హెయిర్ క్లిప్ ధర ఎంతో తెలిస్తే షాక్!

అఫీషియల్ అనౌన్స్మెంట్ ఎప్పుడు?

ఇప్పుడు తమిళనాడు ముఖ్యమంత్రిగా ముందుకు వెళుతున్న విజయ్ గెలుపుతోనే రాజకీయాలపై స్టార్స్ కి సైతం మరింత ఆసక్తి పెరిగిందనే విధంగా టాక్ వినిపిస్తోంది. ఆ దిశగానే చాలామంది సెలబ్రిటీలు కూడా అడుగులు వేస్తున్నారని, కోలీవుడ్ ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవేళ ధనుష్ నిజంగానే పొలిటికల్ ఎంట్రీ ఇస్తే తన మామ రజనీకాంత్ ద్వారా తీరని కోరిక . ధనుష్ ద్వారా తీరబోతోందని అభిమానులు సైతం భావిస్తున్నారు. ధనుష్ పొలిటికల్ ఎంట్రీ వార్తలు వినిపిస్తున్న సమయం నుంచి అభిమానులు అయితే ఫుల్ ఖుషి గా కనిపిస్తున్నారు. మరి ఈ విషయం పైన అఫీషియల్ గా ఎప్పుడు ప్రకటిస్తారో చూడాలి.

- Advertisement -
Advertisement

also read:కొత్త పార్టీకి పేరు రిజిస్టర్ చేయించిన ధనుష్.. పొలిటికల్ ఎంట్రీ ఖాయమేనా?

ధనుష్ సినిమాలు..

ధనుష్ విషయానికి వస్తే ఒకవైపు హీరోగా మరొకవైపు నిర్మాతగా దూసుకుపోతున్న ఈ మధ్యకాలంలో దర్శకుడిగా కూడా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. అంతేకాదు తన అసాధారణమైన ప్రతిభతో నేషనల్ అవార్డులు కూడా అందుకుంటూ అందరిని ఆశ్చర్యపరుస్తున్నారు. ప్రస్తుతం రాజ్ కుమార్ పెరియాసామి దర్శకత్వంలో D55, తమిళ్ హరసన్ పచ్చముత్తు దర్శకత్వంలో D56 సినిమాలో ధనుష్ ఇళయరాజా బయోపిక్ లో కూడా నటిస్తున్నారు. ఇలాంటి సమయంలో ఈ పొలిటికల్ వార్తలు తెరపైకి రావడం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

- Advertisement -
Advertisement

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you