Friday, October 23, 2026
HomeLATESTTeja sajja:పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన హీరో తేజ సజ్జ..!

Teja sajja:పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన హీరో తేజ సజ్జ..!

Teja sajja: టాలీవుడ్ లో యంగ్ హీరో గా గుర్తింపు తెచ్చుకున్న తేజ సజ్జ తన పెళ్లి పై స్పందిస్తూ క్లారిటీ ఇచ్చారు.

on
- Advertisement -banner Ad

Teja sajja:టాలీవుడ్ హీరోలలో ఒకరైన తేజ సజ్జా ప్రస్తుతం మంచి సక్సెస్ అందుకుంటూ దూసుకుపోతున్నారు. గత కొద్ది రోజులుగా తేజ సజ్జా వివాహం చేసుకోబోతున్నారని వార్తలు వినిపించాయి. అయితే మొదట ఇవన్నీ రూమర్స్ అనుకున్నప్పటికీ ఇప్పుడు తాజాగా తన పెళ్లి విషయంపై క్లారిటీ ఇచ్చారు. తాను త్వరలోనే వివాహం చేసుకోబోతున్నానని ప్రకటించారు. తన పెళ్లికి సంబంధించిన ఆసక్తికరమైన విషయాలను కూడా అభిమానులతో పంచుకున్నారు తేజ సజ్జా. డిసెంబర్లో రాజస్థాన్లోని ఉదయపూర్ లో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోబోతున్నట్లు వెల్లడించారు.

పెళ్లి వార్తలు నిజమే – తేజ సజ్జ

వచ్చే నెల నవంబర్లో ఎంగేజ్మెంట్ చేసుకోబోతున్నట్లు వెల్లడించారు. తన కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలోనే ఈ వివాహ వేడుక జరుగుతుందని తెలిపారు .పెళ్లి తర్వాత హైదరాబాదులో రిసెప్షన్ ఏర్పాటు చేయబోతున్నట్లు తెలియజేశారు. పూర్తిగా పెద్దలు కుదిర్చిన వివాహమని, తమ తల్లిదండ్రులే ఈ వివాహాన్ని నిశ్చయించారంటూ తేజ సజ్జా (Teja sajja)తెలిపారు .

- Advertisement -
Advertisement

అమెరికా అమ్మాయితో ఏడడుగులు..

తాను చేసుకోబోయే అమ్మాయి ఫ్యామిలీకి సినీ ఇండస్ట్రీకి ఎటువంటి సంబంధం లేదని, వారి కుటుంబం మొత్తం టెక్నాలజీ బిజినెస్ వైపుగానే ఉన్నట్లు తెలియజేశారు. తనకు కాబోయే భార్య అమెరికాలో పెరిగిందని, సినీ గ్లామర్ ప్రపంచానికి పూర్తిగా దూరంగా ఉంటుందంటూ తెలియజేశారు. ఆమె స్వభావం తనకు బాగా నచ్చిందని , భవిష్యత్తులో కూడా ఆమె ప్రైవసీకి ఎటువంటి ఇబ్బంది కలిగించకుండా ఉంటానంటూ తేజ సజ్జా తెలియజేశారు.

తేజ సజ్జ సినిమాలు..

తేజ సజ్జ సినిమాల విషయానికి వస్తే.. మొదట చైల్డ్ యాక్టర్ గా తన కెరీర్ ని మొదలుపెట్టి.. ఓ బేబీ చిత్రంలో కీలకమైన పాత్రలో నటించి ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత జాంబిరెడ్డి సినిమాతో హీరోగా పరిచయమై మంచి విజయాన్ని అందుకున్నారు. ఆ తర్వాత హనుమాన్, మిరాయ్ వంటి చిత్రాలతో బ్యాక్ టు బ్యాక్ విజయాలను అందుకున్నారు తేజ సజ్జా. ప్రస్తుతం జాంబిరెడ్డి 2, మిరాయ్ 2, హనుమాన్ సీక్వెల్ లో కనిపించబోతున్నారు. అలాగే ప్రస్తుతం ఆమెజాన్ ప్రైమ్ వీడియో ఓటిటిలో స్ట్రిమింగ్ అవుతున్న ది ట్రోటర్స్ రియాలిటీ షో కి హొస్టుగా కూడా వ్యవహరిస్తున్నారు.

- Advertisement -
Advertisement

అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇవ్వాలని మెగా హీరోకి డిమాండ్..

మొత్తానికి తేజ సజ్జా తన పెళ్లి విషయం పైన అఫీషియల్ గా ప్రకటించడంతో అభిమానులు సైతం ఖుషీ అవుతున్నారు. మరి ఎంగేజ్మెంట్ అనంతరం తన కాబోయే భార్యతో కలిసి ఫోటోలు షేర్ చేయాలని అభిమానులు సైతం కోరుకుంటున్నారు. ఒకవైపు పాన్ ఇండియా వైడ్ సినిమాలు చేస్తూనే… మరొకవైపు వివాహ బంధంలోకి అడుగుపెడుతున్నారు తేజ సజ్జా. అలాగే మరో మెగా హీరో కూడా వివాహ బంధంలోకి అడుగు పెట్టబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కానీ ఇప్పటివరకు ఈ విషయం పైన అటు మెగా కుటుంబ సభ్యులు కానీ మెగా హీరో సాయి ధరంతేజ్ గాని ఎటువంటి అధికారికంగా ప్రకటన ఇవ్వలేదు. తేజ సజ్జా ఇచ్చిన ఈ అఫీషియల్ స్టేట్మెంట్ చూసైనా మెగా హీరో క్లారిటీ ఇవ్వాలని అభిమానులు సైతం డిమాండ్ చేస్తున్నారు.

- Advertisement -
Advertisement

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you