Thursday, October 22, 2026
HomeLATESTRamayana OTT:రామాయణం రిలీజ్‌లో బిగ్ ట్విస్ట్.. సబ్‌స్క్రిప్షన్ ఉన్నా డబ్బులు కట్టాల్సిందేనా?

Ramayana OTT:రామాయణం రిలీజ్‌లో బిగ్ ట్విస్ట్.. సబ్‌స్క్రిప్షన్ ఉన్నా డబ్బులు కట్టాల్సిందేనా?

Ramayana OTT:‘రామాయణ: రైజ్ ఆఫ్ ది లెజెండ్’ డిజిటల్ హక్కులను జియోహాట్‌స్టార్ దక్కించుకున్నట్లు తెలుస్తోంది. అయితే సాధారణ సబ్‌స్క్రిప్షన్‌తోనే సినిమాను ఉచితంగా చూసే అవకాశం ఉండకపోవచ్చని, పే-పర్-వ్యూ విధానంలో అందుబాటులోకి తీసుకురావాలనే అంశం చర్చలో ఉంది.

on
- Advertisement -banner Ad

Ramayana OTT:భారతీయ ఇతిహాసం రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం ‘రామాయణ: రైజ్ ఆఫ్ ది లెజెండ్’పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. బాలీవుడ్ స్టార్ రణ్‌బీర్ కపూర్ శ్రీరాముడిగా, సాయి పల్లవి సీతగా, యశ్ రావణుడిగా కనిపించనుండటంతో ఈ సినిమాపై ఆసక్తి మరింత పెరిగింది. అయితే ఈ చిత్రానికి సంబంధించిన ఓటీటీ విడుదల విధానం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా ఓటీటీ సబ్‌స్క్రిప్షన్ ఉంటే సినిమాలను చూడవచ్చు. కానీ ఈ చిత్రం విషయంలో ప్రత్యేకంగా డబ్బులు చెల్లించాల్సి వస్తుందనే వార్తలు ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి.

ఓటీటీ విడుదలలో కొత్త విధానం? :

‘రామాయణ: రైజ్ ఆఫ్ ది లెజెండ్’ డిజిటల్(Ramayana OTT) హక్కులను జియోహాట్‌స్టార్ దక్కించుకున్నట్లు తెలుస్తోంది. అయితే సాధారణ సబ్‌స్క్రిప్షన్‌తోనే సినిమాను ఉచితంగా చూసే అవకాశం ఉండకపోవచ్చని, పే-పర్-వ్యూ (Pay-Per-View) విధానంలో అందుబాటులోకి తీసుకురావాలనే అంశం చర్చలో ఉంది. ఈ విధానంలో ప్రేక్షకులు తమ రెగ్యులర్ సబ్‌స్క్రిప్షన్‌తో పాటు సినిమాను చూడటానికి అదనంగా డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది.

- Advertisement -
Advertisement

నవంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల:

నమిత్ మల్హోత్రా నిర్మాణంలో రూపొందుతున్న ఈ భారీ పౌరాణిక చిత్రానికి నితీష్ తివారీ దర్శకత్వం వహిస్తున్నారు. 2026 దీపావళి సందర్భంగా నవంబర్ 5న తొలి భాగాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనుnnaaru. ఐమాక్స్ 3డీ ఫార్మాట్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, ఇంగ్లీష్ భాషల్లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్రబృందం ప్రణాళికలు సిద్ధం చేసినట్లు సమాచారం.

also read:Upasana Konidela:చరణ్‌ను అలా చూడలేను.. ఉపాసన మనసులో మాట ఇదే!

- Advertisement -
Advertisement

అంతర్జాతీయ స్థాయి సాంకేతిక నిపుణులు:

‘రామాయణ: రైజ్ ఆఫ్ ది లెజెండ్’ చిత్రాన్ని అంతర్జాతీయ స్థాయి సాంకేతిక ప్రమాణాలతో రూపొందించేందుకు చిత్ర బృందం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంది. విజువల్ ఎఫెక్ట్స్ రంగంలో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన డీఎన్‌ఈజీ (DNEG), ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్, మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్ వంటి ప్రముఖ సంస్థలు ఈ ప్రాజెక్టులో కీలక పాత్ర పోషిస్తున్నాయి. అద్భుతమైన గ్రాఫిక్స్, అత్యాధునిక సాంకేతికతతో భారతీయ ఇతిహాసాన్ని వెండితెరపై కొత్త అనుభూతిగా ఆవిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నారు.

మరోవైపు, సంగీత విభాగం కూడా ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా మారింది. హాలీవుడ్‌లో ప్రత్యేక గుర్తింపు సంపాదించిన హ్యాన్స్ జిమ్మర్, భారతీయ సంగీత దిగ్గజం ఏఆర్ రెహమాన్ కలిసి బాణీలు సమకూరుస్తున్నారు. వీరిద్దరి కలయికతో సంగీతం ప్రేక్షకులకు మరపురాని అనుభూతిని అందిస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు. భారీ నిర్మాణ విలువలు, అంతర్జాతీయ సాంకేతిక నైపుణ్యం ఈ చిత్రంపై అంచనాలను మరింత పెంచుతున్నాయి.

- Advertisement -
Advertisement

also read:Rashmika Mandanna:నాకు నచ్చకపోతే అస్సలు చేయను.. రష్మిక మందన్న షాకింగ్ కామెంట్స్!

భారీ తారాగణంతో రెండు భాగాలు:

ఈ సినిమాలో రణ్‌బీర్ కపూర్ శ్రీరాముడిగా, సాయి పల్లవి సీతగా, యశ్ రావణుడిగా, సన్నీ డియోల్ హనుమంతుడిగా, రవి దూబే లక్ష్మణుడిగా నటిస్తున్నారు. ఇతర కీలక పాత్రల్లో పలువురు ప్రముఖ నటీనటులు కనిపించనున్నారు. తొలి భాగం 2026లో, రెండో భాగం 2027లో విడుదల కానున్నట్లు సమాచారం.

ప్రేక్షకులకు అదనపు భారం తప్పదా?:

థియేటర్లలో సినిమా చూసిన తర్వాత ఓటీటీలోనూ వీక్షించాలనుకునే అభిమానులకు అదనపు చెల్లింపుల విధానం కొత్త అనుభవం కానుంది. అయితే పే-పర్-వ్యూ విధానం నిజంగా అమలవుతుందా? సబ్‌స్క్రిప్షన్ ఉన్నవారికి ప్రత్యేక మినహాయింపులు ఉంటాయా? అన్నది అధికారిక ప్రకటన తర్వాతే స్పష్టమవుతుంది. ఈ భారీ చిత్రం ఓటీటీ రంగంలో కొత్త ట్రెండ్‌కు నాంది పలుకుతుందా అనేది ఆసక్తికరంగా మారింది.

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you