RanaBali Trailer:టాలీవుడ్ క్యూట్ కపుల్స్ గా పేరు సంపాదించిన రష్మిక, విజయ్ దేవరకొండ తాజాగా ప్రధాన పాత్రలో నటించిన చిత్రం రణబాలి. ఈ చిత్రాన్ని డైరెక్టర్ రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వములో తెరకెక్కిస్తున్నారు. వివాహమనంతరం కలిసి నటిస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా పైన భారీగా అంచనాలు పెరిగిపోతున్నాయి.19వ శతాబ్దం నేపథ్యంలో 1854-1878 మధ్య బ్రిటిష్ ఇండియా కాలంలో జరిగిన ఒక యదార్థ చారిత్రక సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారనే వార్తలు వినిపించాయి. ఈ సినిమా స్వాతంత్ర పోరాటానికి సంబంధించింది కాదు అని డైరెక్టర్ రాహుల్ తాజాగా క్లారిటీ ఇచ్చారు.
రణబాలి ట్రైలర్ రిలీజ్..
ఇప్పుడు ఎట్టకేలకు రణబాలి సినిమా ట్రైలర్(RanaBali Trailer) కూడా కొన్ని నిమిషాల క్రితం విడుదల అయ్యింది. సినిమా ట్రైలర్ విషయానికి వస్తే.. అదిగో కనపడుతోంది మన సింగనమల కొండ అనే డైలాగ్ తో మొదలవుతుంది.. పైన గుహలో 200 ఏళ్ళ క్రిందట జీవ సమాధి పొందారు అవధూత.. ఈ ఊరుని కాసే మన భద్ర మల్లన్న తాత.. అంటూ డైలాగ్ మొదలవుతుంది. ఆ తర్వాత నటి ఈశ్వరి రావు కొండపైన ప్రసవిస్తుంది.. దీంతో గుహలో నుంచి ఒక అగోర వచ్చి రణబాలి అనే పేరుని పిలుస్తారు.
also read:Indian 3:ఇండియన్ 3 తో రాబోతున్న కమలహాసన్..!
ట్రైలర్ ఎలా ఉందంటే?
ట్రైలర్లో విజయ్ దేవరకొండ (సింగనమల బొబ్బిలి రణబాలి) గా కనిపించబోతున్నారు. రష్మిక (జయమ్మ) ,ఆర్నాల్డ్ ఓస్లు విలన్ గా కనిపించబోతున్నారు. ముఖ్యంగా బ్రిటిష్ పరిపాలన గురించి వారు చేసిన అన్యాయాలు, వారు చేసిన హింసలు వాటిని చాలా క్లియర్ గా చూపించారు డైరెక్టర్ రాహుల్ సంకృత్యన్, అలాగే రష్మిక, విజయ్ దేవరకొండ తమ తమ పాత్రలలో అద్భుతంగా నటించారని చెప్పవచ్చు. ముఖ్యంగా విజయ్ దేవరకొండ ఈ సినిమాకి హైలెట్గా నిలిచే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కీలకమైన పాత్రలు, పలువురు సెలబ్రిటీలు నటిస్తున్నట్లు కనిపిస్తోంది. మొత్తానికి ట్రైలర్తో ఆకట్టుకున్న రణబాలి.. మరి సినిమా ఎలా ఉంటుందో చూడాలి మరి.
also read:Spirit:ప్రకాష్ రాజ్ ఔట్.. స్పిరిట్‌లోకి అనిల్ కపూర్ ఎంట్రీ? ఇదే అసలు ట్విస్ట్!
దసరా బరిలో రణబాలి..
రణబాలి సినిమా దసరా స్పెషల్ సందర్భంగా అక్టోబర్ 16వ తేదీన పలు రకాల భాషలలో గ్రాండ్గా ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్నారు మైత్రి మూవీస్ మేకర్స్ వారు ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తోనే నిర్మిస్తున్నారు. టాక్సీ వాలా చిత్రం తర్వాత విజయ్ దేవరకొండ, డైరెక్టర్ రాహుల్ కాంబినేషన్లో సినిమా అనౌన్స్మెంట్ చేసినప్పటి నుంచి ఈ సినిమా పైన ఆసక్తి పెంచేసింది. మరి ఈ సినిమాతో విజయ్ దేవరకొండ ఎలాంటి విజయాన్ని అందుకుంటారో చూడాలి మరి అలాగే రష్మిక కూడా తన భర్తకి సక్సెస్ ఇవ్వాలని అభిమానులు కోరుకుంటున్నారు. గతంలో రష్మిక, విజయ్ దేవరకొండ కాంబినేషన్లో వచ్చిన గీతాగోవిందం సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత డియర్ కామ్రేడ్ సినిమాలో నటించిన ఈ సినిమాతో ఈ జోడి క్యూట్ కపుల్స్ గా పేరు సంపాదించారు.




